భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయ మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, భారతీయ భాషల అభివృద్ధికి కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్(సీసీఐఎల్) కృషి చేస్తోంది. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. […]పూర్తి వివరాలు ...
2013 సంవత్సరానికి గాను ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి కార్టూనిస్టు సురేంద్ర ఎంపికయ్యారు. ఈ నెల 29వ తేదీన ‘కార్టూన్ ఫెస్టివల్’లో భాగంగా రాయ్ పూర్ లోజరిగే కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. చత్తీస్ఘడ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి బ్రుజ్మోహన్ అగర్వాల్ లు పురస్కార ప్రదానోత్సవానికి హాజరవుతారు. ‘కార్టూన్ వాచ్’ దేశంలోని ఏకైక కార్టూన్ మాస పత్రిక. గతంలో ఆర.కె.లక్ష్మణ్, అజిత్ నైనన్, సుధీర్ తైలాంగ్ ‘కార్టూన్ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఖాదరాబాద్ గ్రామంలో బుధవారం ‘ప్రేమిస్తే ఇంతే’.. సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు ఖాదరాబాద్‌కు చెందిన రమేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రేమిస్తే ఇంతే… సినిమాలో నేటి యువత ఆకర్షణకు, ప్రలోభాలకులోనై ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవారేనన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ […]పూర్తి వివరాలు ...
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి? నీలం సంజీవరెడ్డి సాగర్ (శ్రీశైలం ప్రాజెక్టు) నుండి రాయలసీమకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ (Pothireddypadu Head Regulator). నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి. ఆ పేరు ఎలా వచ్చింది ? పోతిరెడ్డిపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది. గుంటూరు రహదారి నుండి 4 […]పూర్తి వివరాలు ...
కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం […]పూర్తి వివరాలు ...
గత కొద్ది సంవత్సరాలుగా సివిల్స్‌లో సత్తా చాటుతుతున్న కడప జిల్లా వాసులు, మరోసారి విజయ పతాక మోగించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ – 2012 ఫలితాలలో జిల్లాకు చెందిన మేఘనాథ్‌రెడ్డి, తేజ లోహిత్ రెడ్డి, సగిలి షణ్మోహన్లు మెరుగైన ర్యాంకులు సాధించారు. మేఘనాథ్‌రెడ్డి 55వ ర్యాంకును, తేజ లోహిత్ రెడ్డి 101వ ర్యాంకును, సగిలి షణ్మోహన్ 132వ ర్యాంకును సాధించారు. తేజలోహిత్‌రెడ్డి కమలాపురంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొండారెడ్డి కొడుకు తేజలోహిత్‌రెడ్డి. ఖాజీపేట మండలం సుంకేసుల వీరి సొంతూరు. […]పూర్తి వివరాలు ...
కడప కలెక్టరేట్ బంగ్లా కూడలిలో ప్రతిష్ఠించిన బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏప్రిల్ 27వ తేదిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కడపకు రానున్నారు.ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో మీరాకుమార్ను కలిసిన దళిత నాయకులకు ఆమె అంగీకారం తెలిపారు. 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ భోజనాలను ముగించుకుని కడపకు బయలుదేరుతారు. 3-4 గంటల్లోగా కడపలో జరిగే జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బాబూ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన పద్మ విభూషణ్ ఢాక్టర్ యాగా వేణు గోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 31కల్లా నివేదిక అందజేయాల్సిందిగా ఆర్థిక సంఘాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం చెప్పారు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (ప్రణాళికా సంఘం సభ్యుడు), సుష్మా నాథ్ (మాజీ కేంద్ర ఫైనాన్స్ కార్యదర్శి సభ్యులు), డాక్టర్ ఎం గోవిందరావు (డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ), సుదీప్తో ముండ్లే […]పూర్తి వివరాలు ...
కడపలో స్టార్ హోటల్ సదుపాయం, విమానశ్రయం అందుబాటులోకి వస్తే వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ క్యూరేటర్ నారాయణరాజు అన్నారు. 2002 నుంచి కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌కు చీఫ్ క్యూరేటర్‌గా పనిచేసిన ఈయన ఇటీవలే బీసీసీఐ క్యూరేటర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి కడపకు వచ్చారు. శనివారం ఆంధ్రా, కేరళ జట్ల మధ్య జరగనున్న రంజీ మ్యాచ్‌కు సంబంధించిన పిచ్‌ను పరిశీలించడానికి బీసీసీఐ నుంచి వచ్చిన నారాయణరాజు రాజారెడ్డి స్టేడియాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దేశంలోని పెద్దపెద్ద […]పూర్తి వివరాలు ...