గురువారం , 21 నవంబర్ 2024

అభిప్రాయం

రామారావు విజేతా? పరాజితుడా?

Nandamuri Taraka RamaRao

“రామారావు తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం. ఆయన దురదృష్టం” అంటారు ఆయన అభిమానులు. అయన అంతటి ప్రతిభాశాలి కావడం, ఆ సినిమాలను మళ్ళా మళ్ళా చూసి ఆస్వాదించగలగడం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆయన దురదృష్టం ఏమిటంటే (బహుశా) తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే మొదలైన డ్యాన్సులు చెయ్యలేక, చెయ్యకుండా ఉండలేక, డ్యాన్సుల పేరుతో ఆయన …

పూర్తి వివరాలు

కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

మనమింతే

రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.

పూర్తి వివరాలు

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహిత్య ప్రయోజనం

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అను వాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే …

పూర్తి వివరాలు

‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

తాళ్ళపొద్దుటూరు

2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22. ———————————- పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు …

పూర్తి వివరాలు

కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

వన్ టౌన్ సర్కిల్

నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుందనే దాన్ని బట్టి కాకుండా ఎంత సులభంగా గొంతు దిగుతుంది, తిన్న తర్వాత ఎంత తేలిగ్గా అరుగుతుంది, అరిగాక వంట్లో ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టే ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి :-). …

పూర్తి వివరాలు

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

జిల్లా కేంద్రంగా కడప

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి/ప్రణాళిక మండళ్లను ఏర్పాటు చేయనుందని. నాలుగు రాయలసీమ జిల్లాలకు కలిపి కడపలో, ఉత్తరాంధ్రకు విజయనగరంలో, మధ్యాంధ్రకు కాకినాడలో, దక్షిణాంధ్రకు గుంటూరులో అన్నారు. మూడు రాజధానుల విషయంలో లాగే నగరాల …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

కడప జిల్లాలో నేరాలు

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో రైలు దహనం జరిగిన రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత (ఆ వ్యాఖ్యల గురించి కూడా కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది) అడపా …

పూర్తి వివరాలు

కవయిత్రి మొల్ల – మా ఊరు

కవయిత్రి మొల్ల

చిన్నతనంలో అమ్మ పిన్ని అత్త ముగ్గురూ రొకళ్ళతో వడ్లు దంచుతూవుంటే ఒకామె ముగ్గురి రొకటిపోట్లు చాకచక్యంగా తప్పించుకుంటూ రోట్లోకి వడ్లు ఎగతోసేది. ఆమె అలా రోట్లోకి వడ్లు ఎగదోస్తూనే తమ రైతు స్త్రీలకు కష్టం తెలియకుండా రామాయణం మొత్తంపాడి వినిపించేది. నాకప్పుడు తెలియదు అవి స్త్రీలరామాయణపు పాటలని. దంచిన వడ్లు చాటలతో చెరిగి …

పూర్తి వివరాలు

ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

పుట్టపర్తి తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య …

పూర్తి వివరాలు
error: