తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 27, 2011
ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి గోచి బిగియ బెట్టి కోపమడచి గుట్టు మీరువాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడే గురువవుతాడు. గురువు కాదు పరమ గురువవుతాడు అని సెలవిస్తున్నాడు వేమన.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Saturday, February 26, 2011
వెర్రి వానికైన వేషధారికినైన రోగికైన పరమ యోగికైన స్ర్తీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ అతడు పిచ్చివాడు కావొచ్చు, సందర్భానికో వేషం మార్చేవాడు కావొచ్చు, వ్యాధిగ్రస్తుడు కావొచ్చు. చివరికి గొప్ప యోగి కావొచ్చు, వీరున్నారే, వీరు నలుగురూ స్ర్తీలను చూసినప్పుడు మాత్రం ఎంతో కొంత కామ వికారానికి లోనవుతారు అని వేమన లోకానుభవంతో చెప్తున్న మాట. ఈ పద్యంలో స్ర్తీ సౌందర్య శక్తితో పాటు అన్ని రకాల వారూ స్ర్తీ వ్యామోహానికి గురయ్యే లోకరీతిని చూపిస్తున్నాడు […]పూర్తి వివరాలు ...