అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి అది పగిలిపోయింది. ఆ పిల్ల రాయి విసిరిన పిల్లగాడిని నిలేసి ఇలా అడుగుతోంది… వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: ఆనందభైరవి స్వరాలు […]పూర్తి వివరాలు ...
అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ చేనంతా కోస్తానంటుంది. సున్నితమైన బావా మరదళ్ల సరసాలు ఈ పాటలో చూడండి. వర్గం: కోతల పాటలు పాడటానికి అనువైన రాగం: మాయామాళవ గౌళ […]పూర్తి వివరాలు ...
ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో అన్నను కలుసుకుంటాడు. భరతుని రాకకు సంతోషించిన రాముడు అయోధ్యలోని అందరి యోగక్షేమాలు అడిగినాడు. భరతుడు గుండెలవిసేట్లు ఏడుస్తూ తండ్రి చనిపోయిన విధం చెప్పి […]పూర్తి వివరాలు ...
సంసారమనే శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. దానిని సరిచేయటానికి ఒక మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణ పాట రూపంలో… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాన్ తోడి రాగస్వరాలు (ఏకతాళం) భర్త: కసువు చిమ్మే నల్లనాగీ గురిగింజ గుమ్మడి భార్య: సిమ్మను పోరా సిమ్ముకో పోరా గురిగింజ గుమ్మడి భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ గురిగింజ గుమ్మడి భార్య: […]పూర్తి వివరాలు ...
అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) సుక్కబొట్టు పెట్టనీడు సుట్టాల సూడనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు కాయిలుంటడో పచ్చబొట్టు పెట్టనీడు పసుపుసీరె కట్టనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు […]పూర్తి వివరాలు ...
వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు గుడిసెల కాడ – కల్లు గుడిసెల కాడ కయిలాసం పోతాండ్య కొన్నాల్లూ కల్లు తాగి వాడింటికీ వచ్చాంటే పెండ్లాము తన్నింది కొన్నాల్లూ దొరల […]పూర్తి వివరాలు ...
వర్గం: ఇసుర్రాయి పాట రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా మొగుడెందు బోయెనో మొగము కళదప్పే నాగలోకము బోయి – నాగుడై నిలిచే దేవలోకము బోయి – దేవుడై నిలిచే చింతేల నీలమ్మ చెల్లెలున్నాది చేతి గాజులు పోయె చెల్లెలెవరమ్మ యేడొద్దు నీలమ్మ తల్లి వున్నాది తలమింద నీడ బోయె తల్లె యెవరుమ్మా యేడొద్దు నీలమ్మ తండ్రి వుండాడు తాళిబొట్టూ బోయె తండ్రెవరమ్మా యేడొద్దు నీలమ్మ అక్క వుండాది అయిన సంసారం బోయె అక్కెవరమ్మా యేడొద్దు నీలమ్మ బావలున్నారు బందూ […]పూర్తి వివరాలు ...
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. ఇటీవలి కాలంలో […]పూర్తి వివరాలు ...
వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| పులివెందుల పూలాకు నీ వాలు జడలాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| ముద్దనూరి ముద్దులకు నీ సన్న పెదవులకు ముద్దెట్ల […]పూర్తి వివరాలు ...