పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా పరవశిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: దేసాళం రేకు: 512 సంపుటము: 13-68 కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా ॥పల్లవి॥ కొమ్మల చేత నెల్లాను కొలువు సేయించుకొంటా కమ్మి వలపు కొటారుగాఁ బెట్టేవు అమ్మరో పోఁకకుఁ బుట్టెడాయను సిగ్గులు నేడు యెమ్మెల సతుల భాగ్యాలేమి చెప్పేదయ్యా ॥కంటిమి॥ జలజ లోచనలతో సరసములాడుకొంటా మొలకనవ్వులను […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0879-5 సంపుటము: 18-472 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి […]పూర్తి వివరాలు ...
కడప నారాయణదాసు సంకీర్తనలు తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, ప్రజాకవి వేమన , కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మం కడప ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారికోవకే చెందిన పండరి భజన వాగ్గేయకారుడు కడప నారాయణదాసు తాజాగా వెలుగులోకి వచ్చారు. దాదాపు80- 90 ఏళ్ల కిందట తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి ఈ నేలలో నడయాడి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 1610-4 సంపుటము: 26-58 మాఁటలేలరా యిఁక మాఁటలేల మాఁటలేలరా మాయకాఁడా ॥పల్లవి॥ చూచి చూచే చొక్కించితి యేచి నీ చేఁత కేమందురా కాచెఁ బూచెను కాఁగిట చన్నులు లోఁచి చూడకు లోనైతి […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుని ‘కడపరాయడు’ ఎవరినో తలపోస్తూ కోపిస్తున్నాడని కలహాంతరియైన నాయిక ఇట్లా వాపోతున్నది. వర్గం : శృంగార సంకీర్తన రాగము: హిందోళవసంతం రేకు: 0214-2 సంపుటము: 8-80 నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా మీనుల వినుమంటేను వేసరేవుగాక ॥పల్లవి॥ కప్పుర మిచ్చితిఁ గాక కవకవ నవ్వితినా రెప్పల మొక్కితిఁగాక రేసు రేచేఁనా ముప్పిరినెవ్వతెచేనో ముందువాడివచ్చి దప్పితో నొక్కటొక్కటే తలచేవుగాక ॥నేనుసేసే॥ చిగురందిచ్చితిఁగాక చేగోరు దాఁకించితినా మొగమోటనుంటిఁగాక ముంచికైకోనా మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి పగటులనూరకే భ్రమసేవుగాక ॥నేనుసేసే॥ […]పూర్తి వివరాలు ...
నల్లబల్లి చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన – 2 నల్లబల్లి, కడప జిల్లాలోని ముద్దనూరు మండలానికి చెందిన ఒక గ్రామము. ఇది మండల కేంద్రమైన ముద్దనూరు పట్టణానికి సమీపంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు పలుమార్లు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. నల్లబల్లి చెన్నకేశవుని సరససల్లాపాలను అన్నమాచార్యుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 0190-4 సంపుటము: 7-534 చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా […]పూర్తి వివరాలు ...
చెంతకు చేరిన కడపరాయని చేతలను తప్పు పడుతూ, సవతుల పట్ల ఈర్ష్యను చూపక, నేర్పరితనంతో వానిని కట్టి పడేయమని చెలికత్తె ఆ సతికి ఇట్లా సుద్దులు చెబుతోంది.. వర్గం: శృంగార సంకీర్తన రాగము: నారాయణి రేకు: 0704-3 సంపుటము: 16-21 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘నేరుపరి వై..’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. నేరుపరి వైతేను నెలఁత నీ వాతనికి నారుకొన్నప్రియముతో నయములే చూపవే ॥పల్లవి॥ సన్నలనే పతికి నిచ్చకురాలవై యుండవే […]పూర్తి వివరాలు ...
గొణుగుతూ, తిట్టుతూ కడపరాయనితో పంతం బట్టి, మళ్ళా పతికై వయ్యారి చూపులు చూస్తున్న ఆ సతిని చెలికత్తె అనునయించి, కడపరాయని కౌగిలిలో కరిగిపొమ్మని ఇలా ఊరడిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 1124-7 సంపుటము: 21-139 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. సారెనేలే జగడము సారెనేలే సణఁగులు సారెనేలే పతితోఁ బంతము సారెనేలే ॥పల్లవి॥ పెదవుల గొణఁగుచు బీరములాడుచు కొదలుఁదిట్లనే […]పూర్తి వివరాలు ...
వెయ్యినూతల కోన నారసింహుఁడిని కీర్తించిన చినతిరుమలాచార్య సంకీర్తన వర్గము : శృంగార సంకీర్తన రాగము: కాంభోది రేకు: 04-1 సంపుటము: 10-18 నాలితనా లేఁటికోయి నారసింహుఁడా నాలోనె నవ్వు వచ్చీ నారసింహుఁడా ॥పల్లవి॥ చేరువని ప్రియములు చెప్పి చెప్పి నామీఁద నారువోసేవు వలపు నారసింహుఁడా దారాసుద్దవుమాఁటలు తాఁకనాడి మదనుని నారసాలు సేయకు నారసింహుఁడా ||నాలితనా|| వెనుకొని నా వెంట వెంటఁ దిరిగి నామీఁద ననుపు మోపు గట్టేవు నారసింహుఁడా కనుచూపూలనె వట్టి కాఁక రేచి మెత్తనైన ననలు వాఁడి సేయకు […]పూర్తి వివరాలు ...