కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే… ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు.. [checklist] పులివెందుల […]పూర్తి వివరాలు ...
తెలుగువారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీని పెడుతున్నామని రాయలసీమకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి కి అవమానాలు ఎదురైతే ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని కిరణ్ అన్నారు. పన్నెండో తేదీ సాయంత్రం రాజమండ్రిలో సభ పెట్టి పార్టీ విధానాలను ప్రకటిస్తామని కిరణ్ అన్నారు.తన జీవితం తెరచిన పుస్తకం అని అన్నారు.తనపై ఆరోపణలను రుజువు చేయాలని కిరణ్ సవాల్ చేశారు.అన్ని నిబంధల ప్రకారమే జరిగాయని అన్నారు. రాయలసీమకే చెందిన జగన్, చంద్రబాబులు ఇప్పటికే […]పూర్తి వివరాలు ...
27న కడపలో ప్రజాగర్జన నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో 27న ప్రజాగర్జన నిర్వహించడం వల్ల ఎన్నికల్లో లాభిస్తుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు హాజరయ్యే గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాగర్జన సభలో చేరతారా, లేక అంతకుముందే సైకిలెక్కుతారా అన్నది తెలియాల్సి ఉంది.పూర్తి వివరాలు ...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన కడప జిల్లాలో మే 7వ తేదీన 10 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా […]పూర్తి వివరాలు ...
తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు. తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది […]పూర్తి వివరాలు ...
ఇడుపులపాయలో వైకాపా ప్లీనరీలో వైఎస్ షర్మిల చేసిన ప్రసంగంలో ఒక భాగం …. “మీ రాజన్న కూతురు.జగన్నన్న చెల్లెల్లు మనస్పూర్తిగా నమస్కరించుకుంటోంది. కష్టకాలంలో మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు అంటారు. అలాంటిది నాలుగేళ్లుగా నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి మీ అందరూ కష్టాలలో పాలుపంచుకున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నే బలపరిచారు.కులాలు,ప్రాంతాలు,మతాలకు అతీతంగా అందరు కలిసి పనిచేస్తున్నారు. దీనికోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా నమస్కరించుకుంటున్నాం. విజయమ్మ ..అమ్మ ఎంత నేర్చుకుందో, తనను తాను ఎంత మార్చుకుందో […]పూర్తి వివరాలు ...
వైకాపా ప్లీనరీలో జగన్ చేసిన ప్రసంగంలో ఒక భాగం …. “ఓట్లకోసం,సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినే కార్యక్రమాన్ని చూశాం..ఓట్ల కోసంసీట్ల కోసం కేసులు పెట్టడం చూశాం..ఓట్లకోసం,సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూస్తున్నాం..రెండు న్నర సంవత్సరాలలో పదహారు నెలలపాటు జైలులో పెట్టారు.అన్యాయమైన రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయని అనుకోలేదు.ఓట్ల కోసం,సీట్ల కోసం చంద్రబాబు,కాంగ్రెస్ కలిసికట్టుగా ఒకటే కేసు పెట్టిన రోజు చూశాం. మూడు నెలల్లో బెయిల్ ఇచ్చి పంపాలి. అయినా దర్యాప్తు […]పూర్తి వివరాలు ...
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజ్జంగా నిజం! సోషియల్ మీడియా దిగ్గజంగా ఖ్యాతిగాంచిన ఫేస్బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణులు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. తెదేపా ఇందు కోసం ఏకంగా ఒక యువజట్టును రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వైకాపాకు సంబంధించిన రాజకీయ విభాగం ఇప్పటికే ఆ పార్టీ పేరుతొ ఒక సమూహాన్ని (గ్రూప్) ఏర్పాటు చేయగా, తెదేపా ‘వోట్ ఫర్ టిడిపి’ పేర ఒక పుటను (పేజి) మరియు అధికారికమైన తెదేపా పుటను నిర్వహిస్తోంది. వైకాపా సైతం […]పూర్తి వివరాలు ...
మాజీ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి గురించి ఈ మధ్య ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే … రాబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినా దిగాకపోయినా తెదేపాకు సహకరిస్తారని – అందుకు నజరానాగా చంద్రబాబు తదనంతరం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇస్తారని. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు డిఎల్ కు ప్రతిపాదించారని, అందుకు ఆయన సుముఖంగా ఉన్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. డిఎల్ కూడా ఇందుకు సిద్దమయ్యే పక్షంలో మైదుకూరు నియోజకవర్గంలో […]పూర్తి వివరాలు ...