నిన్న ‘పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారా?’ అని మేము ప్రచురించిన విశ్లేషణను చదివిన కొంతమంది ఇలా చెబుతున్నారు, నేరాల రేటు కాదు కడపలో హత్యలూ, మానభంగాలు లాంటి వాటిలో కడప జిల్లా స్థానం సంగతి చెప్పండి అనీ. వీటి ప్రాతిపదికగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు సదరు కీర్తిని కట్టబెట్టారు అనీ. 2013 నేర గణాంకాల ప్రకారం అం.ప్ర లో వివిధ రకాల నేరాల తీవ్రతను అధికంగా కలిగిన జిల్లాలు… మానభంగాలు లేదా అత్యాచారాలు: మొదటి స్థానం సైబరాబాద్ […]పూర్తి వివరాలు ...
శుక్రవారం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలిలో 11 పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనక జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పరిశ్రమలు రావాలంటే శాంతిభద్రతల ఆవశ్యకత ఎంత అనేది సెలవిచ్చారు. సంతోషం, ఒక ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల సమక్షంలో వారి మనసును రంజిపచేసే విషయాలు మాట్లాడి వారిని ఆకట్టుకున్నందుకు అభినందనలు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాను గురించి తన […]పూర్తి వివరాలు ...
తేల్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేమూరి రాధాకృష్ణ – ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపుకు అధిపతి, ఆం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తుడు, ఆంతరంగికుడు అని తెదేపా వర్గాలు చెబుతుంటాయి. రాధాకృష్ణ గారు ‘కొత్తపలుకు’ పేర ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన సంపాదకీయంలో ‘పట్టిసీమ’ అసలు గుట్టు విప్పినారు. ఇదే విషయాన్ని కడప.ఇన్ఫో రాస్తే అదంతా ఊహే అని తీసిపారేశారు కొంతమంది. ‘వాస్తవానికి, పట్టిసీమ అనేది తాత్కాలికంగా చేస్తున్న ఏర్పాటు మాత్రమే! పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా కలెక్టర్ కెవి రమణ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కలెక్టర్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలని కోరుతూ ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు అఖిలపక్షం నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు.పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన కోదండరాముడు పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ […]పూర్తి వివరాలు ...
జలాశయాలను పరిశీలించిన జగన్ 16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు పులివెందుల: విపక్ష నేత, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ శుక్రవారం మాయిటాల పులివెందులకు నీరందించే పెంచికల బసిరెడ్డి జలాశయం, పైడిపాలెం జలాశయాలను సందర్శించారు. అలాగే పార్నపల్లె తాగునీటి పథకాన్ని, అలాగే వెలిదండ్లలోని నీటికుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జగన్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ… ‘‘పెంచికల బసిరెడ్డి జాలశయం (చిత్రావతి […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఒంటిమిట్ట బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.34 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాజంపేట – కడప రోడ్డులో కొంత భాగానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వావికొలను సుబ్బారావు కొండపైకి చేరుకుని పరిశీలించారు. తరువాత జిల్లా […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం రాత్రి శ్రీసీతారాముల పెళ్లి ఉత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరుగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తితిదే తరపున కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టు వస్త్రాలు అందజేశారు. అంతుకు ముందు సీతా రాములను వేర్వేరుగా వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన […]పూర్తి వివరాలు ...
ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం పులివెందులలోని అధునాతన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని (ఐజీ కార్ల్) సందర్శించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. ”వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. పశుపోషణ […]పూర్తి వివరాలు ...