పాత ప్రభలవీడు బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. సగిలేటి ఒడ్డున ఉన్న రాతి మీద ఉన్న మునీశ్వరుని బొమ్మకు దిగువన రాసి ఉన్న శాసనమిది. ఇందులోని విషయాలు అస్పష్టం. శాసనపాఠం: 1. శ్రీ – 0దజియ్య [లు] 2. 0కారితాతమ 3. ల్ల జియ్య [ల||] (Reference: No 16 of 1967, Inscriptions of Andhrapradesh – Cuddapah District Part III)పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది… శాసన పాఠం: 1. మల్లెం కొం- 2. డు బంగారు 3. సుబయ్య శె- 4. ట్టి ప్రారంభం శే- 5. శ్న దేవాళయ 6. ము కొ[డ్కు] చెన్న 7. య్య శెట్టి 8. కట్టిచ్చడ 9. మయిన – 10. ది. Reference: (No 113 of 1967) […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది. అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన ప్రజలు నివశిస్తుండేవారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలు అవీ గ్రామస్తుల ఆధ్వర్యంలోనే జరిగేవి. ఒకసారి రధోత్సవం విషయంలో ఒంటిమిట్ట కంసాలీలకు […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందిట. ఒక రోజు ఉదయగిరి సీమలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన కంపనరాయలు అనే రాజు ఇప్పుడు ఒంటిమిట్ట ఉన్న ప్రాంతానికి తన సైన్యంతో సహా వచ్చినాడు. ఇది అప్పట్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక […]పూర్తి వివరాలు ...
పౌరాణికం 1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది. 2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు. ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం. భౌగోళికం తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ […]పూర్తి వివరాలు ...
తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ కాలిన్ మెకంజి.1810-15 మధ్య మద్రాస్ surveyor general గా 1816-21 వరకు భారతదేశ మొదటి surveyor generalగా పనిచేసిన ఈయన గ్రామ చరిత్రలను సేకరించాడు.వీటినే కైఫియత్లు,దండెకవిలె లు అంటారు.వీటిలో కడప కైఫియత్లను 5 భాగాలు గా కడప c.p.brown memorial పూర్తి వివరాలు ...
బుడ్డాయపల్లె కడప తాలూకాలోని చెన్నూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరికి ఒక మైలు దూరంలో, పొలాలలో విరిగిన రాయిపైన దొరికిన శాసనమిది. ఇందులోని వివరాలు అస్పష్టం. శాసన పాఠము: 1. – – – వ – 2. – – – . శ్రీ 3. – – మచ్చే 4. – పనద – గవిణ 5. – – మకషిప 6. – – కేరిమీ. వ్వక 7. – […]పూర్తి వివరాలు ...
పందివీడు, బద్వేలు తాలూకాలో సగిలేటి ఒడ్డున ఉన్న ఒక గ్రామము. ఈ గ్రామంలోని చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉన్న గరుడ స్తూపంపైన చెక్కబడిన శాసనమిది. శార్వరి నామ తెలుగు సంవత్సరంలో పోతరాజు అనే ఆయన చెన్నకేశవుని సన్నిధిలో గరుడాళ్వారుల ప్రతిష్టించిన విషయం ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. శాసన పాఠము: 1. [శుభ] మస్తు సావ౯రి సంవత్సర 2. పడేటు చెన్న కేసవ దేవర సంనిధి 3. గరుడాడు (ళు) వారిని క్రాంజ పోత 4. – […]పూర్తి వివరాలు ...
తంగేడుపల్లి బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. ఆ ఊరి పొలాలలో ఉన్న ఒక శిల్పం పైన లభ్యమైన శాసనమిది. ఒక వీరపుత్రుని గురించి ఇందులో చెక్కబడి ఉంది. ఇతరత్రా వివరాలు లేవు, అస్పష్టం. శాసన పాఠము: 1. మార? మం [దు] 2. – కొడు [కు] 3. – – మాల – – 4. – యవీరుడు – వీర 5. – – తమ వీరుడు Ref: (No17 of 1967)పూర్తి వివరాలు ...