॥పల్లవి॥అంటఁబారి పట్టుకోరె అమ్మలాల యిదెవెంటఁబారనీదు నన్ను వెడమాయతురుము॥చ1॥కాఁగెడు పెరుగుచాడె కవ్వముతోఁ బొడిచిలేఁగలఁ దోలుకొని అలిగిపోయీనిరాఁగతనమున వాఁడె రాతిరి నారగించఁడుఆఁగి నన్నుఁ గూడడిగె నయ్యో ఇందాఁకను॥చ2॥కొలఁదిగాని పెరుగు కొసరికొసరి పోరికలవూరుఁ గాయలెల్లఁ గలఁచిపెట్టెపలుకఁడు చేతిచట్టి పారవేసి పోయీనదెచెలఁగుచు మూఁటగట్టెఁ జెల్లఁబో యిందాఁకను॥చ3॥మట్టుపడ కిటు నూరుమారులైనా నారగించుఇట్టె యిందరిలోని నాన్నాళ్ళునువెట్టికి నాకొరకుఁగా వేంకటేశుఁ డారగించెయెట్టు నేఁ డాఁకట ధరియించెనో యిందాఁకను రాగము: ఆహిరి రేకు: 0020-04 సంపుటము: 1-122 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అదివో అల్లదివో హరివాసముపదివేలుశేషుల పడగల మయము॥చ1॥అదె వేంకటాచల మఖిలవున్నతముఅదివో బ్రహ్మాదుల కపురూపముఅదివో నిత్యనివాస మఖిలమునులకు-నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము॥చ2॥చెంగట నల్లదివో శేషాచలమునింగినున్న దేవతల నిజవాసముముంగిట నల్లదివో మూలనున్న ధనముబంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥చ3॥కైవల్యపదము వేంకటనగ మదివోశ్రీవేంకటపతికి సిరులైనదిభావింప సకలసంపద రూపమదివోపావనములకెల్లఁ బావనమయము రాగము: శ్రీరాగం రేకు: 0004-03 సంపుటము: 1-23 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వాడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడువాఁడి చుట్టుఁ గైదువ వలచేతివాఁడు॥చ1॥కారిమారసుతుని చక్కని మాటలకుఁ జొక్కిచూరగా వేదాలగుట్టు చూపినవాఁడుతీరని వేడుకతో తిరుమంగయాళువారిఆరడి ముచ్చిమి కూటి కాసపడ్డవాఁడు॥చ2॥పెరియాళువారి బిడ్డ పిసికి పైవేసినవిరుల దండల మెడవేసినవాఁడుతరుణి చేయి వేసిన దగ్గరి బుజము చూఁచిపరవశమై చొక్కి పాయలేని వాఁడు॥చ3॥పామరులఁ దనమీద పాటలెల్లాఁ బాడుమంటాభూమికెల్లా నోర నూరి పోసినవాఁడుమామకూఁతురలమేలుమంగ నాచారియుఁ దానుగీముగానే వేంకటగిరి నుండేవాఁడు రాగము: భూపాళం రేకు: 0020-03 సంపుటము: 1-121 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందిర వడ్డించ నింపుగనుచిందక యిట్లే భుజించవో స్వామి-॥చ1॥అక్కాళపాశాలు నప్పాలు వడలుపెక్కైనసయిఁదంపుపేణులునుసక్కెరరాసులు సధ్యోఘృతములుకిక్కిరియ నారగించవో స్యామీ॥చ2॥మీరినకెళంగు మిరియపుఁదాళింపుఁ –గూరలు కమ్మనికూరలునుసారంపుఁబచ్చళ్ళు చవులుగ నిట్టేకూరిమితోఁ జేకొనవో స్వామీ॥చ3॥పిండివంటలునుఁ బెరుగులుఁ బాలుమెండైన పాశాలు మెచ్చి మెచ్చికొండలుపొడవు కోరి దివ్యాన్నాలువెండియు మెచ్చేవే వేంకటస్వామీ రాగము: శ్రీరాగం రేకు: 0004-02 సంపుటము: 1-22 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥బాపు దైవమా మా పాలిభవమాతీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం॥చ1॥కాలనేమిపునుకిది కంచువలె లెస్స వాఁగీతాళమొత్తరే తత్త తత తత్తత్తకాలమెల్ల మాభూతగణమెల్ల వీఁడె కాచెనేలఁబడి నేఁడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం॥చ2॥పగగొని మానక పచ్చి నెత్తు రెప్పుడునుతెగి కొనుఁ దానె తిత్తి తిత్తి తిత్తితితగుమహోదరువీఁపు దణధణమని వాఁగీబిగీ యుంచరే తోలు బింభిం బింభిం బింభింభిం॥చ3॥మురదనుజుని పెద్దమొదలియెముకఁ దీసితురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తుతిరువేంకటగిరిదేవుఁడు గెలిచిన స-మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ రాగము: మాళవి […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దురితదేహులే తొల్లియును శ్రీ-హరి భజించి నిత్యాధికులైరి॥చ1॥అనంతకోటి మహామునులు ఈ-సనకాదులు నిశ్చలయశులుఇనశశినయనుని నితనిని మునుగని భజించి గత కల్మషులైరి॥చ2॥అతిశయమతులు మహామహులు సుఖ-రతి విముఖులును చిరంతనులుహిత విచారమతి నితనిని సం-తతమును భజించి ధన్యులైరి॥చ3॥దేవతాధిపులు దివ్యులును కడుఁ-బావనులును తగ బరహితులుయీ వేంకటపతి నితనినిసేవించి సుఖాంచితమతులైరి రాగము: శుద్ధవసంతం రేకు: 0004-01 సంపుటము: 1-21 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తోరణములే దోవెల్లామూరట బారట ముంచినలతల॥చ1॥కూరిమిమటములు గోపురంబులునుతేరుపడగెలే తెరువెల్లాకోరినపండ్లు గురిసేటితరువులుతోరములైనవెదురుజొంపములు॥చ2॥ఆటలుఁ దిరుపులు నందపుటురువులుపాటలు వనవైభవమెల్లాకూటువ నెమళ్ళ కోవిల గుంపులపేటలఁ దేటలపెనుఁగూటములు॥చ3॥వింజామరలును విసనకఱ్ఱలునుగొంజెగొడుగిలే కొండెల్లాఅంజనగిరిరాయఁడు వేంకటపతిసంజీవని పరుషల కొదవఁగను రాగము: ఆహిరి రేకు: 0020-01 సంపుటము: 1-119 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అన్నియును నతని కృత్యములేయెన్నియైనానవు నతఁడేమి సేసిననుlisinopril and drivinglisinopriland.netlisinopril and drivingarcoxiaarcoxia tablete cijena॥చ1॥అణురేణు పరిపూర్ణుఁడవలి మోమైతేనుఅణువౌను కమలభవాండమైనఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతేతృణమైన మేరువౌ స్థిరముగా నపుడే॥చ2॥పురుషోత్తముని భక్తి పొరపొచ్చ మైతేఎరవులౌ నిజసిరులు ఎన్నైననుహరిమీఁది చింత పాయక నిజం బైతేనిరతిఁ బట్టినవెల్లా నిధానములే॥చ3॥మదనగురుని సేవ మదికి వెగటైతేనుపదివేలు పుణ్యములు పాపంబులేపదిలమై వేంకటపతి భక్తి గలిగితేనుతుదిపదంబునకెల్ల దొడవవు నపుడే రాగము: శ్రీరాగం రేకు: 0003-07 సంపుటము: 1-20 పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కలలోని సుఖమే కలియుగమా,వెన్నకలిలో నెక్కడిదె కలియుగమా॥చ1॥కడిగడి గండమై కాలము గడపేవుకడుగఁగడుగ రొంపి కలియుగమాబడలికె వాపవు సరమేదో చూపవుగడిచీటియును నీవు కలియుగమా॥చ2॥కరపేపు కఱతలే మఱపేవు మమతలేకరకఱ విడువవు కలియుగమాతెరచీర మఱఁగింతే తెరువేల మూసేవుగరునేల దాఁటేవో కలియుగమా॥చ3॥కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవుకానీలే కానీలే కలియుగమాపైనిదే వేంకటపతి దాసులుండఁగకానవా నీ విదేమి కలియుగమా రాగము: సామంతం రేకు: 0019-06 సంపుటము: 1-118 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...