అలమేలు మంగమ్మ – అనుగ్రహం అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని లేచాడు. కానీ కళ్ళు కనిపించడం లేదు. అమృతం లాంటి అమ్మ స్పర్శ; తేనెలూరే తల్లి పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగా […]పూర్తి వివరాలు ...
”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ వంటలు సేచ్చాండారు? ఏఏ ఊర్లనుండీ చుట్టాలు వచ్చినారు? ఊళ్ళో దేవుని మేరవని ఎట్ల జేచ్చే బాగుంటది? పార్యాట ఆపొద్దు ఏ జామున యాటపొట్టేళ్ళు, […]పూర్తి వివరాలు ...
ఇంటి పని ఎవరు చూస్తారు? నారయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్నచిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి, ఇంతలో తగవులాడతారు. అంతలో కలిసిపోతారు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. “ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకుని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు?” అని ఇంటివాళ్ళు దెప్పిపొడిచారు. “గాలి పాటలు కట్టిపెట్టి , అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చి పడేయ్” ఏ […]పూర్తి వివరాలు ...
పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. […]పూర్తి వివరాలు ...
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వచ్చే 9,10 తరగతులు చదువుతున్న బడి పిల్లోళ్ళు నేర్చుకొని రాయవలసిన పద్యాలు ఇవే అని బమ్మెర పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు తెలియచేశారు. భాగవత పద్యార్చనకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే కింది నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు – +91-9441337542 (విద్వాన్ కట్టా నరసింహులు), +91-9440200358 (కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమీషనర్, ధర్మ ప్రచార మండలి). పై పద్యాలను […]పూర్తి వివరాలు ...
పడమటి పక్క పొద్దు నల్లమల కొండల్లోకి సిన్నగ జారిపాయ. జంగిలిగొడ్లు కాయను మిట్టకు పోయిన ఆవుల రామన్న, మేకల్ను తోలకపోయిన చెవిటి కమాల్ అప్పుడే ఊళ్ళోకి బరుగొడ్లను, మేకల్ను తోలకచ్చిరి, సవరాలు, గడ్డాలు, చెయ్యడానికి పక్క పల్లెలకు పోయిన మంగళోల్ల రామన్న సంకకు పెట్టె,భూజాన మూటె ఎత్తుకుని వచ్చినాడు. ఏట్టో గుడ్డలుతకడానికి బొయిన సాకలోల్లు ఉతికిన గుడ్డల మూటల్ను ఈపునెత్తుకొని వర్సగా గూడ్సుబండ వచ్చినట్లు వచ్చాండిరి. చేలల్లోకి పన్లకు పోయిన ఆడోళ్ళునెత్తిన గడ్డిగంపలెత్తుకుని కొందరు, కూరాక్కు తమేటాలో, […]పూర్తి వివరాలు ...
ఆనందనామ సంవత్సరం చైత్ర శుధ్ధ విదియ అంటే మార్చి 28,1914 న పుట్టిన కీ.శే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికిది శతజయంతి సంవత్సరం… ఆ మహానుభావుడి సాహిత్య కృషీ.., శివతాండవ సృష్టీ.. మన సిరిపురి పొద్దుటూరులోనే జరిగింది. భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మ పురస్కారాలనూ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లను పుట్టపర్తి వారు అందుకున్నారు. పుట్టపర్తితో జానమద్ది హనుమచ్ఛాస్త్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠమిది… ఈ ఇంటర్వ్యూ చేసిన సంవత్సరం అందుబాటులో లేదు. […]పూర్తి వివరాలు ...
కరువుటెండలో వాడిపోతున్న మట్టిపూలు రాలిపోతున్నాయి వెన్నెముకగా నిలవాల్సిన అన్నదాతలు నిలువ నీడలేక నేలకొరగిపోతున్నారు మేఘాల చినుకుల కోత కరువులో ఆకలిమంటల కోత నిరంతరం సీమలో రైతన్నలకు రంపపు కోత పచ్చని ఆకులా నవ్వాల్సిన రైతన్న ఎండుటాకులా ఎముకలగూడై మిగిలాడు పరిమలాలు వెదజల్లాల్సిన మట్టివాసన కుల్లినశవాల వాసనతో మలినమయ్యింది బురద నీల్లలో దుక్కిదున్నాల్సిన కాల్లకు కాలం సంకెల్లువేసి వికట్టాటహాసం చేస్తుంది మట్టిమీద సంతకం చేయాల్సిన వానచినుకు మబ్బుతునక కౌగిట్లో బంధీగామారింది ఇంటిగుమ్మానికి ధీనంగా వేలాడే ఎండిపోయిన మామిడి ఆకుల్లా […]పూర్తి వివరాలు ...