చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...
రాయలసీమలో వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి.పూర్తి వివరాలు ...
నందలూరు : ‘సాహిత్యం ద్వారానే సామాజిక స్పృహ పెరుగుతుంది. సమాజం మంచి మార్గంలో నడవడానికి కథ మార్గదర్శనం చేస్తోంది. కథకు మరణం లేదు’ అంటూ తెలుగు కథకు ఉన్న ప్రాధాన్యాన్ని పలువురు సాహితీ ప్రముఖులు వివరించారు. నందలూరులో ఆదివారం గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ స్కూల్ ఆవరణంలో కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కథకులు అట్టాడ అప్పల్నాయుడుకు కేతు కథా పురస్కారం, ఏఎన్ జగన్నాథశర్మకుపూర్తి వివరాలు ...
మా నాయన నిజ్జంగా సన్నపిల్లోడే! లేకపోతే కుక్క కర్సిందని – నాయనా! పెద్దక్క కు శెప్పినావా నడిపోనికి శెప్పినావా శిన్నోనికి శెప్పినావా అని బోరుబోరున ఏడుచ్చాండంట. మా నాయన పిరికోడేంగాదు మిల్టరీకి పోయి రెండో ప్రపంచయుద్ధంలో పనిచేసి వచ్చినాడు. ఒకసారి మా బరుగొడ్డు సగిలేటి వాగులో కొట్టుకోని పోతాంటే తలుగు తీసుకుని పోయి దాని మెడకు ఏసి లాక్కోని వచ్చినాడు. మిలట్రీ నుంచి రిటైర్ అయి వచ్చినాంక వీవింగ్ట్రైనింగ్ చేసి వచ్చి వీవింగ్ టీచరుగా పనిజేసి రిటైర్ […]పూర్తి వివరాలు ...