మైదుకూరు: ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి శుక్రవారం శాసనసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమానపరిచారని ఈ నేపథ్యంలో సెక్షన్ 168 కింద విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు.పూర్తి వివరాలు ...
హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సహచర ఎమ్మెల్యేలు తిరువీధి జయరాములు, షేక్ బేపారి అంజాద్బాషాతో కలిసి మాట్లాడుతూ ‘రాయలసీమలో కరువు ఉందంటూనే చిత్తూరు, అనంతపురం జిల్లాలో 1200 అడుగుల లోతుకు […]పూర్తి వివరాలు ...
ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళన కడప: జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకోవాలని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఊరికోమాట, రోజుకో ప్రకటన ఇవ్వడం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టటానికే చేస్తున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు, కవులు, సాహితీవేత్తలు ఉన్న ప్రాంతంలో కాకుండా కర్నూలులో విశ్వవిద్యాలయం స్థాపిస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉర్దూ విశ్వవిద్యాలయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరగుతున్న […]పూర్తి వివరాలు ...
మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
కడప: వీరపనాయునిపల్లిలో గాలేరు నగరి ప్రాజక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం విరమించారు. భవిష్యత్తులో అసెంబ్లీ వేదికగా పోరాటాలు చేయాల్సి ఉన్నందున దీక్ష విరమించాలని అఖిలపక్ష నాయకులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తొలుత ససేమిరా అన్నా.. చివరకు వారి ఒత్తిడి మేరకు, భవిష్యత్తు పోరాటాల దృష్ట్యా దీక్ష విరమణకు ఎట్టకేలకు రవీంద్రనాథ్ రెడ్డి అంగీకరించారు. దాంతో వైఎస్ వివేకానందారెడ్డ వైకాపా ఎమ్మెల్యేలు నిమ్మరసం […]పూర్తి వివరాలు ...
కమలాపురం: ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ‘గాలేరు-నగరి’కి నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి డిమాండ్ చేశారు.‘ప్రజా పోరాటాలకు కమలాపురం నియోజకవర్గం పుట్టినిల్లు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం’ అని ఆయన అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ […]పూర్తి వివరాలు ...
గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగమైన సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని కోరుతూ కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాద్ రెడ్డి ఆదివారం మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ … ‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో […]పూర్తి వివరాలు ...
కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...