“విపరీతమైన ఉద్వేగ స్వభావం ఉండీ నేను కవిని ఎందుకు కాలేకపోయాను? వచన రచనే నన్నెందుకు ఆకర్షించింది? ఈ రెండు ప్రశ్నల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బహుశా మన సమాజంలో కవిత్వానికీ కవులకీ ఉన్న అగ్రవర్ణాధిక్యత గుర్తొచ్చినప్పుడెల్లా. వీటిని గురించి నేను కావాలని ఆలోచించడం కాదుగానీ నాకు బాల్యంలో పాఠం చెప్పిన వొక గురువు భూతపురి నారాయణస్వామి పండితుడూ, కవి. ఆ హైస్కూల్లో స్వయంగా తన కావ్యం శివభారతం పాఠం చెప్పిన, గొప్ప కవి గడియారం వేంకటశేషశాస్త్రి. ఇంట్లోవున్న […]పూర్తి వివరాలు ...
‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...
వాన మాట విన్పిస్తే చాలు చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి మేఘాల నీడలు కదిలితే చాలు కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది ఒక్క వాన వొంగితే చాలు ముక్కాలు పంటన్నా చేతికొస్తుంది ఎన్ని సాయంత్రాలు రేడియోల ముందు సాగిలబడ్డామనీ ! ఎన్ని సార్లు – జలరేఖల్ని లెక్కగట్టే ముసలాళ్ళ ముందు బీడీ ముక్కలమై మినుకు […]పూర్తి వివరాలు ...
వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు గుడిసెల కాడ – కల్లు గుడిసెల కాడ కయిలాసం పోతాండ్య కొన్నాల్లూ కల్లు తాగి వాడింటికీ వచ్చాంటే పెండ్లాము తన్నింది కొన్నాల్లూ దొరల […]పూర్తి వివరాలు ...
మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లాయర్లు , వాళ్ళ జూనియర్లు,ప్లీడరు గుమాస్తాలతోపాటూ రకరకాల కేసుల్లో ముద్దాయిలుగా,సాక్షులుగా వచ్చినవారితోనూ,వారిని వెంటబెట్టుకుని వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళతోనూ కాస్తంత సందడిగానే వుంది. చెట్టు క్రింద వున్న సిమెంటు బెంచీలవద్ద, కాంపౌండ్ లోనూ ఓ వారగా వున్న టీ క్యాంటీన్ వద్ద వున్న కొందరు లాయర్లు, బోనులో నిల్చున్నపుడు ప్రతివాది తరపున అడిగే ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు చెప్పాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తుండగా మెజిస్ట్రేట్ గారు అడిగే […]పూర్తి వివరాలు ...
వర్గం: ఇసుర్రాయి పాట రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా మొగుడెందు బోయెనో మొగము కళదప్పే నాగలోకము బోయి – నాగుడై నిలిచే దేవలోకము బోయి – దేవుడై నిలిచే చింతేల నీలమ్మ చెల్లెలున్నాది చేతి గాజులు పోయె చెల్లెలెవరమ్మ యేడొద్దు నీలమ్మ తల్లి వున్నాది తలమింద నీడ బోయె తల్లె యెవరుమ్మా యేడొద్దు నీలమ్మ తండ్రి వుండాడు తాళిబొట్టూ బోయె తండ్రెవరమ్మా యేడొద్దు నీలమ్మ అక్క వుండాది అయిన సంసారం బోయె అక్కెవరమ్మా యేడొద్దు నీలమ్మ బావలున్నారు బందూ […]పూర్తి వివరాలు ...
కడప: స్థానిక సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం వేదికగా ఆదివారం మల్లెమాల సాహిత్య పురస్కార ప్రధానోత్సవం, పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. సాహితీ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఆచార్య మధురాంతకం నరేంద్ర మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమమంలో సామాజిక ప్రయోజనంగా మధురాంతకం నరేంద్ర సాహిత్యం ఉంటుందని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ… మనుషు ల వ్యక్తిత్వంలో ఉన్న తేడాను […]పూర్తి వివరాలు ...
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. ఇటీవలి కాలంలో […]పూర్తి వివరాలు ...
రాయలసీమ బతుకు చిత్రాన్ని ఆరవోసిన ‘పెన్నేటి పాట’ సృష్టికర్త కీ.శే.విద్వాన్ విశ్వం గారు. ఇది వారి శతజయంతి సంవత్సరం. 1956లో విశ్వం గారు కావ్యస్తం చేసిన సీమ రంగని స్థితికీ, ఇప్పటి రంగని దుస్థితికీ మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. కాలం మారింది… సాంకేతికత పరుగులు పెట్టింది…పాలకుల బడాయి ఎల్లలు దాటింది…. దగాల మాటున, అమాయకత్వం చాటున సీమ బతుకు చిత్రం చిధ్రం అవుతూనే ఉంది! సాహితీ విరూపాక్షుడి ‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి వారు పీఠిక కట్టినారు. […]పూర్తి వివరాలు ...