జానమద్ది హనుమచ్ఛాస్త్రి జగమెరిగిన బ్రౌన్ శాస్త్రిగా మూడు పదుల పుస్తకాలు వెలువరించి, అరువదేండ్ల సాహిత్య జీవితం గడిపి 90 ఏండ్ల పండు వయస్సులో మొన్న (28 ఫిబ్రవరి) తనువు చాలించారు. విషయం, వివేకం, విచక్షణ ప్రోది చేసుకున్న ఆయన క్రమశిక్షణతో, సమయపాలనతో జీవన గమనం సాగించారు. జీవితంలో చివరి మూడు నెలలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. దానికి ముందు చిర్రుని చీది ఎరగని ఆరోగ్యం వారిది. ‘దురూహలకు, దురాలోచనలకు నా మనస్సులో స్థానం ఉండదు.. ఇదే నా […]పూర్తి వివరాలు ...
డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, […]పూర్తి వివరాలు ...
‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ (కడప) జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షలో 26వ ర్యాంకు సాధించిన పవన్ గురించి ఆయన మాటల్లోనే.. మాది వైఎస్సార్ (కడప) జిల్లాలోని రామాపురం మండలం బయారెడ్డిగారిపల్లె […]పూర్తి వివరాలు ...
చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక ఘట్టాలలో పలు వైవిధ్యభరతమైన పాత్రలు పోషించిన వెంకటకృష్ణయ్య స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె. 1953లో కృష్ణయ్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా 1975దశకంలో రికార్డు […]పూర్తి వివరాలు ...
నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే “ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు. కాని మృత్యువుకి ముందువెనుకలు నిర్దుష్టంగా తెలుసు. మృత్యువు కొన్ని జీవితాలకు అమోఘమైన డిగ్నిటీని యిస్తుంది. అనూహ్యమైన గ్లామర్ ని యిస్తుంది. ప్రజాస్పందననీ, ఆవేదననీ జత చేస్తుంది. ఒక్క మృత్యువుకే ఆ శక్తి వుంది. తప్పనిసరిగా విషాదం, ఆవేదన- ఆ వ్యక్తి మంచి చెడ్డలమీద మన్నికయిన […]పూర్తి వివరాలు ...
నాటికలు నాటకాలు రాసి ఒప్పించాడు – నటించి మెప్పించాడు – ప్రయోక్తగా రాణించాడు – పాటను పరవళ్ళు తోక్కించాడు – మిమిక్రీతో అలరించాడు – కథలతో ఆలోచింపజేశాడు. కథ చెప్పి ఎదుటివాళ్ళను మెప్పించడంలో గొల్లపూడి మారుతీరావు అందెవేసిన చేయి అని విన్నాను. అనుభవానికి రాలేదు. అయితే ఆ అద్భుత ప్రయోగాల్లో ఆరవేటి తనకు తానే సాటి.పూర్తి వివరాలు ...
రత్న సభాపతిని ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది. అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం పూర్వాపరాలు తెలుసుకోనిదే ఎవర్ని గురించీ అంచనా వేయలేం. ఆ దృష్టితో ఒక్కసారి రత్నసభాపతి గత జీవితచరిత్రను ప్రస్తావించక తప్పదు. బాల్యం బండారు రత్నసభాపతి […]పూర్తి వివరాలు ...
అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూ, అఖిల భారతావనికీ – ఒక మేరకు – ప్రపంచానికి కూడా రాయలసీమ, చాలా కానుకలను ప్రసాదించింది. ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు, […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...