కడప జిల్లాకు చెందిన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి ‘కుట్ర’ పేరుతో రాసిన కథ (కధానిక). జ్యోతి మాసపత్రిక 1981 నవంబరు సంచికలో ప్రచురితమైన ఈ కథ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం…పూర్తి వివరాలు ...
ఆపదేనా? అనే పేరుతో రారా గా ప్రసిద్దులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన కథ. 1984 సెప్టెంబరు నాటి ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురితం.పూర్తి వివరాలు ...
సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి వారి శివతాండవం పై వ్యాఖ్య శివరాత్రి వచ్చిందంటే చాలు ఆ చిదానందరూపుడి వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాం. మూడుకన్నులు.. మెడలో నాగులు.. ఒళ్లంతా విభూది.. ఈ వెండికొండ వెలుగు రేడు గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇక ఆనందమొచ్చినా.. ఆగ్రహమొచ్చినా.. అనుగ్రహించే శివతాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ శివతాండవ చిత్రాన్ని ప్రముఖ కవి పుట్టపర్తి నారాయణాచార్యులు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. శివతాండవమట-శివలాస్యంబట.. ఏమానందం-ఏమానందం, ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు అంటూ శివుడి నాట్యానికి సరితూగేలా […]పూర్తి వివరాలు ...
ఉదయం 6 గంటలకు మంచం మీద నుండి లేవడానికి కునికిపాట్లు పడుతుండగా సెల్‌ఫోన్ మోగింది. ఇంక లేవక తప్పలేదు. అవతలి నుండి ‘విశ్వనాథ్ గారా?’ కన్నడంలో అడిగారెవరో. నాకు కన్నడం రాదు. అతను చెప్పిన పేరు నాదే. ‘ఔను. విశ్వనాథ్‌నే మాట్లాడుతున్నా’. అవతలి నుండి, తన పేరు రఘురామ సోమయాజి… అంటూ కన్నడంలో చెప్పుకుపోతున్నాడు. నేను ఇంగ్లీషులో అడిగే ప్రయత్నం చేసినా, అతను కన్నడంలోనే చెప్పుకుపోతున్నాడు. అతని మాటల్లో అక్కడక్కడా వినిపించిన ఇంగ్లీషు పదాల ఆసరాగా కొంత […]పూర్తి వివరాలు ...
రెడ్డేరోళ్ల ఆదిరెడ్డి ఇంటిముందు బ్యాండు మేళాలు ఉన్నట్టుండి మోగడంతో జనం సందడిగా గుమిగూడినారు. రేపు దగ్గరలోని టవున్లో ఆదిరెడ్డి కొడుకు విష్ణూది పెళ్లి. పెళ్లికి ముందు జరిపే దాసర్ల కార్యం ఆదిరెడ్డి ఇంట్లో జరుగుతోంది. దాసర్ల కోసం కుండలూ, బానలు తెచ్చి రామస్వామి దేవళం ముందు ఆవరణలోని వేపచెట్టు కింద పెట్టి సున్నపు నీళ్లు కలిపిన గుడ్డతో వాటిపై తెల్లటి పట్టెలు గీస్తున్నాడు కుమ్మరిశెట్టి. ఆడోళ్లంతా అక్కడ చేరి సాంగెపు పనులు చక్కబెడుతూ చతుర్లు విసురుకుంటున్నారు. సారేకాలు, […]పూర్తి వివరాలు ...
సిద్దేశ్వరం ..గద్దించే స్వరం రాయలసీమకు ఇది వరం పాలకుల వెన్నులో జ్వరం కడితే అది సిద్దేశ్వరం కాదంటే అది యుద్దేశ్వరం సాగునీటి ఉద్యమ శరం తోకతొక్కిన సీమ నాగస్వరం కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి కరువు జనుల ఆశలను కుక్కి సాగరాలను నిర్మించుకుని మూడుకార్లు పండించుకుని గొంతెండుతోందని గోస పెడితే అరెస్టులతో అణచేస్తారా ? అదిగదిగో కదులుతోంది దండు ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు నలుదిశలా కనబడలేదా ? రాయలసీమ ఉద్యమ జండా సాగుతోంది సన్నని దారుల గుండా ! […]పూర్తి వివరాలు ...
తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...
శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్‌రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక రాగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్యకారుల దృష్టంతా సాహిత్యనేత్రం వైపు తిరిగింది. అప్పటికే ‘రచన’, ‘ఆహ్వానం’ మార్కెట్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి […]పూర్తి వివరాలు ...
‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య లక్ష్యం గురించి రారా దృక్పథం. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ సాహిత్య […]పూర్తి వివరాలు ...