కడప: రాయలసీమ ప్రజల చారిత్రక హక్కు అయిన రాజధానిని రెండు జిల్లాల కోస్తాంధ్రకు తరలించి సీమ ప్రజల ఆకాంక్షలను, హక్కులను ప్రభుత్వం హరిస్తున్నందుకు నిరసనగా రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) గురువారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వేదిక కన్వీనరు ఎం.భాస్కర్, కోకన్వీనరు దస్తగిరి, జిల్లా కన్వీనరు ప్రసాద్, వైవీయూ కన్వీనరు నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు చెందినా విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజలు మరియు మేధావులు […]పూర్తి వివరాలు ...
తితిదే పరిధిలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 5వతేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, యాగశాల పూజ, పుణ్యావచనం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు. 4వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు పవిత్ర సమర్పణ, 5వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు స్నపన […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రాయలసీమ వాసులం ఎంతో నష్టపోయామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు కోసం వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. దీనికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను రాజధాని సాధనకోసం ఎంత వరకైనా […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలోని చెన్నూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైకాపా ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం శాసనసభలో కోరారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో 13 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి ఉన్నారన్నారు. చక్కెర కర్మాగారం ఉద్యోగులకు మూడేళ్లుగా జీతాలు కూడా చెల్లించటం లేదని, వారు దుర్భర పరిస్థితిలో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికైనా తక్షణం రైతులను ఆదుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప ఇందిరా భవన్లో నియోజకవర్గ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మీరు ముక్కుసూటిగా […]పూర్తి వివరాలు ...
అనంతపురం జిల్లాలోని గాండ్లపెంట మండలం – తాళ్ళకాల్వ గ్రామానికి చెందిన డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డికి 2014 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంను పొందారు. సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన 35ఏళ్లలోపున్న వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. అప్పిరెడ్డి జ్ఞాపికతో పాటు 50 వేల రూపాయలను అందుకోనున్నారు. ఇంతకు ముందు కడప జిల్లాకు చెందిన వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్ లు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. వరుసగా రాయలసీమకు […]పూర్తి వివరాలు ...
కర్నూలు: రాజధాని సీమ ప్రజల హక్కుఅని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యమని రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షుడు క్రిష్ణయ్య, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంరాష్ట్ర కో-కన్వీనర్ శ్రీనివాసులు గౌడ్, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్స్‌ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘంజిల్లా కార్యదర్శి సుంకన్నలు స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని జార్జిరెడ్డి భవనంలో శనివారం కర్నూలు రాజధాని, రాయలసీమ రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు […]పూర్తి వివరాలు ...
ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కమిషనర్ ప్రభాకర్‌రావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎస్.పురుషోత్తం(ఒకటోవార్డు), వి.సరస్వతి(మూడో వార్డు), ఎ.గంగాభవాని (అయిదోవార్డు), జి.నారాయణరెడ్డి(ఆరోవార్డు), ఎస్.ఆసియాబేగం(పదోవార్డు), జె.మహిత(పన్నెండోవార్డు), ఎస్.మస్తాన్‌వలి(పదమూడోవార్డు), వి.లక్ష్మి(పద్నాలుగో వార్డు) కౌన్సిలర్లు ఉన్నారని ఆయన వివరించారు. నగర పంచాయతీకి జులై నెల 3న జరిగిన మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల సమయంలో […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన యువరచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్ రాష్ట్రపతి భవన్ నుండి ‘ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమం కింద ఆహ్వానం అందుకున్నారు. 2013 డిసెంబర్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రెండవ విడతలో దరఖాస్తుదారుల నుంచి వేంపల్లి గంగాధర్ ఎంపికయ్యారు. రెండవ విడత ఈ కార్యక్రమానికి ఎంపికైన రచయితలు/కళాకారులకు సెప్టెంబరు 8 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఉంటుంది. ఈ ఆతిధ్యానికి రాష్ట్రపతి భవన్ గంగాధర్ సహా నలుగురిని ఆహ్వానించింది. వీరిలో […]పూర్తి వివరాలు ...