॥పల్లవి॥కడగనుటే సౌఖ్యముగాక యీ-తడతాఁకుల నెందరు చనరిట్లా॥చ1॥నిలిచినదొకటే నిజమని తెలిసిన-తెలివే ఘన మింతియకాకాకలకాలము చీఁకటి దవ్వుకొనెడి-వలలభ్రమల నెవ్వరు వడ రిట్లా॥చ2॥పరహిత మిదియే పరమని తెలిసినపరిపక్వమె సంపదగాకాదురితవిధుల గొందుల సందులఁ బడిధరలోపల నెందరు చనరిట్లా॥చ3॥ఘనుఁడీ తిరువేంకటపతి యని కనికొనకెక్కుట తేఁకువగాకాపనిమాలిన యీపలులంపటములతనువు వేఁచు టెంతటిపని యిట్లా రాగము: పాడి రేకు: 0042-06 సంపుటము: 1-260 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నగధర నందగోప నరసింహ వోనగజవరద శ్రీ నారసింహ॥చ1॥నరసింహ పరంజోతి నరసింహా వీర-నరసింహ లక్ష్మీనారసింహానరసఖ బహుముఖ నారసింహా వో-నరకాంతక జేజే నారసింహా॥చ2॥నమో నమో పుండరీకనారసింహ వో-నమితసురాసురనారసింహానమకచమకహిత నారసింహ వోనముచిసూదనవంద్య నారసింహా॥చ3॥నవరసాలంకార నారసింహా వో-ననీతచోర శ్రీనారసింహానవగుణివేంకటానారసింహా వో-నవమూర్తి మండేము నారసింహ రాగము: సామంతం రేకు: 0042-05 సంపుటము: 1-259 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥భావమునఁ బరబ్రహ్మ మిదెకైవసమై మాకడ చూడ॥చ1॥నీలమేఘ ముపనిషదర్ధం బదెపాలుదొంగిలెడిబాలులలోచాలు నదియ మాజన్మరోగముల-చీల దివియ మముఁ జెలగిఁచ॥చ2॥తనియని వేదాంతరహంస్యంబదెవొనర గోపికలవుట్లపైపనుపడి సకలాపజ్జాలంబుల-పనులు దీర్చ మముఁ బాలించ॥చ3॥భయములేని పెనుఁబరమపదం బదెజయమగు వేంకటశైలముపైపయిపడు దురితపుఁబౌఁజుల నుక్కునలయము సేయ మము లాలించ రాగము: సామంతం రేకు: 0042-04 సంపుటము: 1-258 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదుపుండు మాన మందు వొయఁగదయ్య॥చ1॥నెత్తురు నెమ్ములు నిండినపుంటికితిత్తిలో సోదించనేరానిత్తెమూ వేనీళ్లఁ గడిగినానుమత్తిలి వుబ్బు మానదేలయ్యా॥చ2॥చల్లఁగూడు వెట్టి చల్లఁగా పొత్తులెల్లఁ బెట్టి బిగియించఁగానుకల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్లపిల్లలాఁ జాలఁ బెట్టెఁగదయ్యా॥చ3॥ఆదినుండి పాకమైనది యెవ్వ-రేదిరో మొక మేరుపడదుఆదరించి వేంకటాధిప నీవింకసోదించి మానఁజూడఁగదయ్యా రాగము: కన్నడగౌళ రేకు: 0042-03 సంపుటము: 1-257 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥బాలులతో వీథులలోఁ బారాడువాఁడుకోలలెత్లుక వుట్లు గొట్టీఁ జుండీ॥చ1॥నారికడపువక్కలు నానిన సనగలుచారపప్పుఁ దేనెలు చక్కెరలునుపేరిననేతులు నానబియ్యాలు నుట్ల నవేచేరి యశోదబిడ్డకు జెప్పేరు సుండీ॥చ2॥చక్కిలాలు నడుకులు సనిగెపప్పులునుచెక్కిన మెత్తనితూఁట చెఱకులునుపెక్కువగా నుట్లలో బిందెల నించిన వవేచక్కనెశోదబిడ్డకుఁ జాటేరు సుండీ॥చ3॥నవ్వులుఁ జిటిబెల్లాలు నున్ననిచిమ్మిలులునవ్వుటిడియునుఁ జిన్ని నురుగులునుయెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించికివ్వకివ్వ నవ్వ నణఁకించీ జుండీ రాగము: పాడి రేకు: 0042-02 సంపుటము: 1-256 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నీవేకా చెప్పఁజూప నీవె నీవెకాశ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి॥చ1॥నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్దదేవతలఁ గనిపించే దేవుఁడవుయేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ-సేవకుఁడవు నీవెకా సేనమొదలారి॥చ2॥పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువదెసలఁ బంపులువంపే దీరుఁడవువసముగా ముజ్జగాలవారి నిందరిని నీ-సిసువులఁగా నేలిన సేనమొదలారి॥చ3॥దొరలై నయసురుల తుత్తుమురు సేసి జగ-మిరవుగా నేలితి వేకరాజ్యమైపరగుసూత్రవతీ పతివై వేంకటవిభు-సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి రాగము: లలిత రేకు: 0042-01 సంపుటము: 1-255 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥లేదు బహవిద్యామహసుఖము తమ-కీడు తమకర్మ మేమి సేయఁగవచ్చు॥చ1॥నానావిధులఁ బొరలి నరుఁడు దానై వివిధ-మైనకర్మములే అనుభవించిలేనిలపంటములకు లోనై దురితా-దీనులై క్రమ్మరఁ దిరిగిపోవుటేకాని॥చ2॥పరగ నిన్నిటఁ బొడమి బ్రహ్మణుఁడైసరిలేని వేదశాస్త్రములు చదివిఅరుదయినకాంక్షచే నతిపాపపరులైవెరవునఁ బొడవెక్కి విరుగఁబడుటేకాని॥చ3॥చేరనిపదార్థములే చేరఁగోరుటగానిచేరువనే యామేలు సిద్ధింపదుధీరులై తమలోనఁ దిరువేంకటేశ్వరునిఁగోరి యిటు భజియింపఁగూడు టెన్నఁడుగాన రాగము: దేవగాంధారి రేకు: 0041-06 సంపుటము: 1-254 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎరుఁగుదు రిందరు నెఱిఁగీనెఱఁగరుహరి దానే నిజపరమాతుమని॥చ1॥నలినాసనుఁ డెఱుఁగు నారదుఁ డెఱుఁగుకొలఁది శివుఁ డెఱుఁగు గుహుఁ డెఱుఁగుయిల గపిలుఁ డెఱుఁగు నింతా మను వెఱుఁగుతలఁప విష్ణుఁడే పరతత్వమని॥చ2॥బెరసి ప్రహ్లదుఁడు భీష్ముఁడు జనకుఁడుగురుతుక బలియ శుకుఁడుఁ గాలుఁడువరుస నెఱుఁగుదురు వడి రహస్యముగహరి యితఁడే పరమాత్ముఁడని॥చ3॥తెలియదగిన దిది తెలియరాని దిదితెలిసినాను మదిఁ దెలియ దిదియిల నిందరుఁ దెలిసి రిదే పరమమనికలవెల్లఁ దెలిపె వేంకటరాయుఁడు రాగము: శంకరాభరణం రేకు: 0041-05 సంపుటము: 1-253 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులుసంపూర్ణమోహవిరహితు లెఱుగుఁదురు నినునిందిరారమణా॥చ1॥నారీకటాక్షపటు నారాచభయరహిత-శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపుఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము॥చ2॥రాగభోగవిదూర రంజితాత్ములు మహా-భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధముఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా-యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి॥చ3॥పరమభాగవత పదపద్మసేవానిజా-భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకుపరగు నిత్యానంద పరిపూర్ణ మానస-స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ రాగము: శ్రీరాగం రేకు: 0041-04 సంపుటము: 1-252 Tags: Annamacharya పూర్తి వివరాలు ...