ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలో ఏడు చోట్ల చిరుతపులి పాదాల గుర్తులను సేకరించినట్లు అటవీశాఖాధికారులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రేంజిలో 10,264.07 హెక్టార్లు, బద్వేలు రేంజిలో 9,786 హెక్టార్లలో లంకమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 2-8 వరకు లంకమలలో వన్యప్రాణులు, వన్యమృగాల సంచారం, సంతతిపై అటవీశాఖాధికారులు క్ష్రేతస్థాయిలో సర్వే చేశారు. బద్వేలు రేంజి పరిధిలోని బాలాయపల్లె బీటులో సాకుడుచెల ప్రాంతంలో నాలుగు చిరుతలు సంచరించినట్లు గుర్తించారు. అదేవిధంగా బట్టమానుచెల, ముల్లెద్దుచెల ప్రాంతాల్లో వీటి […]పూర్తి వివరాలు ...
సిద్దవటం మండలం మాచుపల్లె గ్రామంలో పవిత్ర పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ జగజ్జనని రేణుకా యల్లమాంబ వార్షిక తిరుణాల మహోత్సవాలు వైశాఖ మాసం బహుళ పాడ్యమి నాడు ( మే 5వ తేది ) ధ్వజారోహాణ, అంకురార్పణ కార్యక్రమమలతో సొమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ మాసం బహుళ తదియ రోజున ( మే 6 వ తేదీన ) అమ్మవారి వూరేగింపు, పాట కచేరి జరిగాయి. ( 9 వతేదీ ) అమ్మవారి కళ్యాణం, ఏనుగు వాహనం పై […]పూర్తి వివరాలు ...
అనంతపురం: ఏదో ఒక రోజు సిబిఐ ఇలా చేస్తుందని ముందే ఊహించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడుతూ సాక్షికి సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో సాక్షి మీడియాను నిరోధించలేరన్నారు.పూర్తి వివరాలు ...
ఉపఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో సాక్షి టివీ, సాక్షి పత్రికల భ్యాంకు ఖాతాలను సిబిఐ స్థంభింపచేసింది. ఇది కుట్రపూరితం అని, ప్రజాస్యామ్యంపై దాడి అని కంపెనీ అధినేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ తీవ్రంగా ఖండించారు. అయితే అధికార కాంగ్రెస్, విపక్ష తెదేపాలు సిబిఐ చర్యను సమర్థించడం విశేషం. జగన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సాక్షి మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి ఉద్యోగులు అధైర్యపడవద్దని అన్నారు.పూర్తి వివరాలు ...
కడప : జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సివిల్ సర్వీస్ ఎంపిక ఫలితాల్లో తమ సత్తా చాటారు. వీరు జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి మెరిశారు. జిల్లాకు చెందిన అన్నం మల్లికార్జునయాదవ్ 20వ ర్యాంకును, ఎంసీవీ మహేశ్వరరెడ్డి 196వ ర్యాంకు సాధించారు. వీరివురు వైద్యవృత్తి ద్వారా సేవ చేస్తూ సివిల్ సర్వీసును ఎంచుకోవడం విశేషం. వీరు అన్నం మల్లికార్జునయాదవ్‌ది చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లె కాగా ఎంసీవీ మహేశ్వరరెడ్డిది ఖాజీపేట మండలం భూమాయపల్లె.పూర్తి వివరాలు ...
కడప: వేముల మండలం తుమ్మలపల్లెలో నిర్మించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నిభారత అణుశక్తి సంఘం చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆల్కైన్ లీచింగ్ పద్ధతిలో దేశంలోనే మొదటిసారిగా వైఎస్సార్ జిల్లాలో యురేనియం శుద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉండదని, పర్యావరణానికి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: కౌసల్య దశరథమహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తనయ సీతామహాదేవితో స్వస్తిశ్రీ శ్రీనందననామ సంవత్సర ఉత్తరాయణే, వసంత రతువే, చైత్రమాసే చతుర్ధశి గురువారం సరియగు 5వ తేదీ రాత్రి 10 గంటలకు కల్యాణం జరుగులాగున దేవదేవులు నిర్ణయించారు. అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించనున్న శ్రీరామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి వీక్షించి, పులకించ మనవి.పూర్తి వివరాలు ...
కడప : ఆహ్వానం టెలీ సీరియల్‌కు సంబంధించి ఈనెల 17వతేదీవరకు కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. ప్రారంభ సన్నివేశాలను శనివారం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో సినీనటుడు మురళీమోహన్‌పై చిత్రీకరించారు. ప్రార్థనా సన్నివేశాన్ని శ్రీవారి పాద మండపం వద్ద చేశారు. సీరియల్లో కథానాయకి నవ్యశ్రీ, శ్రీరామ్ తదితరులపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిరంజీవి చిత్రీకరించారు. రమా ఫిలిమ్స్ బ్యానర్‌పై 10ఎపిసోడ్ల టెలిఫిలిం నిర్మిస్తున్నామని నిర్మాత మోపూరి వెంకటసుధాకర్ తెలిపారు. మురళీమోహన్ను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు. […]పూర్తి వివరాలు ...
విమాన సర్వీసులను నడిపేందుకు దరఖాస్తు చేసుకున్న పలు విమానయాన సంస్థలు ఆగస్టు 15 నుంచి సర్వీసుల ప్రారంభం? కడప: మీరు కడప నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మరో నాలుగు నెలలు ఆగండి. తిరుపతికే కాదు… కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, న్యూఢిల్లీలాంటి మహానగరాలకూ వెళ్చొచ్చు. కడపలో కొత్తగా నిర్మించబోయే ఏయిర్పోర్టు పనులు చివరి దశలో ఉన్నాయి. జూన్ చివరికల్లా విమానాల రాకపోకలకు ‘కడప ఏయిర్పోర్టు’ సిద్ధంగా ఉంటుంది.పూర్తి వివరాలు ...