‘నా వైఖరి మారలేదు’ అన్న ఆర్. విద్యాసాగర్ రావు గారి లేఖ (ఆంధ్య్రజ్యోతి ఆగస్టు 24) చదివాను. రాయలసీమ సాగునీటి సమస్యల గురించి నిష్ఠుర నిజాలు వెల్లడించినందుకు ఆయనను అభినందించాలో లేక తన తెలంగాణ మిత్రులకు సంజాయిషీ చెప్పుకుంటూ రాయలసీమ పట్ల తన సానుభూతిని ఉదాసీనతలోకి మార్చుకుంటున్నందుకు విచారపడాలో అర్థం కాని పరిస్థితి! ఆంధ్ర, తెలంగాణలు రాయలసీమ కోసం కృష్ణా జలాల్లో కొంత వాటాను వదలుకోవాలని చెబితే తెలంగాణ మేధావులలో వ్యతిరేకత ఎందుకు రావాలి! సాగునీటి వ్యవహారాలపై […]పూర్తి వివరాలు ...
రాజంపేట మండలం నారంరాజుపల్లెలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 2014-2015 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి బాలబాలికలు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కె.వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2013-2014 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వతరగతి చదువుతూ 02.05.2001 నుంచి 30.04.2005 మధ్య జన్మించిన బాలబాలికలు నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు 08.02.2014 వతేదీ శనివారం నవోదయ […]పూర్తి వివరాలు ...
సమైక్య రాష్ట్రంలో రాయలసీమ వాసులవి బానిస బతుకులు తప్ప అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అసాధ్యమని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యులు, రాయలసీమ ఉద్యమ నేత ఎం.వి.రమణారెడ్డి పేర్కొ న్నారు. రాయలసీమ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ వెనుక బాటు తనంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడుతూ హైదరాబాద్ లేకపోతే తాము బతకలేమనే విధంగా ఇవాళ ఉద్యమం కొనసాగడం సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రాంతం వారు విడిపోతామని […]పూర్తి వివరాలు ...
తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. రావు గారు ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో ఈ రోజు ‘నీటి యుద్ధాలు నిజమేనా?’ అని ఒక వ్యాసం రాశారు. వారు రాసిన వ్యాసంలో సీమపై తనకున్న అక్కసును […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు చుక్క తాగు, సాగునీరు అందక ఈ ప్రాంతం శాశ్వత కరువు బారిన పడుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన గర్జన కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఏజేసీ ప్రసంగించారు. రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా […]పూర్తి వివరాలు ...
సమైక్య ఉద్యమ తీవ్రత తెలియచేప్పెందుకు రెండు లక్షల మందితో చేపట్టనున్న సమైక్య గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన ప్రవాహం కదిలిరానున్నందున ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కడప కళాశాల మైదానంలో ఈ రోజు (శనివారం) ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదికప్రతినిధులు సమాయత్తమయ్యారు. ‘సమైక్య గర్జన’ నిర్వహణ స్థలం విషయంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 31వ తేదీన జిల్లా కేంద్రంలోని కోటిరెడ్డి కూడలిలో నిర్వహించాలని రాజకీయేతర ఐకాస ఇదివరకే ప్రకటన చేసింది. ప్రకటన […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సెగలు ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో సెగమంటలు రేపుతుంటే మరో పక్క సాంస్కృతిక స్పృహను రగుల్కొలుపుతోంది. రాయలసీమ ప్రాంతం సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ప్రాంతం. ఇక్కడి ప్రజల మాటల్లో నిజాయితీ, నిక్కచ్చితనం ఉట్టిపడుతూ ఉంటుంది.ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు ఖరాఖండీగా చెప్పడం ఈ ప్రాంత ప్రజల మనస్తత్వం. మాటైనా , పాటైనా ఘాటుగా స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు ఈ సీమ పల్లెప్రజలు..! సమైక్యాంధ్ర ఉద్యమం.. సందర్భంగా ప్రజల్లోనుంచి అనేకమంది కళాకారులు ఉద్యమ వేదికలపైకి స్వచ్ఛందంగా […]పూర్తి వివరాలు ...
శ్రీశైలం డ్యాం నీటిమట్టం శుక్రవారం 884.80 అడుగులు చేరింది. దీంతో జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 214.8450 టీఏంసీలుగా నమోదయింది. ఎగువ పరివాహకం నుంచి జలాశయానికి వరదనీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికి జూరాల నుం చి 54,658 క్యూసెక్కులు, రోజా నుం చి 43,300 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది. ఈ క్రమంలో ఆ సమయానికి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్‌ను 92.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు యూనిట్లను […]పూర్తి వివరాలు ...
రాయలసీమ హక్కుల కోసం ముక్తకంఠంతో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. సీమకు న్యాయం జరిగిన తరువాతనే విడిపోవడమైనా, కలిసి ఉండటమైనా అని ఎలుగెత్తిచాటాలి. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో అప్రమత్తత తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వానికి సీమ స్థానీయత సెగ తగలాలి. ఆ వైపుగా సీమ ప్రజలంతా కదం తొక్కాలి. రాష్ట్రంలో అన్ని రంగాలలో చిన్నచూపునకు గురైన ప్రాంతం రాయలసీమ. 1953-1956 ఆది గా అన్యాయాలను అడుగడుగు నా అనుభవిస్తున్నప్పటికీ అంద రం కలిసే అభివృద్ధి […]పూర్తి వివరాలు ...