ప్రాచీన కాలం నుంచి కడప జిల్లా కవులకు, కళాకారులకే గాక వీరులకు, వీర నారీమణులకు, త్యాగధనులకు కూడా పుట్టినిల్లు. విజయనగర రాజులు వారి రాజ్యంలో పన్నులు వసూలు చేయుటకు పాళెగాండ్రను నియమించుకున్నారు. 16,17 శతాబ్దాములలో విజయనగర పతనానంతరము పాలెగాండ్రు, జమీందారుల ప్రాబల్యము పెరిగి, వీరు ప్రజాకంటకులుగా, దోపిడీదారులుగా, వర్ణనాతీతమైన దారుణాలకు పాల్పడుతూ, ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకునేవారు. క్రీ.శ. 1800 సంవత్సరం కడప జిల్లాకు కలెక్టరుగా వచ్చిన థామస్‌మన్రో, మేజర్ జనరల్ డి.క్యాంప్‌బెల్ అనే సేనానిని […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా శిద్దవటం నుండి నాలుగు ఇండ్ల పేర్లుగల 95 మంది కోమట్లు రైల్వే కోడూరు సమీపంలోని కుంట ప్రాంతానికి వచ్చి ఇండ్లు నిర్మించుకొన్నారు. వారు దారిన వచ్చిపోయే వారికి అవసరమైన దినుసులు అమ్ముకొని జీవించేవారు. కోమట్లు ఏర్పరిచిన ఊరు అయినందున ఆ ప్రాంతానికి శెట్టి కుంట అనే పేరు వాడుకలోనికి తెచ్చారు. (కడప జిల్లాలో కోమట్లను (వైశ్యులను) ‘శెట్టి’ అని వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న తమిళనాడులో సైతం కోమట్లను ‘శెట్టియార్’ లేదా ‘చెట్టియార్’ అని […]పూర్తి వివరాలు ...
కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోదనలో ‘దివిటీలమల్లు సెల’గా స్థానిక ప్రజలు భావించే కొండపేటు ఆదిమానవుల ఆవాసంగా ఉండేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ”మల్లుగానిబండ’గా స్థానికులు పిలిచే ఈ ప్రదేశంలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో జంతువులు, మనుషుల చిత్రాలను గీశారు. దీంతో మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని ఇంట పెరిగి అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచి, బ్రిటీషువారినే ఎదిరించిన దివిటీలమల్లు ఆదిమానవుడికి అవాసమైన కొండపేటులోనే తలదాచుకున్నట్లు […]పూర్తి వివరాలు ...
కడప: మైదుకూరు సమీపంలోని రాణిబాయి దగ్గర ఉన్న ‘మల్లుగానిబండ’పై ఆదిమానవులు గీసిన బొమ్మలను (రేఖా చిత్రాలను) యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ వెలుగులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ శనివారం ఈ రేఖాచిత్రాలను విడుదల చేశారు. చిత్రాలను అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం అవి బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగాలకు చెందినవిగా తేల్చింది. చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ […]పూర్తి వివరాలు ...
ఇటీవలి కాలంలో హేతువాద సంస్థలు, మాధ్యమాల ప్రచారం కారణంగా ప్రజలలో చాలా వరకు మూఢ నమ్మకాలను, ఆచారాలను సమర్ధించే పరిస్తితి తగ్గింది. కానీ ఒకప్పుడు ఈ విశ్వాసాలు అధిక సంఖ్యలో ఉండేవి. 19వ శతాబ్దం (1800 – 1900)లో కడప జిల్లా ప్రజలలో పశుపక్షాదులకు సంబంధించి ఎలాంటి విశ్వాసాలు (మూఢనమ్మకాలు)ఉండేవో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పటికీ వీటిలో కొన్ని అక్కడక్కడా కనిపించవచ్చు. 1875లో కడప జిల్లాకు సబ్ కలెక్టర్ గా వ్యవహరించిన జే.డి.గ్రిబుల్ అనే ఆయన […]పూర్తి వివరాలు ...
గొడ్రాండ్రు దిగంబరులై భజనలు, నాట్యం చేస్తూ పార్శ్వనాథుని ఆలింగనం చేసుకునేవారు. రానురాను ఇది సభ్య ప్రపంచంలో అశ్లీలమై బూతు తిరునాళ్లుగా మారింది. తరువాత బ్రిటిష్ పాలకుల కాలం నాటికి కడప జిల్లా కలెక్టరు సర్ థామస్ మన్రో 1800- 1807 ప్రాంతంలో అశ్లీలతతో కూడిన ఆరాధనోత్సవాలను నిలిపేశారు. మరి కొంత కాలానికి మరింత జుగుప్సాకరంగా తిరునాళ్ల కొనసాగింది. 1918లో జిల్లా కలెక్టరు గారైన హెచ్.హెచ్. బర్కిట్...పూర్తి వివరాలు ...
కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయటపడినాయి. యెల్లంపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డి నాగ ప్రసాద రెడ్డి,మూలే శంకర రెడ్డి పొలాల వద్దగల భైరవుని బావివద్ద ఈ శాసనాలు,శిల్పాలు ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు అరబోలు వీరాస్వామి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని ఈవిషయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ […]పూర్తి వివరాలు ...
మట్లి వెంకట్రామరాజు మైసూరు నవాబైన హైదరాలీకి కప్పము కట్టడానికి తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన మైసూరు నవాబు హైదరాలీ దండెత్తి వచ్చి వెంకట్రామరాజును తరిమి సిద్దవటం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. హైదరాలీ ఈ సిద్ధవటం కోటను కప్పం చెల్లించు విధానంపై చిట్వేలి జమిందారునకు స్వాధీనం చేసినాడు. ఈ జమిందారు భాకరాపేట పరిసర ప్రాంతాలలో ఉన్న పట్ర పాళెగార్ల వ్యవహారాలకు దోపిడీలకు భయపడి, ముదిరెడ్డిపల్లె పాళెగాడైన గోపాలరెడ్డి ఆయన సోదరుడు నర్సింరెడ్డికి అమ్మివేశాడు. ఈ ముదిరెడ్డిపల్లి సోదరులు దుర్మార్గులు. పేద […]పూర్తి వివరాలు ...
ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్లతో జరిగిన రెండు, మూడు […]పూర్తి వివరాలు ...