॥పల్లవి॥నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవచేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని॥చ1॥అందరిలో నంతర్యామివై నీవుండఁగానుయిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళునుసందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగానువందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి॥చ2॥లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగానుచేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితినికైకొని యీమాయలు నీకల్పితమై వుండఁగానుచౌకలేక నేవేరే సంకల్పించితిని॥చ3॥యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగానుయిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేనుచక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేనుమెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను రాగము: సాళంగనాట రేకు: 0087-05 సంపుటము: 1-427 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పట్టినచోనే వెదకి భావించవలెఁగానిగట్టిగా నంతర్యామి కరుణించును॥చ1॥యింటిలోనిచీఁకటే యిట్టే తప్పకచూచితేవెంటనే కొంతవడికి వెలుఁగిచ్చునుఅంటి కానరానితనయాతుమ తప్పకచూచు-కొంటేఁ దనయాతుమయు గొబ్బునఁ గాన్పించును॥చ2॥మించి కఠినపురాతిమీఁదఁ గడవ వెట్టితేఅంచెలఁ దానే కుదురై నయట్టుపొంచి హరినామమే యేపొద్దు నాలికతుదనుయెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము॥చ3॥వొక్కొక్కయడుగే వొగి ముందరఁ బెట్టితేయెక్కువై కొండైనా నెక్కుఁ గొనకుయిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమునుపక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును రాగము: బౌళి రేకు: 0087-04 సంపుటము: 1-426 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడేపావనపు వైకుంఠ పతియును నితఁడే॥చ1॥భగవతములోఁ జెప్పే బలరాముతీర్ధయాత్రనాగమోక్తమైనదైవమాతఁ డితడేబాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాతఁ డితఁడేయోగమై వామనపురాణోక్తదైవ మీతఁడే॥చ2॥వెలయ సప్తరుషులు వెదకి ప్రదక్షిణములలరఁ జేసినదేవుఁడాఁతఁ డీతఁడేనెలవై కోనేటిపొంత నిత్యముఁ గుమారస్వామికలిమి దపముసేసి కన్నదేవు డీతఁడే॥చ3॥యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులుతక్కక కొలిచియున్న తత్వమీతఁడుచక్క నారదాదులససంకీర్తనకుఁ జొక్కినిక్కినశ్రీవేంకటాద్రి నిలయుఁడు నీతఁడే రాగము: బౌళి రేకు: 0087-03 సంపుటము: 1-425 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీనివెదకివెదకి తిరువీధులందు దేవుఁడు॥చ1॥అలసూర్యవీధి నేఁగీ నాదిత్యునితేరిమీదకలికికమలానందకరుఁడుగానతలపోసి అదియును దవ్వు చుట్టఱికమనియిలఁ దేరిమీఁద నేఁగీ నిందిరావిభుఁడు॥చ2॥చక్క సోమవీధి నేఁగీ జందురునితేరిమీఁదయెక్కువైన కువలయహితఁడుగాకచుక్కలు మోచిన దవ్వుచుట్టరిక మిదియనియిక్కువతో వీధి నేఁగీ నెన్నికైన దేవుఁడు॥చ3॥యింతులమనోవీధి నేఁగీ మరుతేరిమీఁద-నంతటా రతిప్రియుఁ డటుగానరంతుల నదియుఁ గానరానిచుట్టరికమనివింతరీతి నేఁగీ శ్రీవేంకటాద్రిదేవుఁడు రాగము: శంకరాభరణం రేకు: 0087-02 సంపుటము: 1-424 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సులభమా యిందరికి జూడ సులభముగాకకలిగె మీకృప నాకుఁ గమలారమణా॥చ1॥సతతదయాచారసంపన్నుఁడై మఱికదాఅతిశయవైష్ణవాన కరుహుడౌటవ్రతోపవాసతీర్థవరసిద్దుఁడైకదామితిమీరి నరహరి మీదాసుఁడౌట॥చ2॥సకలయజ్ఞఫలము సత్యము ఫలముగదాప్రకటించి విష్ణునామపాఠకుఁడౌటఅకలంకమతితోడ నాజన్మశుద్ధుఁడైకదాఅకుటిలమగుమీచక్రాంకితుఁడౌట॥చ3॥కెరలి సదాచార్యకృప గలిగినగదానిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ గనుటమరిగి మీపై భక్తి మఱి ముదిరినఁ గదాఅరయ మీకే శరణాగతుఁడౌట రాగము: రామక్రియ రేకు: 0087-01 సంపుటము: 1-423 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వాడె వేంకటాద్రిమీద వరదైవముపోఁడిమితోఁ బొడచూపెఁ బొడవైన దైవము॥చ1॥వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లుపిక్కటిల్ల వెలుఁగొందే పెను దైవముపక్కినను తనలోని పదునాలుగు లోకాలుతొక్కి పాదానఁ గొలచే దొడ్డ దైవము॥చ2॥వేద శాస్త్రాలు నుతించి వేసరి కానఁగలేనిమోదపు పెక్కుగుణాల మూలదైవముపోది దేవతలనెల్లఁ బుట్టించ రక్షించఆదికారణంబైన అజుఁగన్న దైవము॥చ3॥సరుస శంఖచక్రాలు సరిఁబట్టి యసురలతరగి పడవేసిన దండి దయివమూసిరి వురమున నించి శ్రీవేంకటేశుండయిశరణాగతులఁగాచే సతమయిన దయివము రాగము: లలిత రేకు: 0086-06 సంపుటము: 1-422 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నగుమొగముతోడి వో నరకేసరినగరూప గరుడాద్రి నరకేసరి॥చ1॥అమితదానవహరణ ఆదినరకేసరినమితబ్రహ్మాదిసుర నరకేసరికమలాగ్రవామాంక కనకనరకేసరినమోనమో పరమేశ నరకేసరి॥చ2॥రవిచంద్రశిఖనేత్ర రౌద్రనరకేసరినవనారసింహ నమో నరకేసరిభవనాశినీతీరభవ్య నరకేసరినవరసాలంకార నరకేసరి॥చ3॥శరణాగతత్రాణ సౌమ్య నరకేసరినరకమోచననామ నరకేసరిహరి నమో శ్రీవేంకటాద్రి నరకేసరినరసింహ జయ జయతు నరకేసరి రాగము: మాళవి రేకు: 0086-05 సంపుటము: 1-421 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మాళవిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరివంతుకు నీకృపగలవాఁడే యెఱుఁగు హరి॥చ1॥నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరినిన్నునొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరిమున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరివున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి॥చ2॥యేపున నీపేరిటివాఁడిన్నిటా ధన్యుఁడు హరినీపెరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడే హరికేపుల నిన్నుఁ నుతించి గెలిచె నారదుఁడు హరిపైపై నిన్ను దిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి॥చ3॥యిట్టె నీవిచ్చినవర మెన్నఁడు జెడదు హరిగట్టిగా నీవియ్యనివి కపటములే హరిఅట్టె శ్రీవేంకటేశ నీ వంతరంగుఁడవు హరివుట్టిపడి కానకున్న వొచ్చము దేహికి హరి రాగము: రామక్రియ రేకు: 0086-04 […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వరివాఁడో యీదేహియివ్వలనవ్వల నీదేహి॥చ1॥కామించు నూరకే కలవియు లేనివియేమి గట్టుకొనె నీదేహివాములాయ నిరువదియొక వావులుయేమని తెలిసెనో యీదేహి॥చ2॥కందువ నిజములు గల్లలు నడిపీయెందుకు నెక్కెనో యీ దేహిముందర నున్నవి మొగిఁ దనపాట్లుయిందే భ్రమసీ నీదేహి॥చ3॥పంచేంద్రియముల పాలాయ జన్మముయించుక యెఱఁగఁడు యీదేహిఅంచెల శ్రీవేంకటాధీశ నీకృపవంచఁగ గెలిచెను వడి నీదేహి రాగము: దేసాక్షి రేకు: 0086-03 సంపుటము: 1-419 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...