ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి […]పూర్తి వివరాలు ...
అతడి చెమట స్పర్శతో సూర్యుడు నిద్ర లేస్తాడు అతడి చేతిలో ప్రపంచం పద్మమై వికసిస్తుంది దుక్కి దున్ని నాట్లేసి కలుపుతీసి చెమట పరిమళాల్తో తడిసి ప్రపంచం ముఖంపై వసంతాల్ని కుమ్మరిస్తు నాడు అతడి శరీరం అగ్ని గోళం ఒక ప్రపంచ స్వప్నం మనకింత అన్నం పేట్టే నేల మన స్వప్నాలు మొలకెతే వడ్ల గింజ మన కొర్కెల్ని తీర్చే చెట్టు వసంతా ల్ని పంచే వనం అతడి హృదయం మంచుతో తడిసిన వెన్నెల లోయలు వానలో తడిసిన […]పూర్తి వివరాలు ...
నిత్యజీవితంలో సాధారణంగా యెంతో సహజమైన వ్యావహారిక భాషే మాట్లాడుతూంటారు. కానీ, వాళ్ళే కలం పట్టుకొనేటప్పటికి, శైలి కొరకు చేసే ప్రయత్నంలో, అనగా చెప్పేదేదో బాగా చెప్పాలనే ప్రయత్నంలో తమ సహజమైన వ్యావహారిక భాష మరిచిపోతుంటారు. సాధారణంగా రచయితలు పనిగట్టుకొని సాధనచేసి యేదో ఒక రచనా విధానాన్ని అలవరచుకుంటారు. దాన్నే శైలి అంటాం. శైలిలో గాంభీర్యమూ, ఉదాత్తతా, వేగమూ, ఉద్రతీ లాంటి గుణాలు బలీయంగా వున్నప్పుడు, ఆ శైలి పాఠకులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి భళీ అనిపించుకుంటుంది. యీ […]పూర్తి వివరాలు ...
పుస్తకం : సంవేదన , సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
దూరం సేను దున్నమాకు దిన్నెలెక్కి సూడమాకు ఊరి ముందర ఉలవ సల్లయ్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అతడుః కొత్త పల్లె చేలల్లో న కంది బాగా పండి ఉంది కంది కొయ్యను వస్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు కంది కొయ్యను వస్తావేమమ్మా .. ఆమెః కంది కొయ్యను వస్తానబ్బీ ఎడమ కంటికి ఎండా తగిలే కోరు మీటి గొడుగు పట్టయ్యో కొండాల రెడ్డి కోరు మీటి గొడుగు పట్టయ్యో ||దూరం సేను|| అతడుః వల్లూరు సేలల్లోన వరి బాగా […]పూర్తి వివరాలు ...
ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి అన్నాడు. చదవడానికే చాలా రోజులు తీసుకున్నాను. రెండు మూడు కథల్లో మార్పులు సూచించాను. చాలా శ్రద్ధగా విన్నారు. కథలు రెండు మూడు సార్లు […]పూర్తి వివరాలు ...
పుస్తకం : తాతాచార్ల కథలు’, రచన: సిపి బ్రౌన్, సంపాదకత్వం: బంగోరె, ప్రచురణ : జులై 1974లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
‘‘అస్సలాము అలైకుమ్.’’‘‘వా అలైకుమ్ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్ రహమాన్.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. ‘‘అదికాదు ముస్తఫా భాయ్, మీరొస్తున్నట్లు ఫోన్లో ఒక్కమాట చెప్పివుంటే బస్టాండుకు కారు పంపేవాన్ని కదా! మా ఇల్లు కనుక్కోవడానికి ఎన్నితంటాలు పడ్డారో ఏమో!’’‘‘లేదు రహమాన్ […]పూర్తి వివరాలు ...
“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్ మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్ వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది. కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ బాగా పంటలు పండించే వారు. ఒక సారి జొన్న పంట అద్భుతంగా విరగ పండింది. కంకులు తిప్పి ఎత్తైన రాశులు పోశారు. జొన్నలను […]పూర్తి వివరాలు ...