అన్నమాచార్యుడు – తొలి తెలుగు వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు. బాషలో, భావంలో- విలక్షణత్వాన్ని, వినూత్నత్వాన్నీ చేర్చి పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినాడు. తన పల్లవీ చరణాలతో వేంకటపతిని దర్శించిన అన్నమయ్య ఒంటిమిట్ట కోదండ రామయ్యను ఇలా కీర్తిస్తున్నాడు.. జయ జయ రామా సమరవిజయ రామా భయహర నిజభక్తపారీణ రామా జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా అలసుగ్రీవునేలినాయోధ్యరామాపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, December 13, 2012
Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, August 15, 2012
తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, August 13, 2012
పెదయౌబళపు కొండ పెరిగీనిదే వదలకకొలిచితే వరములిచ్చీని పదివేలశిరసుల పలునరసింహము గుదిగొన్న చేతుల గురుతైనది ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది మొనసి రాకాసి మొకములగొట్టేది కనకపుదైత్యుని కడుపుచించినది తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది దేవతలు గొలువ గద్దెపై నున్నది శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది భావించి చూచితేను పరబ్రహ్మమైనదిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, August 13, 2012
composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె ఎగసినగరుడని యేపున’ధా’యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగెపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, June 19, 2012
నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను || సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం మందు సంధ్యాకాలమున ఔభళేశుడు | పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరమృగరూపము నానాహస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె గురుతర బ్రహ్మాండ గుహలోనను || కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి మించుగ ఇందిర తొడమీద బెట్టుక | అంచె శ్రీవేంకటగిరి […]పూర్తి వివరాలు ...