చిన్నర్సుపల్లెలో సద్గురు పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈనెల 15 నుంచి నిర్వహిస్తున్నట్టు పీఠాధిపతి నాగలింగమయ్య తెలిపారు. మకర సంక్రాంతి నాడు ఉదయం నుంచే స్వామివారి జీవసమాధికి పుష్పాలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పగలంతా ప్రత్యేక కార్యక్రమాలుంటాయని, రాత్రికి స్వామివారి పేరుతో కాలమానిని ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కొండమూల చౌడేశ్వరీమాత వూరేగింపు, పెద్దమండెం మండలం నుంచి వచ్చే దేవరెద్దు ప్రదర్శనతో పాటు చింతామణి, సత్యహరిశ్చంద్ర నాటకాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 16న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జెండా […]పూర్తి వివరాలు ...
వైకుంఠ ఏకాదశి(ముక్కోటి దేవతలు వేచి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన రోజు)ని పురస్కరించుకుని గురువారం దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. గోవిందనామస్మరణల నడుమ కడపరాయుడిని ఉత్తరద్వారం వద్ద దర్శించి తరించారు. ఆలయప్రధాన అర్చకులు శేషాచార్యులు పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించినారు. వైకుంఠ ఏకాదశి అంటే? ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు […]పూర్తి వివరాలు ...
కడప: శ్రీదేవి భూదేవిలతో దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ కడపరాయని కల్యాణం కన్నుల పండువగా సాగింది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణం చూసి తరించినారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.పూర్తి వివరాలు ...
9న సద్గురు నారాయణరెడ్డి స్వామి వార్షిక ఆరాధన సుంకులుగారిపల్లె: భగవద్గీత మార్గదర్శకంగా,ధర్మసంస్థాపనే ఆశయంగా మైదుకూరు మండలం సుంకులుగారిపల్లెలో వెలసిన బృందావన ఆశ్రమంలో అచలసిద్ధాంత ప్రచారం జరుగుతోంది. శ్రీమదచల సద్గురు అట్లసాధు నారాయణ రెడ్డి తాత ఆరాధనోత్సవాలు ఈ ఆశ్రమంలో ప్రతియేటా మార్గశిర మాసం బహుళ తదియ నాడు జరుగుతాయి. ఈ ఆశ్రమ చరిత్ర, నేపథ్యం ఇలా ఉంది. చిత్తూరు జిల్లా వడమాలపేటలో సుమారు 160 యేళ్ళ కిందట హజరత్ బురహనూల్ షా ఖాద్రి పీఠాధిపతిగా అచల సిద్ధాంత […]పూర్తి వివరాలు ...
ఇటీవలి కాలంలో హేతువాద సంస్థలు, మాధ్యమాల ప్రచారం కారణంగా ప్రజలలో చాలా వరకు మూఢ నమ్మకాలను, ఆచారాలను సమర్ధించే పరిస్తితి తగ్గింది. కానీ ఒకప్పుడు ఈ విశ్వాసాలు అధిక సంఖ్యలో ఉండేవి. 19వ శతాబ్దం (1800 – 1900)లో కడప జిల్లా ప్రజలలో పశుపక్షాదులకు సంబంధించి ఎలాంటి విశ్వాసాలు (మూఢనమ్మకాలు)ఉండేవో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పటికీ వీటిలో కొన్ని అక్కడక్కడా కనిపించవచ్చు. 1875లో కడప జిల్లాకు సబ్ కలెక్టర్ గా వ్యవహరించిన జే.డి.గ్రిబుల్ అనే ఆయన […]పూర్తి వివరాలు ...
కడప: స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర గల హజరత్ ఖ్వాజా సయ్యద్‌షామొహర్ అలీ (మొరి సయ్యద్‌సాహెబ్ వలి) 417వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 20, 21వ తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఆస్థానే మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం గంథం ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ముగరిబ్ నమాజ్ తరువాత పీఠాధిపతి ఇంటి నుంచి ఫకీర్ల మేళతాళాలతో దర్గా చేరుకొని గంథాన్ని సమర్పించనున్నారు. 21వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఖవ్వాలి […]పూర్తి వివరాలు ...
కడప: ఆదివారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో జిల్లాలో ముస్లింలందరూ సంతోషంతో రంజాన్ సన్నాహాలు ప్రారంభించారు. చంద్రోదయం అయిందని అందరికీ తెల్పుతూ మసీదుల వద్ద నిర్వాహకులూ, భక్తులూ, ముస్లిం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు టపాసులు పేల్చారు. మసీదుల్లో ఇప్పటికే నిర్వాహకులు ఉపవాస దీక్షలు చేపట్టనున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఒక్కరూ అల్లాహ్ ఆదేశానుసారం రోజా (ఉపవాసం) ఉంటూ ఆయన చూపిన మార్గంలో పయనించడానికి శక్తి […]పూర్తి వివరాలు ...
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తితిదే ఆధ్వర్యంలో ఆదివారం వీరబల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదిక కానుంది. ఇందుకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థాన కల్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం అన్నప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు పంపిణీ చేయనున్నట్లు తితిదే ఎస్ఈ రామచంద్రారెడ్డి, కల్యాణ ప్రాజెక్టు ఎస్ఓ రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీనివాస […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణానికి పడమటి దిశగా పవిత్ర పినాకినీ నదీ తీరంలో క్రీ.శ. 1651 సంవత్సరంలో శ్రీ హజరత్ గూడు మస్తాన్ వలీ వారు సమాధియై ఉన్నారు. ఆయన పేరుమీద ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లిం సోదరులు సమైక్యతకు ప్రతీకగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉరుసు వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అరేబియా దేశానికి చెందిన నలుగురు ముస్లిం సోదరులు ఇస్లాం […]పూర్తి వివరాలు ...