ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని […]పూర్తి వివరాలు ...
కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ సమస్యను మళ్లీ వాయిదా వేయడానికే మొగ్గు చూపింది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాం నబీ అజాద్ ను రంగంలో దింపి కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటనను పూర్వపక్షం చేయించింది. షిండే నిజంగానే తెలంగాణ అంశానికి ఒక ముగింపు పలకాలని అనుకున్నారో, లేక సోనియాగాందీ వద్ద వీర విదేయత చూపాలని అనుకున్నారో తెలియదు కాని ఆయన చేసిన నెల రోజుల ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. సీమాంద్ర […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన పద్మ విభూషణ్ ఢాక్టర్ యాగా వేణు గోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 31కల్లా నివేదిక అందజేయాల్సిందిగా ఆర్థిక సంఘాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం చెప్పారు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (ప్రణాళికా సంఘం సభ్యుడు), సుష్మా నాథ్ (మాజీ కేంద్ర ఫైనాన్స్ కార్యదర్శి సభ్యులు), డాక్టర్ ఎం గోవిందరావు (డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ), సుదీప్తో ముండ్లే […]పూర్తి వివరాలు ...
కేరళ తరపున బరిలోకి శ్రీశాంత్ క్రికెట్ ప్రేమికులను అలరించే రంజీ పండుగ శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ రంజీ మ్యాచ్‌ను జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారు. కాగా గురువారమే నగరానికి చేరుకున్న ఆంధ్రా, కేరళ జట్ల క్రీడాకారులు శుక్రవారం ముమ్మరంగా సాధన చేశారు. స్టార్ ఆటగాడు శ్రీశాంత్ కోసం అభిమానులు శుక్రవారంమే క్రీడామైదానానికి చేరుకోవడం విశేషం. దేశవాలీ రంజీ మ్యాచ్‌లలో రాణిస్తూ మంచిఫాంలో ఉన్న ఆంధ్రాజట్టు ఈ మ్యాచ్‌లో ఆధిక్యం సాధించినా, […]పూర్తి వివరాలు ...
కడపలో స్టార్ హోటల్ సదుపాయం, విమానశ్రయం అందుబాటులోకి వస్తే వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ క్యూరేటర్ నారాయణరాజు అన్నారు. 2002 నుంచి కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌కు చీఫ్ క్యూరేటర్‌గా పనిచేసిన ఈయన ఇటీవలే బీసీసీఐ క్యూరేటర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి కడపకు వచ్చారు. శనివారం ఆంధ్రా, కేరళ జట్ల మధ్య జరగనున్న రంజీ మ్యాచ్‌కు సంబంధించిన పిచ్‌ను పరిశీలించడానికి బీసీసీఐ నుంచి వచ్చిన నారాయణరాజు రాజారెడ్డి స్టేడియాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దేశంలోని పెద్దపెద్ద […]పూర్తి వివరాలు ...
కడప : ప్రొద్దుటూరు పట్టణంలో నవంబరు 2వ వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (Science fair) నిర్వహించనున్నట్లు డీఈవో కె.అంజయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు ఎస్సీఈఆర్టీ డైరక్టర్ నవంబరు 2వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారన్నారు. కావున ప్రధానోపాధ్యాయులందరూ వారి పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని, ఇద్దరు విద్యార్థులను, ఒక ఎగ్జిబిట్‌తో పంపాలని కోరారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా అభివృద్ధికి, తాగునీటి ఎద్దడి నివారణకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులమయిన సీ.రామచంద్రయ్య, అహ్మదుల్లా, తాను ఎన్నో సార్లు కలిసి విన్నవించినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడంలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలిసేందుకు శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చిన డీఎల్ ఈ మ్లేరకు విలేకరులతో మాట్లాడారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.పూర్తి వివరాలు ...
అక్టోబరు 26 నుంచి 28 వరకూ జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ‘గండికోట హెరిటేజ్’ ఉత్సవాల పేరిట గండికోటతోపాటు రాజంపేట, కడప నగరంలో కూడా మొత్తం మూడు రోజులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. పారంభ కార్యక్రమ వేడుకలకు ‘గండికోట’ వేదిక కానుంది. ఈ ఉత్సవాల నిర్వాహక ప్రత్యేక అధికారి జీఎన్ రావు ప్రారంభ వేడుకల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, వృషభరాజాలు వగైరాలతో రాయల నాటి వైభవం గుర్తుకొచ్చేలా నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. పూర్తి వివరాలు ...