*అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన *అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు చోళుల పాలనకు తార్కాణం గా నిలుస్తున్నాయి. క్రీ.శ. 11 వ శతాబ్దంలో రాజరాజ చోళ -3 అత్తిరాల ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. ఆలయ నిర్మాణం అంతకుముందే జరిగి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది. * ఈ ప్రాంతం అధిరాజేంద్రచోళ మండలంగా, ‘మేల్పాకనాడు’ గా పిలువబడుతూ ఉండేదని ఈ శాసనాలవల్ల తెలుస్తోంది. అప్పట్లో అత్తిరాలను ‘తిరువత్తూరు’ పిలిచేవారని […]పూర్తి వివరాలు ...
దండనాయకుడిని హతమార్చిన పెద్దపసుపుల ప్రజలు పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజు కళ్యాణీ పట్టణాన్నిరాజధానిగా చేసుకుని గండికోటసీమతో సహా పాలన చేస్తున్న (క్రీ.శ.1064) కాలంలో కటకచంద్రనాయకుడు అనే దండనాథుడు జమ్మలమడుగు ప్రాంత రాజ్యపాలనను పర్వవేక్షించేవాడు. ఈ నేపథ్యంలో పెద్దపసుపుల, దానవులపాడు గ్రామాల మధ్య పొలిమేర తగాదా తలెత్తింది. ఇది రెండు గ్రామాల ప్రజల మధ్య పోరాటానికి దారి తీసింది. ఈ విషయం త్రైలోక్యమల్ల మహారాజు దృష్టికి వెళ్ళింది. దీంతో రాజు ఈ తగాదాను పరిష్కరించాల్సిందిగా కటకచంద్ర దండనాయకున్ని […]పూర్తి వివరాలు ...
శాసనము : వండాడి శాసనము ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా శాసనాలు - సంస్కృతి చరిత్ర అనేది డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి గారి పరిశోధనా గ్రంధము. సాహితీ సామ్రాజ్యము (ప్రొద్దుటూరు) వారి ప్రచురణ. ప్రచురణ సంవత్సరము: 1995. శాసనాల ఆధారంగా కడప జిల్లా సంస్కృతి చరిత్రలను ఆవిష్కరించిన అమూల్యమైన గ్రంధం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...
ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: 1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య 2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర 3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు 4.ఇన్నల్వురు సాక్షి 5.దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్ 6.అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ 7.తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా […]పూర్తి వివరాలు ...
ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి వైపు 1.అ స్వస్తిశ్రీ చోఱమ 2.హా రాజాధిరాజ ప 3.రమేశ్వర విక్రమాది 4.త్యశక్తి కొమర వి 5.క్రమాదితుల కొడుకు 6.[ళ్ళ్]కాశ్యపగోత్ర 7.[న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది 8.[వే]యురేనాణ్డు ఏఱు[వే] 9.[ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను 10.[ఱి]పాఱ రేవళ 11.మ్మ೯కాశ్యపగో 12.త్రి(త్రు)నికి ఇచ్చిన 13.[- -]చిఱుంబూరి ఉత్త 14.[- -]శ తూపు೯నదిశ […]పూర్తి వివరాలు ...
పాత ప్రభలవీడు బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. సగిలేటి ఒడ్డున ఉన్న రాతి మీద ఉన్న మునీశ్వరుని బొమ్మకు దిగువన రాసి ఉన్న శాసనమిది. ఇందులోని విషయాలు అస్పష్టం. శాసనపాఠం: 1. శ్రీ – 0దజియ్య [లు] 2. 0కారితాతమ 3. ల్ల జియ్య [ల||] (Reference: No 16 of 1967, Inscriptions of Andhrapradesh – Cuddapah District Part III)పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది… శాసన పాఠం: 1. మల్లెం కొం- 2. డు బంగారు 3. సుబయ్య శె- 4. ట్టి ప్రారంభం శే- 5. శ్న దేవాళయ 6. ము కొ[డ్కు] చెన్న 7. య్య శెట్టి 8. కట్టిచ్చడ 9. మయిన – 10. ది. Reference: (No 113 of 1967) […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది. అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన ప్రజలు నివశిస్తుండేవారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలు అవీ గ్రామస్తుల ఆధ్వర్యంలోనే జరిగేవి. ఒకసారి రధోత్సవం విషయంలో ఒంటిమిట్ట కంసాలీలకు […]పూర్తి వివరాలు ...