తేల్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేమూరి రాధాకృష్ణ – ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపుకు అధిపతి, ఆం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తుడు, ఆంతరంగికుడు అని తెదేపా వర్గాలు చెబుతుంటాయి. రాధాకృష్ణ గారు ‘కొత్తపలుకు’ పేర ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన సంపాదకీయంలో ‘పట్టిసీమ’ అసలు గుట్టు విప్పినారు. ఇదే విషయాన్ని కడప.ఇన్ఫో రాస్తే అదంతా ఊహే అని తీసిపారేశారు కొంతమంది. ‘వాస్తవానికి, పట్టిసీమ అనేది తాత్కాలికంగా చేస్తున్న ఏర్పాటు మాత్రమే! పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన కోదండరాముడు పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఒంటిమిట్ట బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.34 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాజంపేట – కడప రోడ్డులో కొంత భాగానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వావికొలను సుబ్బారావు కొండపైకి చేరుకుని పరిశీలించారు. తరువాత జిల్లా […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం రాత్రి శ్రీసీతారాముల పెళ్లి ఉత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరుగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తితిదే తరపున కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టు వస్త్రాలు అందజేశారు. అంతుకు ముందు సీతా రాములను వేర్వేరుగా వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన […]పూర్తి వివరాలు ...
ఓఒంటిమిట్ట: ఈ రోజు (గురువారం) రాత్రి జరగనున్న కోదండరామయ్య పెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల పెళ్లి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నుంచి ఆరో రోజున రాత్రివేళ వెన్నెలలో ఈ కల్యాణం నిర్వహించడం మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఒంటిమిట్ట ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ముఖ్యమంత్రి […]పూర్తి వివరాలు ...
కడప: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషనులో ప్రవేశం పొందగోరే విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరణకు ప్రకటన విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటరు ఆర్ట్సు కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు ఏప్రెల్ 28వ తేదీ వరకు గడువు ఉంది. అపరాధ […]పూర్తి వివరాలు ...
కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు జిల్లాలోని 8 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. కడప డిపో నుంచి 25, రాజంపేట 30, ప్రొద్దుటూరు 15, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు డిపోల నుంచి పది బస్సుల చొప్పున మొత్తం 120 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఆర్టీసీ […]పూర్తి వివరాలు ...
రేపటి నుంచి ఉత్సవాల అంకురార్పణ కడప: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, […]పూర్తి వివరాలు ...
కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు. ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు […]పూర్తి వివరాలు ...