వార్తలు

దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

రాయలసీమ మహాసభ

కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది.  స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని …

పూర్తి వివరాలు

ఉర్దూ విశ్వవిద్యాలయం దీక్ష విరమణ

sv satish

ముఖ్యమంత్రిని కలిసేందుకు సతీష్ హామీ కడప: సంఖ్యాపరంగా, పాఠశాలల పరంగా చూసినా కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం సాధనకు మేం శాయశక్తులా కృషిచేస్తాం, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి అన్నారు. యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 20రోజుల నుంచి కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరాహార దీక్షాశిబిరాన్ని సందర్శించిన సతీష్  నిమ్మరసం …

పూర్తి వివరాలు

‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన …

పూర్తి వివరాలు

కూల్‌డ్రింక్స్ వల్ల అనారోగ్య సమస్యలు

cool drinks

కడప: జనవిజ్ఞానవేదిక కడప జిల్లా కమిటీ ప్రచురించిన ‘కూల్‌డ్రింక్స్ మానేద్దాం.. సహజ పానీయాలే తాగుదాం’ అన్న కరపత్రాలను ఇన్‌ఛార్జి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి అరుణ సులోచనాదేవి శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు లేని, అనారోగ్య సమస్యలు సృష్టించే శీతల పానీయాలను తాగడం మానేయడం మంచిదన్నారు. శీతల …

పూర్తి వివరాలు

గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ చెప్పారు. శుక్రవారం ఒంటిమిట్టలో పాత్రికేయులతో మాట్లాడుతూ… చేత్తో ఒలిచిన బియ్యం గింజలతో సీతారాముల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని  ఆయన తెలిపారు. చేత్తో ఒలిచిన బియ్యం గింజలను చుట్టుప్రక్కల గ్రామస్థులు 27 వరకూ తెచ్చి …

పూర్తి వివరాలు

రేపు రాయలసీమ మహాసభ సమావేశం

సీమపై వివక్ష

మైదుకూరు: రాయలసీమ మహాసభ అధ్వర్యంలో ఆదివారం (మార్చి 22వ తేదీ) కడపలోని సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో రాయలసీమ రచయితల, కవుల, కళాకారుల, ప్రజాసంఘాల, విద్యార్ధి, మహిళా,  రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం జరుగనుంది . ఉదయం 10 గంటలకు రాయలసీమ గురించి చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం రాయలసీమ మహాసభ కడప జిల్లా కార్యవర్గ ఎంపిక జరుగుతుంది. …

పూర్తి వివరాలు

బీఎస్ఎన్ఎల్‌కు జిల్లాలో రూ.13 కోట్ల నష్టం

bsnl

ఇదే కొనసాగితే ప్రైవేటుకు అప్పగించినా ఆశ్యర్యపోనవసరం పులివెందుల: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సంస్థను లాభాలబాట పట్టించేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని జీఎం శివశంకరరెడ్డి సూచించారు. సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా సంస్థకు గత ఏడాది రూ.785కోట్లు నష్టం వస్తే జిల్లాలో రూ.13 కోట్ల నష్టం …

పూర్తి వివరాలు

తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

drinking water

కడప: నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు నీటి సమస్య ఎక్కువవుతోందని, కలుషిత నీటితో జనం రోగాలబారిన …

పూర్తి వివరాలు

ఉయ్యాలతాడే ఉరితాడయింది…

నేర గణాంకాలు 1992

కడప: ఉయ్యాల తాడు ఓ చిన్నారి పాలిట ఉరితాడయింది. ఉయ్యాల ఊగుతుండగా ప్రమాదవశాత్తూ ఆ తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడప నగరంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరియపురానికి చెందిన నయోమి(10) అనే బాలిక గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఊయల ఊగుతుండగా ప్రమాదవశాత్తు …

పూర్తి వివరాలు
error: