॥పల్లవి॥ఎంత చేసిన తనకేది తుదచింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు॥చ1॥ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁగడమే కాకిఁకఁ గడ యేదితడఁబడ హరియే దైవమనుచును మదివిడువక వుండిన వెరవే చాలు॥చ2॥యెన్నితపము లివి యెట్లఁ జేసినాఅన్నువ కధికము కలవేదివన్నెలఁ గలఁగక వనజాక్షునిపైవున్న చిత్తమది వొక్కటే చాలు॥చ3॥యిందరివాదము లెట్ల గెలిచినాకందే గాకిఁక గరిమేదిఇందరినేలిన యీ వేంకటపతిపొందగు మహిమల పొడవే చాలు రాగము: సామంతం రేకు: 0016-04 సంపుటము: 1-98 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥మనుజుఁడైపుట్టి మనుజుని సేవించిఅనుదినమును దుఃఖమందనేలా॥చ1॥జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చిపట్టెఁడుగూటికై బతిమాలిపుట్టిన చోటికే పొరలి మనసు పెట్టివట్టిలంపటము వదలనేరఁడుగాన॥చ2॥అందరిలోఁ బుట్టి అందరిలోఁ బెరి-గందరి రూపము లటు దానైఅందమైన శ్రీవేంకటాద్రీశు సేవించిఅందరానిపదమందె నటుగాన రాగము: సామంతం రేకు: 0032-02 సంపుటము: 1-196 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు॥చ1॥ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనకకెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడుయెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు॥చ2॥యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-కెక్కడో తనజన్మ మీ జీవుఁడుయెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పు-డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు॥చ3॥ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనక-కెన్నిదనువులు మోవఁడీ జీవుఁడుయెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ దగిలియెన్నిపదవులఁబొందఁ డీజీవుడు రాగము: నాట రేకు: 0016-03 సంపుటము: 1-97 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥ఏఁటికి నెవ్వరిపొందు యిస్సిరో చీచీనాటకములాల చీచీ నమ్మితిఁగా మిమ్మును॥చ1॥జవ్వనమదమ చీచీ చక్కఁదనమరో చీచీరవ్వైనరాజసగర్వమరో చీచీకొవ్వినమదమ చీచీ కూరిమియాసరో చీచీనవ్వులదేహము చీచీ నమ్మితిఁగా మిమ్మును॥చ2॥ముచ్చటమమత చీచీ ముచ్చుమురిపెమ చీచీబచ్చురపణములోనిబచ్చన చీచీతెచ్చుకోలుతాలిములదిట్టతనమరో చీచీపుచ్చినపోకరో చీచీ పోయఁగా మీకాలము॥చ3॥సిరులచీఁకటి చీచీ సిలుగుసంపద చీచీవరవిభవమ చీచీ వాసిరో చీచీకరుణించెఁ దిరువేంకటగిరిపతి నన్నువిరసవర్తన చీచీ వీడెఁగా మీభారము రాగము: పాడి రేకు: 0032-01 సంపుటము: 1-195 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, పాడిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించిచూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు॥చ1॥ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపుకడలేని యాస చీఁకటి దవ్వుకొనుటనిడివైన కనుచూపు నీడనుండిన యెండవడిచెడని తమకంబు వట్టితాపంబు॥చ2॥బుద్ధిమానిన చింత పోనియూరికిఁ దెరువుపొద్దువోవని వలపు పొట్టపొంకంబుయెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియములొద్దిక విహారంబు లుబ్బుఁగవణంబు॥చ3॥తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని-చూపు దనుఁ బొడగనని చూపు లోచూపు ,ఆపదలువాయు నెయ్యపుఁ దలఁపులీతలఁపురూపైన రుచిలోని రుచి వివేకంబు రాగము: బౌళి రేకు: 0016-02 సంపుటము: 1-96 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥పోయఁ గాలం బడవికిఁ గాయు వెన్నెలకరణినిశ్రీయుతుఁ దలఁచుఁడీ నరులు మాయఁబడి చెడకopen॥చ1॥చిత్తము చేకూరుచుకొని చిత్తైకాగ్రతనుచిత్తజగురునిఁ దలఁచుఁడీ చిత్తజుఁ జొరనీక॥చ2॥బూరుగుమాఁకునఁ జెందినకీరముచందమునఆరయ నిష్పలమగు మరి యన్యులఁ జేరినను॥చ3॥కూరిమి మాతిరువేంకటగిరి గురుశ్రీ పాదములుచేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన రాగము: కన్నడగౌళ రేకు: 0031-07 సంపుటము: 1-194 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కన్నడగౌళపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనెవేదువిడిచిన కూడు వెదకినను లేదు॥చ1॥ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకుపైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాకయేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికికైకొన్నదురితములు కలపాటిగాక॥చ2॥హితవైనమమకార మెందుఁగల దిందరికిప్రతిలేని విరహతాపము కొలఁదిగాకమతిలోని వేడుకలు మరియేమి మనుజులకుజితమైన దైవమిచ్చిన పాటిగాక॥చ3॥యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకుపరిమైనకర్మంబు పరిపాటిగాకయెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁదిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక రాగము: శ్రీరాగం రేకు: 0016-01 సంపుటము: 1-95 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చెఆదలించి తగదు నీ కనువారు వేరీlink॥చ1॥చిత్త మింద్రియములచేఁ జిక్కి , కడు మద-మెత్తిన వద్దన నిఁక వేరీహత్తినమనసు మోహాదులతోఁ గూడితత్తరించిన మాన్పఁదగువారు వేరీ॥చ2॥జీవుఁడిన్నిటికిఁ దాఁ జిక్కి పోయినత్రోవఁబోవఁజొచ్చిన బుద్ధిపొల మేదిశ్రీవేంకటేశుని చింతాపరతఁ గానికావఁగ నాత్మకు గతి దానేది రాగము: బౌళి రేకు: 0031-06 సంపుటము: 1-193 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 25, 2026
॥పల్లవి॥తాప లేక మేడ లెక్కఁదలఁచేముయేపులేని చిత్తముతో యీహీహీ నేము॥చ1॥ఎఱుకమాలినబుద్ధి యెవ్వరైనాఁ బతులంటాతెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేముపఱచైన జవరాలు పరులెల్లా మగలంటావొఱపు నిలిపిన ట్లోహోహో నేము॥చ2॥యిందరును హితులంటా యెందైనా సుఖమంటాపొందలేనిబాధఁ బొరలేముమందమతిఁవాడు యెండమావులు చెరువులంటాఅందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము॥చ3॥మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటానాటకపు తెరువుల నడిచేముగూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటాయేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము రాగము: లలిత రేకు: 0015-06 సంపుటము: 1-94 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...