పుస్తకం: తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష, రచయిత : ఎస్.టి.వి.రాజగోపాలాచార్య, సంవత్సరం : 1992, పుటలు: 371పూర్తి వివరాలు ...
కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...
1919-20 నాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను చిత్రించే ప్రయత్నంలో శ్రీ మహీధర రామమోహన రావు గారు రచించిన నవల “కొల్లాయి గట్టితేనేమి?”. పంజాబ్ లో రౌలట్ చట్టం అంతకుముందే అమల్లోకి వచ్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అప్పుడప్పుడే జరిగింది. బ్రిటీష్ వ్యతిరేకత పై వర్గాల్లోనే అయినా దావానలంలా వ్యాపిస్తున్నది; జాతీయతాభావం గ్రామసీమల్లోకీ, సామాన్య జనంలోకి ప్రవేశిస్తున్నది. దీనికి చిహ్నంగా కాంగ్రెసు మీద గాంధీ ఆధిపత్యం బలపడుతున్నది. అంతవరకూ విధ్యాధికుల సంస్థగా వుండిన కాంగ్రెస్ సామాన్య ప్రజల […]పూర్తి వివరాలు ...
సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి వారి శివతాండవం పై వ్యాఖ్య శివరాత్రి వచ్చిందంటే చాలు ఆ చిదానందరూపుడి వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాం. మూడుకన్నులు.. మెడలో నాగులు.. ఒళ్లంతా విభూది.. ఈ వెండికొండ వెలుగు రేడు గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇక ఆనందమొచ్చినా.. ఆగ్రహమొచ్చినా.. అనుగ్రహించే శివతాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ శివతాండవ చిత్రాన్ని ప్రముఖ కవి పుట్టపర్తి నారాయణాచార్యులు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. శివతాండవమట-శివలాస్యంబట.. ఏమానందం-ఏమానందం, ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు అంటూ శివుడి నాట్యానికి సరితూగేలా […]పూర్తి వివరాలు ...
తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...
శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్‌రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక రాగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్యకారుల దృష్టంతా సాహిత్యనేత్రం వైపు తిరిగింది. అప్పటికే ‘రచన’, ‘ఆహ్వానం’ మార్కెట్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి […]పూర్తి వివరాలు ...
‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య లక్ష్యం గురించి రారా దృక్పథం. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ సాహిత్య […]పూర్తి వివరాలు ...
[box type=”shadow” align=”aligncenter” class=”” width=””]’మల్లారెడ్డి గేయాలు’ పుస్తక రూపంలో అచ్చయిన కొద్దిరోజులకు మహాకవి శ్రీశ్రీ గజ్జల మల్లారెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఇది. ఈ లేఖ మొదట ‘విశాలాంధ్ర’ దినపత్రికలోనూ, తరువాత డిసెంబర్ 13 (1961) నాటి ‘సవ్యసాచి’ సంచికలోనూ అచ్చయింది. గజ్జల మల్లా! “నీ గేయాలు చదివాను, మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను. ఈ పాతికేళ్లలో నేను కూడబెట్టుకున్న కీర్తిని నువ్వు పాతిక కన్న తక్కువ కావ్యాలతో తస్కరించావని నీ మీద కేసు […]పూర్తి వివరాలు ...
తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు కల్పించిన యోవేవి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన విమర్శా వ్యాసాలకు కనీసం చోటు కల్పించకపోవటం గర్హనీయం.(http://www.yogivemanauniversity.ac.in/fwd/TELUGU.pdf) తెలుగు సాహితీ జగత్తులో విమర్శలో తనదైన ముద్ర […]పూర్తి వివరాలు ...