కడప జిల్లాకు చెందిన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి ‘కుట్ర’ పేరుతో రాసిన కథ (కధానిక). జ్యోతి మాసపత్రిక 1981 నవంబరు సంచికలో ప్రచురితమైన ఈ కథ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం…పూర్తి వివరాలు ...
ఆపదేనా? అనే పేరుతో రారా గా ప్రసిద్దులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన కథ. 1984 సెప్టెంబరు నాటి ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురితం.పూర్తి వివరాలు ...
ఉదయం 6 గంటలకు మంచం మీద నుండి లేవడానికి కునికిపాట్లు పడుతుండగా సెల్ఫోన్ మోగింది. ఇంక లేవక తప్పలేదు. అవతలి నుండి ‘విశ్వనాథ్ గారా?’ కన్నడంలో అడిగారెవరో. నాకు కన్నడం రాదు. అతను చెప్పిన పేరు నాదే. ‘ఔను. విశ్వనాథ్నే మాట్లాడుతున్నా’. అవతలి నుండి, తన పేరు రఘురామ సోమయాజి… అంటూ కన్నడంలో చెప్పుకుపోతున్నాడు. నేను ఇంగ్లీషులో అడిగే ప్రయత్నం చేసినా, అతను కన్నడంలోనే చెప్పుకుపోతున్నాడు. అతని మాటల్లో అక్కడక్కడా వినిపించిన ఇంగ్లీషు పదాల ఆసరాగా కొంత […]పూర్తి వివరాలు ...
రెడ్డేరోళ్ల ఆదిరెడ్డి ఇంటిముందు బ్యాండు మేళాలు ఉన్నట్టుండి మోగడంతో జనం సందడిగా గుమిగూడినారు. రేపు దగ్గరలోని టవున్లో ఆదిరెడ్డి కొడుకు విష్ణూది పెళ్లి. పెళ్లికి ముందు జరిపే దాసర్ల కార్యం ఆదిరెడ్డి ఇంట్లో జరుగుతోంది. దాసర్ల కోసం కుండలూ, బానలు తెచ్చి రామస్వామి దేవళం ముందు ఆవరణలోని వేపచెట్టు కింద పెట్టి సున్నపు నీళ్లు కలిపిన గుడ్డతో వాటిపై తెల్లటి పట్టెలు గీస్తున్నాడు కుమ్మరిశెట్టి. ఆడోళ్లంతా అక్కడ చేరి సాంగెపు పనులు చక్కబెడుతూ చతుర్లు విసురుకుంటున్నారు. సారేకాలు, […]పూర్తి వివరాలు ...
‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ పూర్తి వివరాలు ...
”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ వంటలు సేచ్చాండారు? ఏఏ ఊర్లనుండీ చుట్టాలు వచ్చినారు? ఊళ్ళో దేవుని మేరవని ఎట్ల జేచ్చే బాగుంటది? పార్యాట ఆపొద్దు ఏ జామున యాటపొట్టేళ్ళు, […]పూర్తి వివరాలు ...
పడమటి పక్క పొద్దు నల్లమల కొండల్లోకి సిన్నగ జారిపాయ. జంగిలిగొడ్లు కాయను మిట్టకు పోయిన ఆవుల రామన్న, మేకల్ను తోలకపోయిన చెవిటి కమాల్ అప్పుడే ఊళ్ళోకి బరుగొడ్లను, మేకల్ను తోలకచ్చిరి, సవరాలు, గడ్డాలు, చెయ్యడానికి పక్క పల్లెలకు పోయిన మంగళోల్ల రామన్న సంకకు పెట్టె,భూజాన మూటె ఎత్తుకుని వచ్చినాడు. ఏట్టో గుడ్డలుతకడానికి బొయిన సాకలోల్లు ఉతికిన గుడ్డల మూటల్ను ఈపునెత్తుకొని వర్సగా గూడ్సుబండ వచ్చినట్లు వచ్చాండిరి. చేలల్లోకి పన్లకు పోయిన ఆడోళ్ళునెత్తిన గడ్డిగంపలెత్తుకుని కొందరు, కూరాక్కు తమేటాలో, […]పూర్తి వివరాలు ...
మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లాయర్లు , వాళ్ళ జూనియర్లు,ప్లీడరు గుమాస్తాలతోపాటూ రకరకాల కేసుల్లో ముద్దాయిలుగా,సాక్షులుగా వచ్చినవారితోనూ,వారిని వెంటబెట్టుకుని వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళతోనూ కాస్తంత సందడిగానే వుంది. చెట్టు క్రింద వున్న సిమెంటు బెంచీలవద్ద, కాంపౌండ్ లోనూ ఓ వారగా వున్న టీ క్యాంటీన్ వద్ద వున్న కొందరు లాయర్లు, బోనులో నిల్చున్నపుడు ప్రతివాది తరపున అడిగే ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు చెప్పాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తుండగా మెజిస్ట్రేట్ గారు అడిగే […]పూర్తి వివరాలు ...
“నాయినా, నాయినా” అని పరిగెత్తుకుంటా వొచ్చె మా పిల్ల నాకొడుకు నిన్న తెల్లార్తో జలదాట్లో నీల్లు పోసుకుంటాంటే. “ఏంటికిరా అట్ల గస పోసుకుంటావొస్తివి ?” అనడిగితి సబ్బుతో వొల్లు రుద్దుకుంటా. “నీ సెల్లు పోను మోగుతాంది, అది చెప్తామనే వొస్తి ” అని చెప్పె. “సరేపా, వస్తాండాగనీ” అంటి చెంబుతో నీల్లు మింద కుమ్మరిచ్చుకుంటా. “ఇబ్బుడికి రొండుతూర్లు మోగిండాది” అనె వాడు ఆట్నించీ ఎల్లబారకుండానే. “అట్లనా , ఎవురు చేసినారో చూస్తివ్యా”? అనడిగితి. “ఆ, చూసినా, ‘ […]పూర్తి వివరాలు ...