కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైకాపా శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాద్, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1985లోనే కడప విమానాశ్రయంలో 20 సీట్లున్న వాయుదూత్ విమానం దిగేదని, ఇప్పుడు ఆ సీట్ల గల విమానం కూడా దిగేందుకు […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా పడింది. ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రచారం జరగడం, అధికార పార్టీ నేతలు కూడా పోటీపడి ఆ మేరకు ప్రకటనలు చేయడం, మీడియాలో కూడా ఈ వార్తలు ఊపందుకోవడంతో ఈ సారి తప్పక ప్రారంభమవుతుందని అంతా ఆశించారు. ఈ మేరకు విమానాశ్రయంలో సన్నాహాలు కూడా చేశారు. ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి రెండు మూడు రోజులుగా రెండు మూడు లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఖర్చు చేశారు. తీరా శుక్రవారం విమానాశ్రయ […]పూర్తి వివరాలు ...
కోడూరు: ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిందని అదేస్థాయిలో కడపలోనూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి జిల్లా స్వరూపాన్నే మార్చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకరచన చేస్తున్నట్లు జిల్లాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కడప జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కూడా భ్రష్టుపట్టించారన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: ఇటీవల అయిదు మృతదేహాలు లభ్యమై రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి వేదికైన జియోన్ పాఠశాల గుర్తింపును జిల్లా విద్యాశాఖ రద్దు చేసింది. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారిని సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నష్టం కల్గించకుండా నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ సి.హెచ్.రమణకుమార్, డీఈవో అంజయ్య చర్చించి పాఠశాల విద్య సంచాలకులు ఉషారాణి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు పాఠశాల […]పూర్తి వివరాలు ...
కడప: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనోవిజ్ఞానశాస్త్ర శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సాయంత్రం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని సర్.సి.వి.రామన్ సెమినార్ హాల్లో జరిగే సదస్సునకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టరు అశోక్‌కుమార్, డాక్టరు వెంకట్రాముడు హాజరవుతున్నారు. ఆసక్తి కలవారు హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో […]పూర్తి వివరాలు ...
కుటుంబ కలహాల కారణంగానే హత్యలు: పోలీసులు కడప: స్థానికంగా ఉన్న ఒక పాఠశాల ఆవరణలో పోలీసులు ఐదు మృతదేహాలను వెలికితీయడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి కడప జిల్లా ఎస్పీ నవీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి పోలీసు కార్యాలయంలో ఎస్పీ మీడియాకు హత్యలకు దారి తీసిన కారణాలతోపాటు నిందితుల వివరాలను వెల్లడించారు. ఏడాదిన్నర క్రితం అదృశ్యమయ్యారని భావిస్తున్న కృపాకర్ ఐజాక్, ఆయన భార్య, పిల్లల మృతదేహాలను జియోన్ పాఠశాలలో పూడ్చిపెట్టిఉండగా మంగళవారం పోలీసులు […]పూర్తి వివరాలు ...
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 […]పూర్తి వివరాలు ...
కడప: నగరాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతామని నగరమేయర్ సురేష్‌బాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ఆవరణలో సోమవారం ఈతకొలను(స్విమ్మింగ్‌ఫూల్) నిర్మాణానికి నగర మేయర్ సురేష్‌బాబు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి, డీఎస్డీవో బాషామొహిద్దీన్, ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఛైర్మన్ తోట కృష్ణ, కేవీఆర్ నిర్మాణరంగ సంస్థ అధినేత కె.విశ్వనాథరాజు తదితరులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ ఈతకొలను నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దాతల సహకారంతో ఈ మొత్తాన్ని […]పూర్తి వివరాలు ...