కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ ఇన్స్పెక్టర్గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు ఆచార్యులుగా 1984 వరకు ప్రభుత్వ సేవలందించారు. గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది […]పూర్తి వివరాలు ...
మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన… నాలుగైదు దశాబ్దాల కిందటి మాట. కడప జిల్లాలోని పల్లెటూళ్ళలో ఆధునిక సాహిత్య చైతన్యం అబ్బిన రైతు కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. వీటిలో సొదుం జయరాం […]పూర్తి వివరాలు ...
మట్లి వెంకట్రామరాజు మైసూరు నవాబైన హైదరాలీకి కప్పము కట్టడానికి తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన మైసూరు నవాబు హైదరాలీ దండెత్తి వచ్చి వెంకట్రామరాజును తరిమి సిద్దవటం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. హైదరాలీ ఈ సిద్ధవటం కోటను కప్పం చెల్లించు విధానంపై చిట్వేలి జమిందారునకు స్వాధీనం చేసినాడు. ఈ జమిందారు భాకరాపేట పరిసర ప్రాంతాలలో ఉన్న పట్ర పాళెగార్ల వ్యవహారాలకు దోపిడీలకు భయపడి, ముదిరెడ్డిపల్లె పాళెగాడైన గోపాలరెడ్డి ఆయన సోదరుడు నర్సింరెడ్డికి అమ్మివేశాడు. ఈ ముదిరెడ్డిపల్లి సోదరులు దుర్మార్గులు. పేద […]పూర్తి వివరాలు ...
ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్లతో జరిగిన రెండు, మూడు […]పూర్తి వివరాలు ...
“ఆ మిణుగురు దారి పొడవునా వెలుతురు పువ్వుల్ని రాల్చుకుంటూ వెళ్ళిపోయింది. పదండి, ఏరుకుంటూ ముందుకెళదాం..” కామ్రేడ్ ఎం.జె కోసం ఒక కవి మిత్రుడి కలం నుండి మెరిసిన అక్షర నివాళి. ఇవి ఆయన జీవితానికి అద్దం పట్టే పదాలు. ఎంజెగా రాయలసీమలో సుపరిచితులైన ములపాకు జంగంరెడ్డి సుబ్బరామిరెడ్డి తన జీవితమంతా వ్యవస్థతో గొడవ పడుతూ ఈ ఆగస్టు 2న (తన 62వ ఏట) శాశ్వత విశ్రాంతికిలోకి వెళ్ళిపోయాడు. చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె, భుజంపై ఎర్ర […]పూర్తి వివరాలు ...
పేరు : జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి పుట్టిన తేదీ: 05.12.1956 స్వస్థలం : యడబల్లి, గడికోట గ్రామం, వీరబల్లి మండలం, కడప జిల్లా ప్రస్తుత హోదా: శాశ్వత న్యాయమూర్తి, ఆం.ప్ర హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేసుకున్నది : 06.12.1979న న్యాయవాద ప్రాక్టీసు : ఆం.ప్ర హైకోర్టు మరియు హైదరాబాదులోని వివిధ కోర్టులలో నిర్వహించిన హోదాలు : అదనపు న్యాయమూర్తి, ఆం.ప్ర హైకోర్టు (11.9.2006 నుండి 10.04.2008 వరకు) ఆం.ప్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ( జూలై 1995 – డిసెంబర్ […]పూర్తి వివరాలు ...
పూర్తి పేరు : ఆకేపాటి విజయసాగర్ రెడ్డి పుట్టిన తేదీ : 27 -12 – 1945 మరణించిన తేదీ: 4 – 06 – 2012 తల్లిదండ్రులు: ఆకేపాటి సుబ్బరామిరెడ్డి, ఆకేపాటి రాజమ్మల మొదటి కుమారుడు (ఎనిమిది మందిలో) భార్య : ఆకేపాటి ఇందిర విద్యార్హత : బి.ఏ పట్టభద్రులు (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) స్వస్థలం : పాటూరు, నందలూరు మండలం (కడప జిల్లా) వృత్తి : సైనికాధికారి(భారత సైన్యం) మరియు ఐఏఎస్ అధికారి (1968 బ్యాచ్) (రిటైర్డ్) కేడర్ […]పూర్తి వివరాలు ...
1992వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కె విజయానంద్ వివరాలు. విజయానంద్ కడపజిల్లా, రాజుపాలెంకు చెందినవారు. ఎంటెక్ పట్టభద్రుడైన విజయానంద్ యొక్క పూర్తి వివరాలు - ఫోటోల సహితంగా. పూర్తి వివరాలు ...
పేరు : జవహర్‌రెడ్డి కె.ఎస్ పుట్టిన తేదీ : 02/06/1964 వయస్సు : 49 సంవత్సరాల 9 నెలలా 28 రోజులు (ఈ రోజుకి) తల్లిదండ్రులు : కీ.శే కె.ఎస్ ఈశ్వరరెడ్డి, కీ.శే కె.ఎస్ లక్ష్మీదేవమ్మ విద్యార్హత : పశువైద్య శాస్త్ర పట్టభద్రులు (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) స్వస్థలం : కొండాపురం (కడప జిల్లా) వృత్తి : ఐఏఎస్ అధికారి (1990 బ్యాచ్) ప్రస్తుత హోదా : ముఖ్య కార్యదర్శి, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహించిన హోదాలు : 14/10/2009 – మార్చి 2014 వరకు కార్యదర్శి – ఆం.ప్ర ముఖ్యమంత్రి కార్యాలయం […]పూర్తి వివరాలు ...