కడప: వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మైదుకూరు శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. నగరంలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర […]పూర్తి వివరాలు ...
సీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ‘రాష్ట్ర విభజన, జిల్లా అభివృద్ధి’ అన్న అంశంపై ఈనెల 14న కడపలో నిర్వహించతలపెట్టిన సెమినార్‌కు సంబంధించిన గోడపత్రాలను ఆయన విడుదలచేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ఆర్జీయూ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా సీమ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ప్రత్యేకించి జిల్లాలో కరవు, నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నట్టు చెప్పారు. సమస్య పరిష్కారానికి కృష్ణా జలాల […]పూర్తి వివరాలు ...
ఉద్యమాలు నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయి అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కొత్తతరం నాయకులతోనే రాయలసీమకు న్యాయం రాజధాని ప్రకటనతో ముఖ్యమంత్రి సీమ వాసులను కించపర్చారు “శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలతో పాటు హోం శాఖల నివేదికలు కూడా రాజధానిగా విజయవాడ అనుకూలం కాదని తేల్చి చెప్పాయి.. సోషల్ అసెస్మెంట్ కమిటీ వారు రాజధానికి విజయవాడ అనుకూలం కాదని తేల్చిచెప్పారు.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రాష్ట్ర రాజధాని సాధన […]పూర్తి వివరాలు ...
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ లు తమ భద్రత కోసం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. తమకు ఉన్న ప్రాణ హానిని పరిగణనలోకి తీసుకోకుండా తమకు ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని వారు ముగ్గురు హైకోర్టు ను ఆశ్రయించారు. తాను ఇప్పటికే ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసినా స్పందించలేదని, తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను పునరుద్దరించాలని విజయమ్మ కోరారు. గత ఎన్నికల వరకు విజయమ్మ […]పూర్తి వివరాలు ...
ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి , గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. నలభై ఐదు అంతస్థుల భవనాలు నిర్మించడం ప్రమాదం కావచ్చని వారు హెచ్చరించారు.కర్నూలుకు అన్ని అర్హతలు ఉన్నా చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మోహన్ రెడ్డి విమర్శించారు. […]పూర్తి వివరాలు ...
కడప : వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే.. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గురువారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్ల పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద కూడా ప్రత్యేక బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లతో భారీ ర్యాలీ : రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ కడపలో రాయలసీమ రాజధాని […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ […]పూర్తి వివరాలు ...
కడప: కామ్రేడ్ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివని – ఆయన పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు, కర్షకులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశ లు పాటుపడ్డారని ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిబాషించారు. ఎద్దుల ఈశ్వరరెడ్డి జయంతి సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అంశం పై స్థానిక నూర్-ఏ-జహాన్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఎన్ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ పూర్వ సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎద్దుల […]పూర్తి వివరాలు ...