॥పల్లవి॥కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేలకడలేని జన్మసాగర మీఁదనేల॥చ1॥దురితంబునకు నెల్లదొడవు మమకారంబు_లరిదిమమతలకుఁ దొడ వడియాసలుగురుతయిన యాసలకుఁ గోరికలు జీవనముపరగ నిన్నిటికి లంపటమె కారణము॥చ2॥తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ_ముదుటయిన తాపమున కుండఁగఁ జోటుపదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ-మదము పెంపునకుఁ దనమనసు కారణము॥చ3॥వెలయఁ దనమనసునకు వేంకటేశుఁడు గర్తబలిసి యాతనిఁ దలఁచుపనికిఁ దాఁ గర్తతలకొన్న తలఁపు లివి దైవమానుషముగాఁదలఁచి యాత్మేశ్వరునిఁ దలఁపంగ వలదా రాగము: ముఖారి రేకు: 0041-03 సంపుటము: 1-251 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమి నేయువార మిఁకనుఆమని చేలపచ్చలాయ బ్రదుకు॥చ1॥దీపనమనియెడి తీరని యాసరేపుమాపుఁ బెడరేఁచఁగాతోపునేయఁగరాక దురితపుతరవుల –కాపదలకు లోనాయ బ్రదుకు॥చ2॥వేడుకనెడి పెద్దవిడువనితరవువోడ కెపుడు వొద్దనుండఁగాజోడు విడువరాక చులుకఁదనంబున-కాడికెలకు లోనాయ బ్రదుకు॥చ3॥మమకారమనియెడిమాయతరవుతిమిర మెక్కించుక తియ్యఁగావిమలమూరితియైన వేంకటగిరిపతిఅమరఁ జేరక యరవాయ బ్రదుకు రాగము: వరాళి రేకు: 0041-02 సంపుటము: 1-250 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాక మరి యింతేల కలుగుఁ దమకేతముకుచేకొన్న కోరికలు చేరు నందాఁకా॥చ1॥దొరతనములన్నియును దొరసి నందాఁకానెరతనములన్నియును నెరపి నందాఁకాగరగరికలన్నియును కలసి నందాఁకావిరసంబులన్నియును విసుగు నందాఁకా॥చ2॥యెడమాటలన్నియును యెరసి నందాఁకాఅడియాసకోరికలు అదుకు నందాఁకాజడిగొన్నగుక్కిళ్లు చవిగొన్నయందాఁకవొడ లోముటలు మోహ ముడుగు నందాఁకా॥చ3॥యీ వెల్లఁ దమయాత్మ యిచ్చగించినదాఁకశ్రీవేంకటేశుకృప చేరు నందాఁకలోవెలుతున్నియును లోఁగొన్నయందాఁకవేవేగ బంధములు వీడు నందాఁకా రాగము: ఆహరి రేకు: 0041-01 సంపుటము: 1-249 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సొరిది సంసారంబు సుఖమా యిందరికివెరవెఱంగక వగల వేఁగేరు గాక॥చ1॥దేహములు దలఁప సుస్థిరములా ప్రాణులకు-నూహింప లోభ మట్లుండుఁ గాకమోహంబుచే వెనకముందెఱుఁగలేక తమ-దేహసుఖములు మరిగి తిరిగేరుగాక॥చ2॥నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికిఅలవి నిలుపఁగరాని యాస గాకబలువైన వట్టి విభ్రాంతిచే దగులువడితెలిసియును దెలియ కిటు తిరిగేరు గాక॥చ3॥నెఱయువిభవములెల్ల నిజములా యిందరికికొఱమాలినట్టి తమగుణముగాకయెఱుకతోఁ దిరువేంకటేశుఁ గొలువఁగలేకతెఱఁగుమాలిన బుద్ధిఁ దిరిగేరుగాక రాగము: ముఖారి రేకు: 0040-06 సంపుటము: 1-248 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త-మొకటికినిఁ జొరదు విధియోగమౌఁగాదో॥చ1॥దొరతనంబట కలిమి దోడుగాదట మంచి-తరుణులట మోహమట దైన్యంబటవిరహమట దారిద్య్రవివశుఁడౌనట చూడనరయ నిది కర్మఫలమౌనో కాదో॥చ2॥రాజసన్మానమట రవణహీనత్వమటతేజమట నలువంకఁ దిరిపెంబటవాజివాహనములట వాఁడి లేదట తొంటి-పూజఫలమిది వెలితిభోగమౌఁగాదో॥చ3॥యిలయెల్ల నేలునట ఇంట లేదట మిగులబలిమిగలదట సదా పరిభవమటచెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరునిగొలువనేరనివెనకఁ గొరఁతలౌఁగాదో రాగము: శ్రీరాగం రేకు: 0040-05 సంపుటము: 1-247 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాపినైననాపాలఁ గలిగి తోవచూపుమన్న నెందుఁ జూపరు॥చ1॥ధృతిదూలి జగమెల్లఁ దిరిగి వేసరితియితరాలయముల కేఁగియేఁగి వేసరితిగతమాలి పరులపైఁ గనలి వేసరితిమతిమాలి కులవిద్య మాని వేసరితి॥చ2॥విసిగి యాచారంబు విడిచి వేసరితిపసచెడి ప్రియములు పలికి వేసరితికొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితికసుగంది లోలోనె కాఁగి వేసరితి॥చ3॥కోవిదులగువారిఁ గొలిచి వేసరితిదైవములందరిఁ దడవి వేసరితిశ్రీవేంకటేశునిసేవ మాని వట్టి-సేవలన్నియు నేఁ జేసి వేసరితి రాగము: సామంతం రేకు: 0040-04 సంపుటము: 1-246 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నమో నారాయణాయ నమఃసమధికానందాయ సర్వేశ్వరాయ॥చ1॥ధరణీసతీఘనస్తనశైలపరిరంభ-పరిమళశ్రమజలప్రమదాయసరసిజనివాసినీసరసప్రణామయుత-చరణాయ తే నమో సకలాత్మకాయ॥చ2॥సత్యభామాముఖాంచనపత్రవల్లికా-నిత్యరచనక్రియానిపుణాయకాత్యాయనీస్తోత్రకామాయ తే నమోప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ॥చ3॥దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం-భావితామలపాదపంకజాయకైవల్యకామినీకాంతాయ తే నమోశ్రీవేంకటాచల శ్రీనివాసాయ రాగము: శ్రీరాగం రేకు: 0040-03 సంపుటము: 1-245 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెల్లవారనియ్యరో తెరువు యీ-పల్లదపుదొంగలెల్లఁ బారాడుతెరువుis-aber.net॥చ1॥దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువుచింతపూవుఁ దేనెలచెమ్మ తెరువుసంతులేని సతియింటిచాయ తెరువుయింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు॥చ2॥పాముపుట్ట గొంటిమీఁది పడుమటితెరువుచీమకదొంతరలోనిచిన్న తెరువుగాములుగాచుక యుండే గాలి తెరువుయేమిటా నెక్కడవుత నెరఁగనితెరువు॥చ3॥అన్ని దిక్కులునుఁ దానేయైవున్న తెరువుపన్నీటి కాలువలబాట తెరువుకన్నుల వేంకటపతిఁ గన్న తెరువుమిన్నునేలఁగూడినమీఁది తెరవు రాగము: కాంబోది రేకు: 0040-02 సంపుటము: 1-244 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నిగమనిగమాంత వర్ణిత మనోహర రూపనగరాజధరుఁడ శ్రీనారాయణా॥చ1॥దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య-నోపకకదా నన్ను నొడఁబరుపుచుపైపైనె సంసారబంధములఁ గట్టేవునాపలుకు చెల్లునా నారయణా॥చ2॥చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ-లేకకా నీవు బహులీల నన్నుకాకుసేసెదవు బహుకర్మములఁ బడువారునాకొలఁదివారలా నారాయణా॥చ3॥వివిదనిర్బంధముల వెడలఁద్రోయక నన్నుభవసాగరములఁ దడఁబడఁ జేతురాదివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశనవనీతచోర శ్రీనారాయణా రాగము: సామంతం రేకు: 0040-01 సంపుటము: 1-243 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...