Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
[divider](తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్) తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షిక కోసం కమలాదేవిని చెన్నైలోని ఆమె నివాసంలో కలిసినపుడు ఆమె తన బాల్య స్మృతులను ఇలా పంచుకున్నారు….పూర్తి వివరాలు ...
తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….పూర్తి వివరాలు ...
పెదయౌబళపు కొండ పెరిగీనిదే వదలకకొలిచితే వరములిచ్చీని పదివేలశిరసుల పలునరసింహము గుదిగొన్న చేతుల గురుతైనది ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది మొనసి రాకాసి మొకములగొట్టేది కనకపుదైత్యుని కడుపుచించినది తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది దేవతలు గొలువ గద్దెపై నున్నది శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది భావించి చూచితేను పరబ్రహ్మమైనదిపూర్తి వివరాలు ...
composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె ఎగసినగరుడని యేపున’ధా’యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగెపూర్తి వివరాలు ...
మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, గోగాకు ఊరిమిండి, అన్నీ కలిపికొట్టి యింగో పుల్లగూరా, యిట్ట యెన్నిజేసినా నాకు మాత్రం యిష్టంగా ముద్ద దిగేదిగాదు. అన్నిట్లో వం, బెం, టం, […]పూర్తి వివరాలు ...
నాలుగు జిల్లాల రాయలసీమ. రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. వర్షాల్లేక బీడు పడిన భూములు, సాగునీరు, తాగునీరు లేక అల్లాడే గ్రామాలు, రాజకీయ నాయకులతో పాటూ పెరుగుతున్న ఫ్యాక్షన్ కక్షలు వీటన్నిటి వలయాల మధ్యనుంచి సీమ కథా సాహిత్యం నిర్మితమవుతూ వచ్చింది. కరువు, కక్షలు, దళిత, స్ర్తి, రాజకీయ, ప్రేమ కథలు ఎన్నో యిక్కడినుంచి విస్తృతంగా వెలువడ్డాయి. సీమ సంస్కృతి మిశ్రమ సంస్కృతి. ఈ నేపథ్యంలో సీమలోని నాలుగు (అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప) […]పూర్తి వివరాలు ...
విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. ”అబ్బెబ్బే… అదేం లేదులేబ్బా… నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య.పూర్తి వివరాలు ...
నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను || సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం మందు సంధ్యాకాలమున ఔభళేశుడు | పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరమృగరూపము నానాహస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె గురుతర బ్రహ్మాండ గుహలోనను || కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి మించుగ ఇందిర తొడమీద బెట్టుక | అంచె శ్రీవేంకటగిరి […]పూర్తి వివరాలు ...