॥పల్లవి॥దైవమా నీకు వెలితా తలఁపువెలితేకాకవేవేలుకర్మాల వేసారఁగ వలసె॥చ1॥హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసినపొరి నందుపై నమ్మిక పుట్టదుగాకనరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకుతిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా॥చ2॥దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవికైవశము నామనసు గాదుగాకగోవింద యనియంటేఁ గూడని పదవు లేవికావిరిఁ గాల మూరకె గడుపేము నేము॥చ3॥వేదనారాయణమంటే వీడేటిబంధములుఆదిగా మూఁడులోకాలనైనా నున్నదాశ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడాయేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక రాగము: సాళంగనాట రేకు: 0084-03 సంపుటము: 1-407 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥శ్రీహరి సేసిన చిహ్నలివి యీమోహము విడుచుట మోక్షమది॥చ1॥మలినంబేది మణుఁగననేదికలుషపుమలముల కాయమిదికలిగిన దేది కడు లేందేదిచలనపు మాయల జన్మ మిది॥చ2॥తనిసిన దేది తనియనిదేదిదినదిన మాఁకలి దీరదిదికొన యిందేది గుఱి మొదలేదిపనిగొను కర్మపు బంధ మది॥చ3॥నిండినదేది నిండనిదేదికొండల పొడవుల కోరికదిఅండనె శ్రీవేంకటాధిపు శరణనివుండుటె యిహపరయోగ మది రాగము: పాడి రేకు: 0084-02 సంపుటము: 1-406 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వలెనను వారిదె వైష్ణవము యిదివలపుఁ దేనెవో వైష్ణవము॥చ1॥కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపైవైరాగ్యమెపో వైష్ణవముసారెకుఁ గోపముఁ జలమునుఁ దనలోవారించుటవో వైష్ణవము॥చ2॥నుడిగొను దేహపు సుఖదుఃఖములోవడిఁ జొరనిదెపో వైష్ణవముముడివడి యింద్రియముల కింకరుఁడైవడఁబడనిదెపో వైష్ణవము॥చ3॥వుదుటునఁ దన సకలొపాయంబులువదలుటపో నిజవైష్ణవముయెదుటను శ్రీవేంకటేశ్వరు నామమువదనము చేర్చుట వైష్ణవము రాగము: మలహరి రేకు: 0084-01 సంపుటము: 1-405 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కనియు గానని మనసు కడమగాకయెనలేని హరిమహిమ కిది గుఱుతుగాదా॥చ1॥కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మునుమునుజులే కారా మహరుషులునుమనసులో నిపుడైన మరిగి కొలిచినవారుఘనులౌట కిదియ నిక్కపు గుఱుతుగాదా॥చ2॥భావించి హరిఁగొలిచి పదవులందిరిగాకజీవులే కారా దేవతలునుకావించి కొలిచినను ఘనపదవు లేమరుదుయేవలన నిందిరికి నిది గుఱుతుగాదా॥చ3॥పన్ని హరిఁగొలిచి నేర్పరులైరి గాక ధర-నున్నవారే కారా యోగివరులుయెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవారలిన్నియునుఁ జేకొనుట కిది గుఱుతుగాదా రాగము: భూపాళం రేకు: 0083-06 సంపుటము: 1-404 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందు లననొల్లకామించి నీవిచ్చితివి కైవల్యపదము॥చ1॥పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు_నట్టె నీదాసుఁడ నేనైతేఁ జాలువెట్టికి నే జాతియైన వెఱవ నీనామములువొట్టి నా నాలికమీఁద నుంటేఁజాలు॥చ2॥దురితాలకు వెఱవఁ దుద వేయైనా హరి నీ_కరుణఁ గైంకర్యము గలిగితేఁ జాలునిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁబెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు॥చ3॥యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశపాలించి నీకృప నాపైఁ బారితేఁ జాలుకాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవయేలిన నీదాసులు నన్నియ్యకొంటేఁ జాలును రాగము: బౌళి రేకు: 0083-05 సంపుటము: 1-403 […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మరిగి వీరిపో మాదైవంబులుకెరలిన హరి సంకీర్తనపరులు॥చ1॥వినియెడి వీనుల విష్ణుకథలకేపనిగొందురు మాప్రపన్నులుకనియెడి కన్నులు కమలాక్షునియందనువుపరతు రటు హరిసేవకులు॥చ2॥పలికెడిపలుకులు పరమాత్మునికైయలవరతురు శరణాగతులుతలఁచేటి తలఁపులు ధరణీధరుపైతలకొలుపుదు రాతదియ్యులు॥చ3॥కరముల శ్రీపతికైంకర్యములేమురియుచుఁ జేతురు ముముక్షులుయిరవుగ శ్రీవేంకటేశ్వరు మతమేసిరుల నమ్ముదురు శ్రీవైష్ణువులు రాగము: గుండక్రియ రేకు: 0083-04 సంపుటము: 1-402 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమిసేతు దేవదేవ యింతయును నీమాయకామినులఁ జూచిచూచి కామించె భవము॥చ1॥చంచలపుఁగనుదోయి సతులబారికిఁ జిక్కిచంచల మందెను నాదిచ్చరి మనసుకంచుఁ గుత్తికలవారి గానములఁ జొక్కి చొక్కికంచుఁబెంచు నాయఁబో నాకడలేని గుణము॥చ2॥తీపులమాటల మించి తెఱవలభ్రమఁ దరితీపుల పాలాయఁబో నాతెలివెల్లానుపూఁపల నవ్వుల తోడి పొలఁతులఁ జూచిచూచిపూఁపలుఁ బిందెలునై పొల్లువోయఁ దపము॥చ3॥కూటమి సతులపొందు కోరి కోరి కూడికూడికూటువ నావిర తెందో కొల్లఁబోయనునీటున శ్రీవేంకటేశ నినుఁగని యింతలోనెజూటరినై యింతలోనె సుజ్ఞానినైతి రాగము: కాంబోది రేకు: 0083-03 సంపుటము: 1-401 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దేవదేవుడెక్కె నదె దివ్వరథముమావంటి వారికెల్ల మనో రథము॥చ1॥జగతి బాలులకై జలధులు వేరఁ జేసిపగటునఁ దోలెనదె పైఁడి రథముమిగులఁగఁ గోపగించి మెరయురావణమీఁదతెగి యెక్కి తోలేనదె దేవేంద్రర థము॥చ2॥దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకుఁబక్కన మరలిచెఁ బుష్పక రథమునిక్కి నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలెవెక్కసపు రెక్కలతో విష్ణు రథము॥చ3॥బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కెఅలయేఁగు బెండ్లికల్యాణ రథముయెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడికలకాలమును నేగె ఘనమైన రథము రాగము: సాళంగనాట రేకు: 0083-02 సంపుటము: 1-400 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇంతే మఱేమిలేదు యిందుమీఁదనుదొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట॥చ1॥వుల్లములో నుండి దేహ మొగి రక్షించేహరి-నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుటబల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లాపొల్లకట్టు దంచిదంచి పోగు సేసుకొనుట॥చ2॥యెయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి-కియ్యకున్న నది దైవమియ్యకుండుటచెయ్యార నాతని కొప్పు సేయని భోగములెల్లాచయ్యన జెఱకుఁ బిప్పి చవిగొనుట॥చ3॥శ్రీకాంతుడై నట్టి శ్రీవేంకటేశ్వరునిజేకొంటే సిరులెల్లా జేకొనుటమేకుల శ్రీహరినామమే నోర నుడుగటకైకొన్న యమృతపుగందు వగుట రాగము: గుజ్జరి రేకు: 0082-06 సంపుటము: 1-398 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...