॥పల్లవి॥ఏఁటికి దలఁకెద రిందరునుగాఁటపు సిరులివి కానరో ప్రజలు॥చ1॥ఎండలఁ బొరలక యేచిన చలిలోనుండక చరిలోనుడుకకఅండనున్న హరి నాత్మఁదలఁచినపండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు॥చ2॥అడవుల నలియక ఆకునలముఁదినికడుపులు గాలఁగఁ గరఁగకబడి బడి లక్ష్మిపతికి దాసులైపొడవగు పదవులఁ బొందరో ప్రజలు॥చ3॥పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగదిక్కులనంతటఁ దిరుగకగక్కన తిరువేంకటగిరిపతిఁ గనివొక్క మనసుతో నుండరొ ప్రజలు రాగము: ఆహిరి రేకు: 0017-01 సంపుటము: 1-101 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వేదవేద్యులు వెదకేటిమందుఅదినంత్యములేని ఆమందు॥చ1॥అడవిమందులుఁ గషాయములు నెల్లవారుకడగానక కొనఁగానుతొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-నడియాలమైనట్టి ఆమందు॥చ2॥లలితరసములుఁ దైలములు నెల్లవారుకలకాలము గొనఁగానుచెలువైన దొకమందు చేరె మాకు భువి-నలవిమీఱినయట్టియామందు॥చ3॥కదిసినజన్మరోగముల నెల్లవారుకదలలేక వుండఁగానుఅదన శ్రీతిరువేంకటాద్రిమీఁదిమందుఅదివో మాగురుఁడిచ్చె నామందు రాగము: దేసాక్షి రేకు: 0001-02 సంపుటము: 1-2 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదుకలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా॥చ1॥అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములుముంగిటి పసిఁడికుంభములును ముద్దులకుచయుగంబులుయెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులులింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు॥చ2॥కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలుయెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములుతెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులుమంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు॥చ3॥నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలుదప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమిచెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలుఅప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు రాగము: సామంతం రేకు: 0001-01 సంపుటము: 1-1 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
పులివెందుల రంగనాథుని పైన అన్నమయ్య రాసిన సంకీర్తన పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట. రాగము: మలహరి రేకు: 0603-4 సంపుటము: 14-15 ॥పల్లవి॥ ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥చ1॥ వావులు నీకెంచనేల వాడల […]పూర్తి వివరాలు ...
రాగము: దేసాళం రేకు: 1650-5 సంపుటము: 26-298 ॥పల్లవి॥ రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే ॥చ1॥ చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు పలుమారు మాటలాడి పదరీ వీఁడు మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే ॥చ2॥ పందెములడువరాదు పంతము విడువరాదు కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు అందపు నాచూపు లివి అంటుకొనీఁ దనమీద చందపు మావలపులు చక్కఁబెట్టరే ॥చ3॥ తమక మాఁపఁగరాదు తాలిమి చూపఁగరాదు అమర గూడె శ్రీవెకటప్పఁడు వీఁడు […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు అన్నమయ్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్న, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా తెలిసింది. మేడిదిన్నె కడప జిల్లాలో పెద్దముడియం మండలానికి చెందిన గ్రామము. […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా ॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి చన్ను లురమునఁ బెట్టి సత మైనది చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె […]పూర్తి వివరాలు ...
కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు (గడపరాయ )చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. నాయికా నాయకుల సరసములు ప్రొద్దుపోవు వరకు సాగినవి.పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే|| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో […]పూర్తి వివరాలు ...