॥పల్లవి॥మందులేదు దీనికి మంత్ర మేమియులేదుమందుమంత్రము దనమతిలోనే కలదు॥చ1॥కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ, గట్టువదలించకొనఁ గొంత వలదావదలించఁబోయిన వడిగొని పైపైనేకదియుఁగాని తన్ను వదల దేమియును॥చ2॥మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండియెనసిన తిరువేంకటేశునితనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములుతనకుఁదానే వీడుఁ దలఁకవలదుగాన రాగము: నాట రేకు: 0026-06 సంపుటము: 1-161 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాటపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంత చదివిన నేమి వినిన తన-చింత యేల మాను సిరులేల కలుగు॥చ1॥ఇతర దూషణములు యెడసినఁగాకఅతికాముకుఁడుగాని యప్పుడు గాకమతిచంచలము గొంత మానినఁగాకగతి యేల కలుగు దుర్గతులేల మాను॥చ2॥పరధనములయాస పాసినఁగాకఅరిదినిందలులేనియప్పుడు గాకవిరసవర్తనము విడిచినఁగాకపరమేల కలుగు నాపదలేల మాను॥చ3॥వేంకటపతి నాత్మ వెదకినఁగాకకింక మనసునఁ దొలఁగినఁగాకబొంకుమాట లెడసిపోయినఁగాకశంకయాల మాను జయమేల కలుగు రాగము: సామంతం రేకు: 0010-02 సంపుటము: 1-62 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొండో నుయ్యో కుమతులాలతండుముండు తట్టుముట్టు తాఁకైనఁ గనుఁడీread॥చ1॥కాకివోటు జముచేత కందుకుందు మరుచేతమాకాపని గారు మనుజులాలపోకుమని యాఁపరాదు పొమ్మని చెప్పఁగరాదుమీకుమీకే చూచుకొండు మీరే కనుఁడు॥చ2॥గాములిల్లు పుట్టమీఁది కప్పు తోలు పై కప్పునేమా యెఱఁగము నిపుణులాలపామునోరికడి మీప్రాణపుటూరుపు గాలిజాము జాము మేలుఁగీడు చక్కఁజేయఁ గనుఁడు॥చ3॥రచ్చమాని చింతకిందు రాఁపులకూటమిపొందుముచ్చో చిచ్చో మూఢులాలయెచ్చరికతోడ వేంకటేశుదాసులఁ గూడిపచ్చిగచ్చు మేనితోడ భయమెల్ల బాయుఁడు రాగము: దేసాక్షి రేకు: 0026-05 సంపుటము: 1-160 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పదిలము కోట పగవారుఅదనఁ గాచుకొందు రాఱుగురు॥చ1॥ఇమ్మైఁ జెప్ప యిందరిచేతతొమ్మిదినెల్లఁ దోఁగినదికొమ్మతీరునఁ గుదురైనకోటదొమ్మికాండ్లై దుగు రుందురు॥చ2॥వొంటికాఁడు రాజు వుడుగక తమలోనవొంటనీనిమంత్రు లొక యిద్దరుదంటతనంబునఁ దమయిచ్చఁ దిరిగాడు-బంటు లేడుగురు బలవంతులు॥చ3॥కలవు తొమ్మిది కనుమల తంత్రమునిలుపఁగలిగినట్టినెరవాదులుతెలిసి కొనేటితిమ్మినాయఁడు చొచ్చెబలిసె యీకోట భయమేల రాగము: శంకరాభరణం రేకు: 0010-01 సంపుటము: 1-61 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥మోసమున మాయావిమోహితుఁడై పోయికాసు సేయని పనికి గాసిఁబడెఁ బ్రాణి॥చ1॥కన్నులనియెడి మహకల్పభూజము లివితన్నుఁ బుణ్యనిఁ జేయఁ దగిలి వచ్చినవివున్నతోన్నతబుద్ధి నొనగూర్ప కది దేహికన్న చోటికిఁ బఱపి గాసిఁబడెఁ బ్రాణి॥చ2॥చిత్తమనియెడి మహచింతామణి దనకుతొత్తువలె వలసి తనుఁ దోడుతేఁగలదిహత్తించి హరిమీఁద నలరింప కది వృథాతిత్తిలో సుఖమునకు తిరిగె నీప్రాణి॥చ3॥కామతత్వంబనెడి కామధేనువు దనకువేమారుఁ గోరికల వెల్లిగొలిపెడిదియీమేను తిరువేంకటేశుఁ జేరకపోయికామాంధుఁడై మిగుల గతిమాలెఁ బ్రాణి రాగము: ముఖారి రేకు: 0026-04 సంపుటము: 1-159 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవేవేదవిరహితులకు వెఱతు మటుగాన॥చ1॥ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁబరికించవలెఁగాని భజియింపరాదుగరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_స్మరణ విజ్ఞానవాసన గాదుగాన॥చ2॥యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకుసహజమనవలెఁగాని సరిఁ గొలువరాదుఅహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగుగ్రహియింపరా దవగ్రాహములు గాన॥చ3॥యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁజింతింపవలెఁగాని సేవింపరాదుఅంతయు ననరుహమును నరుహంబనఁగరాదుఅంతవానికిఁ బరుల కలవడదుగాన రాగము: సామంతం రేకు: 0009-05 సంపుటము: 1-60 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆఁకటివేళల నలపైన వేళలనుతేఁకువ హరినామమే దిక్కు మఱిలేదు॥చ1॥కొఱమాలి వున్నవేళ కులము చెడినవేళచెఱఁవొడి వొరులచేఁ జిక్కినవేళవొఱపైన హరినామ మొక్కటే గతిగాకమఱచి తప్పిననైన మఱిలేదు తెరఁగు॥చ2॥ఆపద వచ్చినవేళ యారడిఁబడినవేళపాపపు వేళల భయపడినవేళవోపినంత హరినామ మొక్కటే గతిగాకమాపుదాఁకాఁ బొరలిన మరిలేదు తెఱఁగు॥చ3॥సంకెళఁ బెట్టినవేళ చంపఁ బిలిచిన వేళఅంకిలిగా నప్పులవారాఁగిన వేళవేంకటేశునామమే విడిపించ గతిగాకమంకుబుద్ధిఁ బొరలిన మరిలేదు తెఱఁగు రాగము: ముఖారి రేకు: 0026-03 సంపుటము: 1-158 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ మదమత్సరము లేక మనసుపేదై పో పదరినయాసలవాఁడువో వైష్ణవుఁడు ॥చ1॥ ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడి పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు ॥చ2॥ గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు ॥చ3॥ ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప వావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు రాగము: ఆహిరి రేకు: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలివేవేలు దురితముల వేగించు టొండెis-aber.net॥చ1॥కనుఁగొనల నిరుమేను గాఁడిపారుట లొండెచనుఁగొండలను మహచరులఁ బడు టొండెతనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండెఘనమోహబంధములఁ గట్టువడు టొండె॥చ2॥మొనసి యాశాపాశములయురులఁ బడు టొండెకనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండెమనసు కాఁతాళమును మల్లువెనఁగుట లొండెపనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె॥చ3॥తడసి మమతల నిరంతర దైన్యమది యొండెనడుమనే కన్నుగానక తిరుగు టొండెయెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేకపడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె రాగము: శ్రీరాగం రేకు: 0026-02 సంపుటము: 1-157 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...