వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వేలాదిగా తరలిరావాల్సిందిగా 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నిర్వాహకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తితిదే కల్యాణమండపంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను తితిదే ధర్మప్రచార మండలి సభ్యులతో కలిసి పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు ఆవిష్కరించి ప్రసంగించారు. లోకహితాన్ని తెలిపిన పోతన భాగవత పద్యాలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమం ఇదన్నారు. తెలుగు వికాసాన్ని కోరుకునే తల్లిదండ్రులు, పవిత్ర భారతీయ […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాలో పుట్టి తెలుగుజాతికి వేగుచుక్కలుగా వెలుగొందిన అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మంలు సమాజిక రుగ్మతలపై ఆనాడే తమ కలాలను ఝులిపించి, గలమెత్తారని, వీరిలో వేమన తన ధిక్కారస్వరాని బలంగా వినిపించారని ఆదివారం కడపలో జర్గిన “వేగుచుక్కలు” పుస్తక పరిచయ సభలో వక్తలు కొనియాడారు. యోగివేమ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకురాలు రచయిత్రి ఎంఎం వినోదిని రచించిన వేగు చుక్కలు పుస్తకావిష్కరణ సభ జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వేదికగా జరిగింది. […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో నిల్వ ఉన్న 1166 టన్నుల ఎర్రచందనం మొదటి విడత టెండర్లలో సుమారు రూ.315కోట్లు ధర పలికింది. ఎర్రచందనానికి నిర్వహించిన ఈ టెండర్లలో వ్యాపారులు కడప జిల్లాలో నిల్వ ఉన్న ఎర్రచందనానికి టెండర్లు పాడారు. వీటిలో బీ, సీ గ్రేడులు మాత్రమే ఉన్నాయి. వీటిలో బీ గ్రేడు ఎర్రచందనం కేవలం సుమారు రెండు టన్నులు మాత్రమే ఉండగా మిగిలిన 1164 టన్నులు సీ గ్రేడ్ ఎర్రచందనం. ఈ మొత్తానికి మొదటి విడతలో ఈ టెండర్లు పిలిచారు. […]పూర్తి వివరాలు ...
వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఘనత కడప : కాకినాడలో నవంబరు 27, 28 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి 60వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు 23 పతకాలను సొంతం చేసుకుని కడప జిల్లా సత్తా చాటారు. మొత్తం 8 బంగారు, 11 రజతం, 4 కాంస్య పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. అండర్-14 బాలికల విభాగంలో కడపకు టీం ఛాంపియన్షిప్ వచ్చింది. అండర్-17 బాలుర విభాగంలో కడప జట్టు మూడవస్థానాన్ని పొందింంది. విజయవాడలో […]పూర్తి వివరాలు ...
కడప: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అంకాళమ్మగూడూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గతనెల కృష్ణా జిల్లాలో సీబీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 60వ హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారన్నారు. అండర్-14 బాలుర విభాగంలో కె.పెద్దిరాజు, బాలికల విభాగంలో దీపిక, కడపనాగయ్యపల్లికి చెందిన లక్ష్మీచంద్రిక, తేజస్విని ఈ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్-17 బాలికల విభాగంలో […]పూర్తి వివరాలు ...
కడప: మైదుకూరు సమీపంలోని రాణిబాయి దగ్గర ఉన్న ‘మల్లుగానిబండ’పై ఆదిమానవులు గీసిన బొమ్మలను (రేఖా చిత్రాలను) యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ వెలుగులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ శనివారం ఈ రేఖాచిత్రాలను విడుదల చేశారు. చిత్రాలను అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం అవి బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగాలకు చెందినవిగా తేల్చింది. చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ […]పూర్తి వివరాలు ...
దేశంలోని అన్ని నదులకూ 12 యేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తే.. పెన్నానదికి ప్రతియేటా ఫాల్గుణ మాసం లో పున్నమి రోజున ఒకరోజు పుష్కరాలు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి శ్రీ సొట్టు సాంబమూర్తి వెల్లడించారు. రాష్ట్రంలొ గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల తర్వాత అతి పెద్దనదిగా పెన్నానది గుర్తించబడింది. కర్నాటకలోని నంది కొండల్లో పుట్టి రాష్ట్రంలోని అనంతపురం, కడప, నెల్లురు జిల్లాలలో దాదాపు 597 కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రాయలసీమలోని అనంతపురం, […]పూర్తి వివరాలు ...
రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి. సీమ రైతులు , తమ కంట్లో పెల్లుబుకుతున్న కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ నీటిచెమ్మ కోసం భూమిని 500 అడుగుల లోతు దాకా […]పూర్తి వివరాలు ...
అండర్-17 విభాగంలో 5 బంగారు పతకాలు అండర్-14 విభాగంలో 11 బంగారు పతకాలు కడప: విజయవాడలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఈత(స్విమ్మింగ్) పోటీలలో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. మొత్తం 29 పతకాలను (16 బంగారు, 11 వెండి, 3 కాంస్య పతకాలు) సొంతం చేసుకుని కడప జిల్లా కీర్తి పతాకను ఎగరేశారు. పతకాలు సాధించిన విద్యార్థులలో 11 మంది డిసెంబరు 15 నుంచి 20వ […]పూర్తి వివరాలు ...