ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన జిల్లాలలో కడప ఒకటి. సీడెడ్ జిల్లాలుగా పిలువబడే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. రాక్షస తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల ఆధీనంలోకి పోయింది. తరువాత హైదరాలీ, టిప్పుసుల్తాన్ ఆధీనంలోకి వచ్చింది. 1792లో టిప్పు ఓడిపోయి శ్రీరంగపట్టణము సంధి వలన ఈ రాయలసీమ నైజాంకు వెళ్లింది. హైదరాబాదు నవాబుతో ఈస్టిండియా కంపెనీ వారు సైన్య సహకార పద్ధతి ద్వారా అక్టోబర్ 20, 1800 సంవత్సరములో సీడెడ్ […]పూర్తి వివరాలు ...
శ్రీభాగ్ ఒప్పందం నేపధ్యం మరియు అందులోని అంశాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది. ఇందుకు ఒక ఉదాహరణ 1927లో జనమంచి శేషేంద్ర శర్మ గారు రాసిన ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకములో కూడా చూడవచ్చు. పాపం శర్మ గారు కడప జిల్లాలో […]పూర్తి వివరాలు ...
భారతదేశంలోనే ఏకైక శాసనం… నీటి పారుదల సౌకర్యాలను గురించి తెలుపుతున్న శాసనాల్లో కూడా కడప జిల్లాకు ప్రత్యేక స్థానముంది. బుక్కరాయల కుమారుడు, ఉదయగిరి రాజ్యపాలకుడు భవదూరమహీపతి (భాస్కరరాయలు) క్రీ.శ. 1369లో పోరుమామిళ్లలో అనంతరాజసాగరమనే తటాకాన్ని నిర్మించి ఆ సందర్భంలో ఒక శాసనాన్ని వేయించాడు. చెరువుకట్ట మీద రెండు బండలపై చెక్కబడి ఉన్న ఈ శాసనం మధ్యయుగాల్లోని తటాక నిర్మాణ కౌశలానికి ప్రబల సాక్ష్యంగా దర్శనమిస్తుంది. తటాక నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. […]పూర్తి వివరాలు ...
స్మారక శిలలు, వీరగల్లులు … శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం. రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి […]పూర్తి వివరాలు ...
తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే […]పూర్తి వివరాలు ...
వైయెస్సార్ జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మొహనగిరి పై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. మోపూరుకు దిగువన ప్రవహించే పెద్దేరు (గుర్రప్ప యేరు) , సింహద్రిపురం ప్రాంతం నుండీ పారే మొగమూరు యేరు ( చిన్నేరు ) , పులివెందుల ప్రాంతం నుండీ పారే ఉద్ధండవాగు నల్లచెరువు పల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. ఈ భైరవేశ్వర దేవాలయం త్రివేణీ సంగమ […]పూర్తి వివరాలు ...
వై.ఎస్.ఆర్. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం మైదుకూరు ప్రాంతానికే కాక జిల్లాలోని ఎన్నో విశిష్టమైన ఆలయాల సరసన నిలిచి, భక్త జనకోటి పారవశ్యంలో మునిగి, ముక్తిని పొందే దివ్యధామంగా వెలుగొందుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా అలరారుతోన్న ఈ […]పూర్తి వివరాలు ...
భారతదేశపు దూర దక్షిణ ప్రాంతానికి కర్నాటకమని పేరు. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కర్నాటక యుద్ధాలుగా పేరు పొందాయి. భారతదేశంలో ఆంగ్ల, ఫ్రెంచి రాజకీయ భవితవ్యమును ఈ కర్నాటక యుద్ధాలే నిర్ణయించినాయి. ఈ యుద్ధాలే ఆంగ్ల సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1748-56 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ కర్నాటక యుద్ధంలో కడప నవాబు మౌసింఖాన్ (మూచామియా), కర్నూలు నవాబు హిమ్మత్ బహదూర్ ఖాన్ లు పాల్గొని అనేక రాజకీయ హత్యలకు కారణమైనారు. దక్కన్ […]పూర్తి వివరాలు ...
అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక సభ’ స్థాపించారు. అప్పటి నుండి క్రమశిక్షణతో ‘హరిశ్చంద్ర’, ‘శకుంతల’ నాటకాలు తయారుచేసి ఇటు రాయలసీమ. అటు సర్కారు జిల్లాలలో విశేషంగా ప్రదర్శనలిస్తూ నాటక […]పూర్తి వివరాలు ...