వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవర ణలో ఆదివారం అంగరంగ శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు, వేదపండితుల వేదమంత్రోచ్చారణల మధ్య కోనేటిరాయుని కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం పులకించింది. కల్యాణానికి ముఖ్యఅతిధులు గా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామారావులు హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుమల, తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ […]పూర్తి వివరాలు ...
కౌన్సిలర్లను దూషించిన కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు. అనంతరం పూచీకత్తుపై స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కౌన్సిలర్లను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఐపీసీ సెక్షన్ 153, 504, 506ల క్రింద ఎర్రగుంట్ల పోలీసులు ఎమ్మెల్యే, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని […]పూర్తి వివరాలు ...
ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం గా నాడు రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర నాయకులు ఒట్టేసి రాయించిన హమీలకు ప్రాణమిచ్చే భౌగోళిక స్వరూపం తిరిగి తెలుగునాడుకు ఏర్పడింది. తొలి బస్సు మిస్సయ్యాం. మిగిలిపోయిన రెండో బస్సునైనా అందుకోకుంటే సర్కార్ జిల్లాల ఉక్కుపాదం కింద మన జీవితం నలిగిపోవడం ఖాయం. వాళ్ళ సహవాసం ఇదివరకే చవిచూసినవాళ్ళం. తాగునీటి కోసం, సాగునీటి కోసం, బడుగు జీవితాల […]పూర్తి వివరాలు ...
రాజధానిని సీమలో ఏర్పాటుచేయడమనేది డిమాండు కాదని, తమ హక్కు అని రాయలసీమ విద్యార్థి వేదిక నినదించింది. రాజధాని విషయం కోస్తా నాయకులు, వారికి వంత పాడుతున్న సీమ ఏలికల కుట్రలను ప్రతిఘటిస్తామని విద్యార్థులు నినదించారు. సీమ మరోసారి నష్టపోకుండా రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేయాలని, లేదంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రతిఘటన తప్పదని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కూడలి నుంచి కోటిరెడ్డి కూడలి వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎఫ్ కన్వీనరు భాస్కర్, […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం … జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం […]పూర్తి వివరాలు ...
వైకాపా అధినేత జగన్ ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో గురువారం నగరంలోని వైఎస్ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్పొరేటర్‌ను పరిచయం చేసుకున్నారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను పలకరిస్తూ వారికి ధైర్యం చెపుతూ కన్పించారు. వచ్చిన వారందరితో బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, ఫొటోలు దిగారు. ప్రతి కార్యకర్త చెప్పే మాటలను వింటూ ఎంపీ అవినాష్ ఉన్నాడు… ఎమ్మెల్యేలు అంజాద్బాష, రవిరెడ్డి, సురేష్‌బాబులు ఉన్నారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ రాజధాని సాధన సమితి కార్యకర్తలు బుధవారం ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఎం.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీపీఎం మినహా అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయన్నారు. 1956కు ముందున్న మాదిరి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించారని.. దీంతో ముఖ్యంగా రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు 1956కు ముందున్న విధంగా ఆంధ్రప్రదేశ్ […]పూర్తి వివరాలు ...
వైకపా అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నుంచి నాలుగు రోజులపాటు జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కడప, బద్వేలు ప్రాంతాల్లో జరగనున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. శుక్ర, శని, ఆదివారాలు కూడా జిల్లాలోనే ఉంటారని పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో సినిమా షూటింగ్ ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాలు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుర్రప్పనికొట్టాలలో (మైలవరం మండలంలోని లింగాపురం పంచాయతీ) తమిళ సినిమా ‘కత్తి’ చిత్రీకరణ జరుగుతుండడంతో సందడి నెలకొంది. తమిళంలో అగ్రకధానాయకుడు విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం హీరో విజయ్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం పలు సెట్టింగులు వేశారు. కరవుతో అల్లాడుతున్న […]పూర్తి వివరాలు ...