తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజంపేట మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పసుపులేటి బ్రహ్మయ్యకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అప్పటి నుంచి టీడీపీలో మదన్ అంటీ అంటనట్లుగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ ఆయన పట్ల చంద్రబాబునాయుడు మొగ్గుచూపలేదు. మదన్‌తోపాటు బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఇటీవల తన వర్గీయులతో […]పూర్తి వివరాలు ...
మే 2 నుంచి తిరుణాళ్ళ హరిహరులు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి వైద్యనాదేశ్వరస్వామి, చెన్నకేశవస్వాముల బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మేనెల 6 వరకూ 10 రోజులపాటు సాగుతాయి. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, ఆలయ ప్రధానర్చకులు సుమంత్‌దీక్షితులు తెలిపారు. పది రోజులపాటు క్షేత్రాధిపతి శ్రీవైద్యనాదేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వాములకు ఉదయం సాయంత్రం వాహనసేవలు నిత్యపూజలు అభిషేకాలు, తోమాలసేవలు, హోమాలు నిర్వహిస్తారు. మూడురోజుల తిరునాళ్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న చెన్నకేశవస్వామికి అష్టోత్తర […]పూర్తి వివరాలు ...
కందుల శివానంద రెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల సోదరులు మాట్లాడుతూ జిల్లా అభివృద్ది కోసమే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వైకాపాలో చేరినట్లు చెప్పారు. మొదట కాంగ్రెస్ పార్టీలో […]పూర్తి వివరాలు ...
నాపరాళ్లకు ‘కడప రాళ్లు’ అన్న పేరున్నట్లే కర్బూజా పండ్లకు ‘కడప దోసపండ్లు’ అన్న పేరు కూడా ఉంది. కడప జిల్లాలోని పెన్నానది ఒడ్డున – ఇసుక దిబ్బల్లో కర్బూజా పాదుల పెంపకం విస్తారంగా జరుగుతూంటుంది. వేసవి కాలం ప్రారంభం నుంచి వేసవి బాగా ముదిరే వరకూ ఈ పండ్లు లభ్యమవుతాయి. కడప జిల్లాలోనే కాకుండా కర్బూజా దోసపాదుల్ని కర్నూలు జిల్లాలోనూ, అనంతపురం జిల్లాలోనూ, అలాగే చిత్తూరు ప్రాంతాలలోనూ పెంచుతున్నారు. తీగపాదుల ద్వారా మనకు లభించే ఫలాల్లో కర్బూజ […]పూర్తి వివరాలు ...
రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడి నుండి మొత్తం పదహైదు మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు […]పూర్తి వివరాలు ...
శోభా నాగిరెడ్డి… మంచి నాయకత్వ లక్షణాలున్న మహిళ. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. పెద్ద కుమార్తెకు కడప మాజీ మేయర్ రవీంద్రనాద్ రెడ్డి(ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ గౌర్వాధ్యక్షురాలు విజయమ్మకు స్వయానా సోదరుడు) కుమారుడితో వివాహం జరిగింది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ పీఆర్పీలో […]పూర్తి వివరాలు ...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ అగ్రనేత శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె మరణించారు. ఈ విషయాన్ని కేర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా […]పూర్తి వివరాలు ...
కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, నేకాపా,తెదేపా,జెడిఎస్ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ముగ్గురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు కమలాపురం శాసనసభ […]పూర్తి వివరాలు ...
రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ మరియు పరిశీలన బుధవారం (23న) పూర్తయింది. నామినేషన్ల పరిశీలించే సందర్భంలో అధికారులు ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మరొకరు నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరేందుకు సిద్దమయ్యారు. రాయచోటి నియోజకవర్గం (శాసనసభ స్థానం) నుండి తుది పోరులో నిలవనున్న అభ్యర్థులు వీళ్ళే! ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు తొందరలోనే ఎన్నికల గుర్తులను కేటాయించి అనంతరం 14 […]పూర్తి వివరాలు ...