మే 2 నుంచి తిరుణాళ్ళ హరిహరులు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి వైద్యనాదేశ్వరస్వామి, చెన్నకేశవస్వాముల బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మేనెల 6 వరకూ 10 రోజులపాటు సాగుతాయి. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, ఆలయ ప్రధానర్చకులు సుమంత్దీక్షితులు తెలిపారు. పది రోజులపాటు క్షేత్రాధిపతి శ్రీవైద్యనాదేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వాములకు ఉదయం సాయంత్రం వాహనసేవలు నిత్యపూజలు అభిషేకాలు, తోమాలసేవలు, హోమాలు నిర్వహిస్తారు. మూడురోజుల తిరునాళ్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న చెన్నకేశవస్వామికి అష్టోత్తర […]పూర్తి వివరాలు ...
కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్షాఖాద్రి ఉరుసు ఘనంగా ముగిసింది. ఈనెల 14న నషాన్తో ప్రారంభం కాగా గురువారం తహలీల్తో ముగిశాయి. గురువారం ఉదయం దర్గా ఫీఠాధిపతి గఫార్స్వామి ఆధ్వర్యంలో గంధం ఇంటి నుంచి వూరేగింపుగా గంధాన్ని, పూలను తీసుకువచ్చి దర్గాలో ఎక్కించారు. నషాన్ సందర్భంగా దర్గాలో ప్రతిష్ఠించిన జెండాను కిందికి దించారు. స్వామి మజార్లపై పూలఛాదర్లు సమర్పించి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ, ముస్లిం భక్తులు చక్కెర చదివింపులు చేసి, పంచిపెట్టారు. పీఠాధిపతి సోదరులు […]పూర్తి వివరాలు ...
హిందూ, ముస్లింల సమైక్యత ప్రతీక కమలాపురం శ్రీహజరత్ అబ్దుల్ గఫార్షా ఖాద్రి, దస్తగిరి ఖాద్రి, మౌలానామౌల్వి ఖాద్రి, మొహిద్దీన్షా ఖాద్రి, జహిరుద్దీన్షాఖాద్రి దర్గా . నేటికీ ఇక్కడ హిందువులే ధర్మకర్తలు. దర్గాను దస్తగిరిషా ఖాద్రి శిష్యుడు, పొద్దుటూరుకు చెందిన నామా నాగయ్య శ్రేష్ఠి నిర్మించారు. నేటివరకూ వారి కుటుంబికులే ధర్మకర్తలుగా సేవలందిస్తున్నారు. హజరత్ అబ్దుల్గఫార్షా ఖాద్రి ఉరుసు సోమవారం ఉరుసు ప్రారంభమై 17న ముగుస్తుంది. 14వ తేదీ నషాన్ 15న గంధం, 16న ఉరుసు, 17న తహలీల్తో ఉరుసు […]పూర్తి వివరాలు ...
మైదుకూరు మండలం యెన్.యర్రబల్లెలో ఉగాది సందర్భంగా (అదే రోజు) సోమవారం రాత్రి జరిగిన శ్రీ జనార్ధనస్వామి తిరుణాళలో ప్రదర్శించిన చెంచు (చెంచులక్ష్మి వీధిబాగవతం) నాటకం ప్రేక్షకులను అలరింపచేసింది. అలయ ధర్మకర్త పగిడి రంగయ్య దాసు ఆధ్వర్యంలో ఈ తిరుణాల , వీధి నాటక ప్రదర్శన జరిగింది. రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున 4 గంటల దాకా జరిగిన ఈ చెంచు నాటకాన్ని వందలాది మంది ప్రేక్షకులు కదలకుండా ఆసక్తిగా తిలకించడం విశేషం. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఎరుకసాని […]పూర్తి వివరాలు ...
రామాపురం మండలంలోని గంగనేరులో (రాచపల్లె గ్రామం) ఏప్రిల్ 1, 2న మంచాలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొవ్వూరువారు మంచాలమ్మను ఇలవేలుపుగా కొలుస్తారు. కొండవాండ్లపల్లె నుంచి దేవతకు నాణ్యం తీసుకొస్తారు. మంచాలమ్మ దేవతను రాచపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, కోమ్మూరువాండ్లపల్లె, గంగనేరు తదితర గ్రామాల్లో వూరేగించిన అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.పూర్తి వివరాలు ...
సంకీర్తనాచార్యులు అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు గురువారం ఆయన జన్మస్థలి తాళ్లపాక గ్రామం (రాజంపేట మండలం)లో తితిదే ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య ధ్యానమందిరంలో గోష్టి గానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నమయ్య చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో వూరేగించారు. అంతకు ముందు అన్నమయ్య మూలవిరాట్ వద్ద గ్రామపెద్దలు, తితిదే అధికారులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
ఈనెల 27,28 తేదీలలో (గురు,శుక్రవారాలలో) బ్రహ్మంగారిమఠం మండలంలోని ఓబులరాజుపల్లె నారాయణస్వామి 100వ ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని సాలమ్మ మఠం, బొమ్మువారి మఠాలలో ఈ ఆరాధనోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం, సంస్కృతిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలను, భజనలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం సమీపంలోని శ్రీ నారాయణ స్వామి మఠం ఆధ్యాత్మిక భావనలతో వెలుగొందింది. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం మిట్టపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామంలో నర్రెడ్డి గంగిరెడ్డి, రామాంబ దంపతులకు 1834 లో […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511వ వర్థంతి ఉత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకూ అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం వద్ద, తిరుమల, తిరుపతిలలో దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తి.తి.దే డిప్యూటీ ఈవోలు శారద, బాలాజీ, ఏఈవో పద్మావతి తెలిపారు. ఇటీవల తాళ్లపాక అన్నమాచార్య ధ్యానమందిరంలో వర్థంతి ఉత్సవాల గోడపత్రాన్ని విడుదల చేశారు. తాళ్ళపాక, 108 అడుగుల విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాలు: 27న బహుళద్వాదశి పూజలు, గోష్ఠిగానం, అన్నమయ్య చిత్రపటం […]పూర్తి వివరాలు ...
చిన్నమండెం: కేశాపురం గ్రామం దేవళంపేటలో మంగళవారం సాయంత్రం సిద్దల బోనాలతో ప్రారంభమైన పాలేటమ్మ తిరునాళ్లలో రాత్రికి మొక్కులు ఉన్న భక్తులు కట్టిన చాందినీ బండ్లు, బాణ సంచా పేలుళ్లు, చెక్కభజనలు, కోలాటాలు, సంగీతవిభావరి అందరిని అలరించాయి. బుధవారం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా చిత్తూరు జిల్లా సరిహద్దు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం వరుసలో నిల్చోవాల్సి వచ్చింది. […]పూర్తి వివరాలు ...