దేవుని కడప బ్రహ్మోత్సవాలలో నాలుగోరోజు శుక్రవారం నాటి ఉత్సవాలు… ఉదయం చిన్నశేషవాహనంపై ఊరేగింపు ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం హనుమంత వాహనం పై ఊరేగింపుపూర్తి వివరాలు ...
కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో బేస్తవారం (గురువారం) నాటి కార్యక్రమాలు… ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఉదయం సూర్య ప్రభవాహనంపైన స్వామి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ సాయంత్రం సింహ వాహనంపైన దేవుని కడప వీధులలో ఊరేగుతారు. పూర్తి వివరాలు ...
కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే […]పూర్తి వివరాలు ...
కడప: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో జిల్లాకు చెందిన కందుల సోదరులు ఆదివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నగరంలోని పురపాలిక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోకందుల శివానంద రెడ్డి మాట్లాడుతూ…విభజన వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. విభజన హామీలను సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమ […]పూర్తి వివరాలు ...
కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్‌పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఈయన బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో మొదలైన చలనచిత్రాలలో కథానాయకుడిగా నటించారు.పూర్తి వివరాలు ...
ఫిబ్రవరి 22న రెండో విడత 3054 పోలియో బూత్‌ల ఏర్పాటు కడప: దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈనెల 18వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ కెవి రమణ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 3లక్షల 17వేల 452 మంది 0నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్బాష, నగర మేయర్ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు. వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, […]పూర్తి వివరాలు ...
పల్లెలో పండుగ సందడి కన్పించటం లేదు. టౌన్నించి ఆటో దిగే వాళ్ల చేతుల్లో సగం సంచినిండా కూడా పండుగ సరకులు లేవు. సంవత్సరానికంతా ఇదే పెద్ద పండుగ గదా! ఆ కొద్ది దినుసులతో మూడురోజుల పండుగను ఎలా యీదగలరో మరి! ఇంటి ముందు పేడనీళ్లు – ఇంట్లో చారు నీళ్లతోనే పండుగ జరిగిపోయేట్టుంది. బెల్లంకూడూ నేతిబొట్టు అనుపాకం కుదరకుండానే, అలసంద వడలు సియ్యల పులుసు తోడు లేకుండానే, అప్పచ్చులు కారేల వియ్యమందకుండానే పండుగ దాటిపోయేట్టుంది మా పల్లె […]పూర్తి వివరాలు ...