ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి , గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. నలభై ఐదు అంతస్థుల భవనాలు నిర్మించడం ప్రమాదం కావచ్చని వారు హెచ్చరించారు.కర్నూలుకు అన్ని అర్హతలు ఉన్నా చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మోహన్ రెడ్డి విమర్శించారు. […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ […]పూర్తి వివరాలు ...
కడప: కామ్రేడ్ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివని – ఆయన పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు, కర్షకులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశ లు పాటుపడ్డారని ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిబాషించారు. ఎద్దుల ఈశ్వరరెడ్డి జయంతి సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అంశం పై స్థానిక నూర్-ఏ-జహాన్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఎన్ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ పూర్వ సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎద్దుల […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప ఇందిరా భవన్లో నియోజకవర్గ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మీరు ముక్కుసూటిగా […]పూర్తి వివరాలు ...
ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కమిషనర్ ప్రభాకర్‌రావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎస్.పురుషోత్తం(ఒకటోవార్డు), వి.సరస్వతి(మూడో వార్డు), ఎ.గంగాభవాని (అయిదోవార్డు), జి.నారాయణరెడ్డి(ఆరోవార్డు), ఎస్.ఆసియాబేగం(పదోవార్డు), జె.మహిత(పన్నెండోవార్డు), ఎస్.మస్తాన్‌వలి(పదమూడోవార్డు), వి.లక్ష్మి(పద్నాలుగో వార్డు) కౌన్సిలర్లు ఉన్నారని ఆయన వివరించారు. నగర పంచాయతీకి జులై నెల 3న జరిగిన మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల సమయంలో […]పూర్తి వివరాలు ...
రాజంపేట: విప్‌ను ధిక్కరించి తెదేపాకు ఫిరాయించిన రాజంపేట మండలపరిషత్తు అధ్యక్షురాలు సుహర్లతపై అనర్హత వేటు పడింది. ఈమె ఏప్రిల్‌లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మండలంలోని వూటుకూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరుపున పోటీచేసి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో తెదేపా ప్రలోభాలకు లొంగి ఈమె వైకాపా నుండి ఫిరాయించి లాటరీ పద్ధతిలో తెదేపా తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించడం వల్ల వైకాపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు విచారణ […]పూర్తి వివరాలు ...
కడప కార్పోరేషన్ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా పన్ను కట్టకుండా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు, సంస్థల పేర్లను ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. సదరు కధనం ప్రకారం పన్ను కట్టనివాళ్ళ జాబితా ఇదే… ఫాతిమా మెడికల్ కాలేజ్ రూ.81 లక్షల 77వేల 282, ఫాతిమా ఇంజనీరింగ్ కాలేజ్ రూ.14 లక్షల 77 వేల 392 నిర్మలా హాస్పిటల్ అండ్ క్వార్టర్స్ రూ.19 లక్షల 11 వేలు సరస్వతి విద్యాలయం రూ.12 లక్షల 86 వేల 714 దేశం […]పూర్తి వివరాలు ...
జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖామంత్రి రావెల కిశోర్‌బాబు ఈ రోజు జిల్లాకు వస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి రోడ్డుమార్గాన రాజంపేటకు బయలుదేరి మధ్యాహ్నం గం.1.30కు చేరుకొని, స్థానిక ర.భ.శాఖ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం గం.4.00కు కడపకు చేరుకొని, అక్కడి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బసచేసి 15న కడపలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు […]పూర్తి వివరాలు ...