ఊరూ వాడా సొదుం జయరాం కథ మా ఆవిడకు బ్రెయిన్ వాష్ చెయ్యడమన్నది నా వల్ల అయ్యే పనికాదు. ఆవిడ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిందంటే దాన్నుంచి ఒక్క ఇంచ్ కదలించడం కూడా కష్టమే. కానీ ఓటమిని అంగీకరించడం నాకూ ఇష్టంలేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో మా ఇద్దరి మధ్యా పేచీ ప్రారంభమైంది. “మీరు నూరు చెప్పండి, పల్లెటూరికి అమ్మాయిని ఇవ్వడానికి ససేమిరా నేనొప్పుకోను” అంది ఖచ్చితంగా అరుణ. “పల్లెలంటే పూర్వంలాగానే వున్నాయనుకుంటున్నావేమో. అదేం కాదు. పల్లెలు […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ పాడె చిన్నపురెడ్డి కాలమైపోయాడు. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కదా? మంచానా కుంచానాపడి, తాను ఇబ్బందిపడీ, ఇతర్లను ఇబ్బంది పెట్టకుండా చాలా సుఖమైన చావు చచ్చాడు. చావడమైతే సుఖంగానే చచ్చాడు కానీ, చచ్చిన తర్వాత ఆయన శవానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ని కడసారిగా చూడవచ్చిన వాళ్లూ ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నపురెడ్డి బ్రతికి వుండగా, ఆయన మూలంగా ఏ ప్రాణీ ఇబ్బంది పడలేదు. గ్రామంలో అందరికి తలలోని నాలుకలాగా మసలుకున్నాడు. చదువుకున్నది వీధిబళ్లోనే అయినా, ప్రబంధాలూ, […]పూర్తి వివరాలు ...
తాకట్టు అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె […]పూర్తి వివరాలు ...
నూకా రాంప్రసాద్ కథ ‘కరువు’ ఆ మేఘానికి మేమంటే ఎందుకంత చిన్నచూపో? నీళ్లో రామచంద్రా అని మేమల్లాడుతుంటే ఒక పక్క ఉధృతంగా వానలు కురిసి వరదలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మేఘం గిరిగీసుకుని వర్షిస్తోందని పెద్ద అనుమానం. ఈ సంవత్సరం కూడా నైరుతీ బుతుపవనాలు మోసం చేశాయి. అదనుకు పదును పడే సూచనలు కన్పించడం లేదు. రైతుల బతుకుల్లో ప్రతికూల పవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశకు విస్తరించే తుఫాన్లుగా మారాయి. “ఏందిరా సంటోడా, ఆలోశ్యన్లో పడ్న్యావ్ […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ ‘శని’ “ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు. అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి : “కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు. “మార్చిగదా, యిప్పుడే ఎండలు మొదలయ్యాయి”. “అది సరే సావిత్రి కనిపించదేం?” అన్నాడు ఆదిరెడ్డి. “ఇంట్లో భోంచేస్తోంది” కేశవ అన్నాడు. ఇంట్లో భోంచేస్తున్న సావిత్రి […]పూర్తి వివరాలు ...
దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెక రాల ఖర్చూ, గుత్తా వెరసి […]పూర్తి వివరాలు ...
చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోరవిపత్తు ఏదీ ముంచుకు రాలేదు. ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది. ఆ ఇంటిల్లిపాదీ బాధకు కారణం అదీ. దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకొనేవాళ్లం. పరువు ప్రతిష్టలు గంగలో కలిపి పాడుపని చేసి చచ్చింది.” అంటూ విమల చెల్లెలు సుధ ఉదయం నుంచీ వెక్కి వెక్కి […]పూర్తి వివరాలు ...
పెద్దకూతురు హరిత పుట్టిల్లు చేరి మూడు మాసాలు దాటింది. ‘తరాలు మారాయి సంస్కారాల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. సామరస్యానికి మార్గమేమిటో ఏ రకంగా కుదురుతుందో అది?” అని హరిత తల్లి కస్తూరి తల్లడిల్లింది. సంస్కారం కొలిమిలో కాల్చటానికి తన కూతురు ఇనుమూకాదు, ఇత్తడీ కాదు, మనిషి రక్తమాంసాలున్న మనిషి. వాడి పీహెచ్.డి. చదువూ, ఆ యూనివర్శిటీ లెక్చరరు ఉద్యోగమూ తగలెయ్యనా? అని హరిత తండ్రి లెనిన్ బాబుకు ఆగ్రహం కలిగింది. తల్లిదండ్రుల తల్లడిల్లడాలూ, ఆగ్రహాలూ కాపురాల్ని సంధించలేవు. […]పూర్తి వివరాలు ...