ఓట్లు, సీట్లు ప్రాతిపదికన జిల్లాకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వైకాపాను ఆదరించారనే అధికారపక్షం కక్ష కట్టింది కోస్తా వాళ్ళ ప్రాపకం కోసమే విపక్ష నేత మౌనం కడప : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనకు జెండాలను పక్కనబెట్టి అన్ని రాజకీయ పక్షాలు కలిసి పోరాడాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. సోమవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ‘కడప ఉక్కు- రాయలసీమ హక్కు, ఉక్కు పరిశ్రమను తరలించడం అడ్డుకుందాం’ అనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర నేత బి నారాయణ అధ్యక్షతన […]పూర్తి వివరాలు ...
పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకులు పోరాడాల్సిన అవసరం ఉంది కడప: కడప జిల్లా విషయంలో మొదటి నుంచీ వివక్ష చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాకుండా ఉండేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఉక్కు పరిశ్రమ స్థాపనకు అనుకూలమైందనే వాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని తేటతెల్లమైంది. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన భాజపా నాయకులు విలేఖరుల సమావేశం పెట్టి మరీ ఉద్ఘాటించారు. ఆదివారం స్థానిక భాజపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా నాయకుడు […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి తరలించాలనుకోవడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే జిల్లాకు కేటాయించిన ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్డీవో రక్షణ రంగం ప్రాజెక్టు ఇతర జిల్లాలకు తరలించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను […]పూర్తి వివరాలు ...
అశోకుడిగా ఎన్జీవోలు సరదాగా పిలుచుకునే ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ‘అశోక్ బాబు’ ఉదార స్వభావం కలిగిన వాడు. ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ ప్రజల బాధలను చూసినా, విన్నా చలించిపోయే సుతి మెత్తని మనస్సు కలిగిన వాడు. కాబట్టే అతివృష్టి కారణంగా దెబ్బతిన్న విశాఖను ఆదుకోవటానికి ఉద్యోగుల జీతం నుంచి ఉదారంగా విరాళం ప్రకటించేశాడు. ఆనక కొత్త రాజధాని కట్టడానికి డబ్బులు లేవు విరాళాలు ఇవ్వండి బాబూ అని డబ్బాలు ఏర్పాటు చేసి కొత్తగా కొలువుదీరిన ఆం.ప్ర […]పూర్తి వివరాలు ...
“15-ఆగస్టు”… అంటే “భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు” అని అంటాననుకొన్నారా ???? అక్కడే మీరు “పట్టిసీమలో” కాలేశారు.. ! – కాదు కాదు.. కానేకాదు.. 15-ఆగష్టు-2015 అంటే, “చంద్రబాబు నాయుడు” గారు “పట్టిసీమ నీటిని రాయలసీమకు తరలించి” సీమ కరువును తరిమికొట్టడానికి పెట్టుకొన్న గడువు.. – ఈ సుదినం రానే వచ్చింది. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో ప్రజలందరూ లేచి, స్నానాదులు పూర్తిచేసి, ఉపవాసంతో, లక్షలాదిగా తరలివచ్చారు.. – ఇకపై మన కరువు తీరబోతుందన్న ఉద్వేగంలో ఉన్న […]పూర్తి వివరాలు ...
దగా చరిత్రకు ఇది కొనసాగింపు ప్రజాప్రతినిధులంతా గొంతెత్తాల కడప: కేంద్ర ఉక్కుశాఖ నియమించిన టాస్క్ ఫోర్సు నివేదిక ఇచ్చిందన్న సాకుతో సెయిల్ ఆధ్వర్యలో ఏర్పాటు చేస్తామన్న కడప స్టీల్ ఫ్యాక్టరీని పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించే ప్రయత్నం పచ్చిమోసమని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కడప జిల్లా ప్రతినిధి ఎ.రఘునాథరెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తప్పుబట్టారు. తరాల తరబడి ‘సీమ’కు జరుగుతున్న దగా చరిత్రకు ఇది కొనసాగింపేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా ఈ విషయమై […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో వివక్షత చూపుతోందని, ఇది మంచి పరిణామం కాదని శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ విమర్శించారు. ‘కడప అంటే చేయంపో’ అన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారం సమగ్రాభివృద్ధి-సామాజిక న్యాయం అనే అంశంపై కలెక్టరేట్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కడప జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రితో, అధికారులతో ఎవరు మాట్లాడినా స్పందించకపోవడం […]పూర్తి వివరాలు ...
కడప: తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన వెంకటేశ్ శుక్రవారం నగరంలోని పెద్దదర్గా(అమీన్ పీర్ దర్గా)ను దర్శించుకున్నారు. అమీర్‌బాబుతో కలిసి వచ్చిన ఆయన దర్గాలోని గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించి గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. దర్గా ప్రతినిధి అమీన్ వెంకటేష్ కు దర్గా ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో దర్గాను దర్శించుకోవాలనుకున్నానని, ఆ కోరిక నేటికి తీరడం సంతోషదాయకమన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద […]పూర్తి వివరాలు ...
కడప: గాలేరు-నగరి పథకంలో భాగమైన గండికోట జలాశయం పూర్తి చేయడానికి అవసరమైన డబ్బులూ, అనుమతులు ఇవ్వకుండా నీళ్లెలా ఇవ్వగలుగుతారని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… కడప, చిత్తూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని అప్పటి తెదేపా ప్రభుత్వం (ఎన్టీఆర్ హయాంలో) గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా శంఖుస్థాపన చేసిందన్నారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మరోమారు గండికోట […]పూర్తి వివరాలు ...