కడప : ప్రముఖ రంగస్థల నటుడు కోరుమంచి సుబ్బరాయుడు(71) బుధవారం కడప నగరంలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. సిద్దవటం మండలం బంగలవాండ్లపల్లెకు చెందిన ఆయన జిల్లాలో ఆధునిక నాటక రంగంలో కీలక పాత్ర పోషించారు. నాయుడుగా సుపరిచితులైన ఆయన యంగ్ మెన్స్ డ్రమటిక్ అసోసియేషన్(వైఎండీఏ) వ్యవస్థాపకుల్లో ఒకరు.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Tuesday, September 13, 2011
కడప: కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూనివర్శిటీస్ గ్రాంట్స్ కమిషన్( యూజీసీ) 12-బీ గుర్తింపు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయి. దీంతో వైవీయూ పరిపూర్ణ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి 12-బీ గుర్తింపు కోసం చేసిన కృషి ఎట్టకేలకు ఫలించడంతో వర్శిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సోమవారం వీసీకిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, September 6, 2011
‘‘యూపీఏ ప్రభుత్వం తనను రాజకీయంగా కానీ, మరో రకంగానైనా కానీ ఏ రూపంలో వ్యతిరేకించే వారినైనా.. అణచివేయటానికి, అప్రతిష్టపాలు చేయటానికి, నిర్మూలించటానికి.. సీబీఐ, ఈడీ, ఐటీ తదితర సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందో మీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. యూపీఏ సర్కారు తీరు 1975 నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. విస్తృత ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, September 2, 2011
హైదరాబాద్: పయ్యావుల కేశవ్ ఎవరో తనకు తెలియదని, ఆ పేరు ఇప్పుడే మొదటిసారి వింటున్నానని సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల విషయం దర్యాప్తు చేయడం పెద్ద కుట్ర అని, సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు బంధువని వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ ఆరోపణలను తాను టీవీ చానెళ్లలో చూడలేదని, ఎవరో ఫోన్ ద్వారా తనకు తెలియజేశారని […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, September 2, 2011
ఇడుపులపాయ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధికారాన్ని తెచ్చిపెట్టిన దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే బాధ కలుగుతోందని.. వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్, ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిలపై సీబీఐ దాడులు జరిపే కుట్రకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని నిప్పులు చెరిగారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు స్వయానా బావ అయిన సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ లంచగొండి అని […]పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Friday, September 2, 2011
కడప జిల్లా నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. జిల్లా వాసి వైఎస్ 2004లో సీఎం అయ్యాక అభివృద్ధి పరుగులు తీసింది. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గాను, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలోరూ.130 కోట్లతో రిమ్స్ వైద్య కళాశాలపూర్తి వివరాలు ...
సంపాదకుడు
Friday, September 2, 2011
పులివెందుల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నేడు ఇడుపులపాయకు రానున్నారు. హైదరాబాద్‌నుంచి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి శుక్రవారం ఉదయం ఎర్రగుంట్ల చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వస్తారు. ఉదయంపూర్తి వివరాలు ...
సంపాదకుడు
Friday, September 2, 2011
ఇడుపులపాయ : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి శుక్రవారం నిర్వహించనున్నారు. ఓదార్పుయాత్రలో ఉన్న వైఎస్ తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్ సృతివనంవద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఇప్పటికే కడప జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయంపూర్తి వివరాలు ...
సంపాదకుడు
Thursday, September 1, 2011
లింగాల : అనంతపురం జిల్లాకు చెందిన కొంత మంది వైఎస్సార్ అభిమానులు వైఎస్ మాలదారణ చేసి ఇరుముడితో ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టారు. అనంతరుపురం నగరానికి చెందిన గాలి నరసింహారెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, రాజమోహన్, లక్ష్మున్న, ఓబిరెడ్డి, వెంకటరామిరెడ్డి, నీలకంఠారెడ్డిలు వైఎస్ మాల ధరించి, ఇరుముడితో 29వతేదీన అనంతపురం నుంచి బయలు దేరారు. బత్తలపల్లె, దాడితోట, పార్నపల్లె, లింగాల,పూర్తి వివరాలు ...