॥పల్లవి॥కడుఁ జంచలములు కడునధ్రువములుకడు నల్పములని కాదందురు॥చ1॥కర్మభోధ వికారంబులుధర్మతంత్ర సంధానములుదుర్మదైక సందోహములుకర్మదూరు లివి గాదందురు॥చ2॥పరమభాగవత భవ్యమతులుపరమభోధ సంభావకులుతిరువేంకటగిరిదేవు సేవకులుకరుణాధికు లివి గాదందురు రాగము: గుండక్రియ రేకు: 0025-04 సంపుటము: 1-152 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వందే వాసుదేవంబృందారకాధీశ వందిత పదాబ్జం॥చ1॥ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-చందనాంకితల సచ్చారు దేహంమందారమాలికా మకుటసంశోభితంకందర్పజనక మరవిందనాభం॥చ2॥ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలంఖగరాజవాహనం కమలనయనంనిగమాదిసేవితం నిజరూపశేష ప-న్నగరాజ శాయినం ఘన నివాసం॥చ3॥కరిపురనాధ సంరక్షణే తత్పరంకరిరాజ వరదసంగత కరాబ్జంసరసీరుహాననం చక్రవిభ్రాజితంతిరువేంకటాచలా దేవం భజే రాగము: శ్రీరాగం రేకు: 0008-05 సంపుటము: 1-53 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడుకొండలంత వరములు గుప్పెడు వాఁడు॥చ1॥కుమ్మరదాసుఁడైన కురువరతినంబిఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడుదొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తిరమ్మనచోటికి వచ్చి నమ్మినవాఁడు॥చ2॥అచ్చపు వేడుకతోడ ననంతాళువారికిముచ్చిలి వెట్టికి మన్నుమోఁచినవాఁడుమచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుతనిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు॥చ3॥కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు-ణించి తనయెడకు రప్పించినవాఁడుయెంచ నెక్కుడైనవేంకటేశుఁడు మనలకుమంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు రాగము: సామంతం రేకు: 0025-03 సంపుటము: 1-151 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥చాలదా హరినామ సౌఖ్యామృతము దమకుచాలదా హితవైన చవులెల్ల నొసఁగ॥చ1॥ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదాచెదరకీ జన్మముల చెఱలు విడిపించమది నొకటె హరినామ మంత్రమది చాలఁదాపదివేలు నరకకూపముల వెడిలించ॥చ2॥కలదొకటి హరినామ కనకాద్రి చాలదాతొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచతెలివొకటి హరినామ దీపమది చాలదాకలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల॥చ3॥తగువేంకటేశు కీర్తన మొకటి చాలదాజగములో కల్పభూజంబు వలెనుండసొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదానగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప రాగము: శ్రీరాగం రేకు: 0008-04 సంపుటము: 1-52 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి –కనుమాయలే కాక కడ నేమిగలదుopen॥చ1॥కనుచూపు కాఁకలఁ గలయుట వెడయాస –లనుభవింపుటగాక యందేమిగలదుతనువల్లి సోఁకులఁ దగులుట మమతల –నెనయఁ గోరుటగాక యిందేమిగలదు॥చ2॥యెలమి నధర మాను టెరిఁగి యెంగిలి నోరనలముకొనుట గాక యందేమిగలదుపలులంపటములచేఁ బడుట దు: ఖంబులుతలఁజుట్టుటే కాక తన కేమికలదు॥చ3॥శ్రీ వేంకటాద్రీశుఁ జేరనిపనులెల్ల –నేపగింతలే కాక యిందేమిగలదుఆవల సురతభోగ మనుభవింపఁబోయిరావలయుటగాక రచనేమిగలదు రాగము: శంకరాభరణం రేకు: 0025-02 సంపుటము: 1-150 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నదు లొల్లవు నా స్నానము కడు-సదరము నాకీ స్నానముmebendazol dosierungmebendazol uden receptmebendazol overdosering॥చ1॥ఇరువంకల నీయేచినముద్రలుధరియించుటే నాస్నానముధరపై నీనిజదాసులదాసుల-చరణధూళి నాస్నానము॥చ2॥తలఁపులోన నినుఁదలఁచినవారలఁదలఁచుటే నాస్నానమువలనుగ నినుఁగనువారల శ్రీపాద-జలములే నాస్నానము॥చ3॥పరమభాగవతపాదాంబుజముల-దరుశనమే నాస్నానముతిరువేంకటాగిరిదేవ నీకథాస్మరణమే నాస్నానము రాగము: ముఖారి రేకు: 0008-03 సంపుటము: 1పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఒప్పులై నొప్పులై వుండుఁగానఅప్పటప్పటికిఁ జూడ నదియేకా నిజము॥చ1॥కన్నుల కిన్నియుఁజూడ కలలై వలలైవున్నతాలు నడ్డాలై వుండుఁగానచిన్న చిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవివున్నవన్నియుఁ జూడ నొకటేకా నిజము॥చ2॥సారేకు నోరికిఁ జూడ చవులై నవ్వులైపూరటమాటలై వుండుఁగానతారుమారు తాఁకు సోఁకు తప్పుదోఁపు లిన్నియువోరపారులేనివెల్ల వొక్కటెకా నిజము॥చ3॥మేనికి నిన్నియుఁ జూడ మృదువై పొదువైపూని సంపదలై వుండుఁగానతేనై తీపై తిరువేంకటేశ నిన్నుకానవచ్చినదే వొక్క టేకా నిజము రాగము: దేసాక్షి రేకు: 0025-01 సంపుటము: 1-149 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥జీవాతుమై యుండు చిలుకా నీ-వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకాwat kost de pilarcoxiaarcoxia 120euthyrox 150euthyrox 88॥చ1॥ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకాజాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకాభాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకారీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా॥చ2॥బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకాఅదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకావదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకాతుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా॥చ3॥నీవన నెవ్వరు […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఉప్పవడము గాకున్న రిందరుయెప్పుడు రేయి నీకెప్పుడు పగలు॥చ1॥కన్నుల చంద్రుఁడును కమలమిత్రుఁడునువున్నతి నివి నీకుండఁగనువెన్నెలయెండలు వెలయఁగ మేల్కొను-టెన్నఁడు నిద్దర యెన్నఁడు నీకు॥చ2॥కందువ సతికనుఁగలువలు ముఖార-విందము నిదివో వికసించెముందర నిద్దుర మొలవదు చూచినవిందగునీతెలివికిఁ దుద యేది॥చ3॥తమము రాజసము తగుసాత్వికమును-నమరిన నీమాయారతులుకమలాధిప వేంకటగిరీశ నిన్నుప్రమదము మఱపునుఁ బైకొనుటెట్లా రాగము: ధన్నాశి రేకు: 0024-06 సంపుటము: 1-148 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశిపూర్తి వివరాలు ...